అప్పులు తెచ్చి వేసిన వరి పంట నీరందక కండ్ల ముందే ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఊరి కొయ్యలే ఉచ్చుగా బిగించుకొని రైతు తనువు చాలించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రగోత్తంపల్లి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి మోహన్ రెడ్డి రైతుకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు యాసంగి వరి సాగులో ఉన్న భూమిలో వరి సాగు చేశాడు. తీరా పంట పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో అప్పులు తెచ్చి బోరు వేసిన చుక్క నీరు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి దాపరించి కండ్ల ముందే వేసిన పంట ఎండిపోయి కనిపిస్తుంటే చేసిన అప్పులు తీరక ఏం చేయాలో పాలు పోలేని రైతు దిగులు చెంది తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read also: Telangana: ఎగుమతులు నిలిచిపోవడంతో భారీగా పడిపోయిన గుడ్ల ధరలు
STragedy in Siddipet — Farmer Commits Suicide Due to Lack of Irrigation Water
చిన్నారి కూతుళ్ల దీనస్థితి.. ఆదుకోవాలని వేడుకోలు
ఇది చూసినా కొందరు రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఎటు చూసినా ప్రతి సమస్య రైతులకే దాపరిస్తుందంటూ మృతి చెందిన రైతును శవాన్ని చూసిన వారంతా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా మృతునికి ఇద్దరు చిన్నారి కూతుళ్లు ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: