somireddy chandra mohan reddy comments on vijayasai reddy

దోచేసిన నల్ల డబ్బుతో సేద్యం చేస్తావా ఏంటి..?: సోమిరెడ్డి

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని అన్నారు. సేద్యం చేస్తానంటున్నావ్.. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీశారు.

Advertisements

2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేశావని విజయసాయిరెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మండిపడ్డారు. గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్‌గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగించావని అన్నారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్లా అని ప్రశ్నించారు. అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తును ముందు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

image

దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు.. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ రాజీనామాల పరంపరం ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదని.. రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని సోమిరెడ్డి అన్నారు.

Related Posts
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌లకు దక్కని ఊరట
IAS officers did not get relief in the high court

హైదరాబాద్‌: క్యాట్ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వీరి పిటిషన్లపై బుధవారం మధ్యాహ్నం కోర్టు Read more

చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే అనిరుధ్
mla anirudh

తిరుమలలో తెలంగాణ MLAల రికమండేషన్ లెటర్ల చెల్లవనడంపై జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యంలో నెట్టాయి. ఆయన, తమ లెటర్లు చెల్లకపోతే చంద్రబాబు Read more

Tushar Gandhi: తుషార్‌ గాంధీ అరెస్ట్‌కు బీజేపీ డిమాండ్‌
BJP demands arrest of Tushar Gandhi

Tushar Gandhi: మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్‌ గాంధీని అరెస్ట్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. తుషార్‌ ఇటీవల తిరువనంతపురంలో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌ చాలా Read more

Vishwak Sen: టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ

టాలీవుడ్ యువహీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8 లోని విశ్వక్ సేన్ Read more