ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, మంచి వాతావరణం కోసం చాలా మంది తోటలో విభిన్న రకాల మొక్కలను పెంచుతారు. అయితే అందంగా కనిపించే కొన్ని మొక్కలు మనకు హానికరమైన జీవులను ఆకర్షించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాములు నివసించడానికి అనుకూలమైన నీడ, చల్లదనం, దట్టమైన ఆకులు ఉండే మొక్కలు వాటిలో ముఖ్యమైనవి. అందుకే కొన్ని మొక్కలను ఇంటి తోటలో నాటే ముందు అప్రమత్తంగా ఉండాలి.
ఇవి ఉంటె పాములు వస్తాయి
నిమ్మ మొక్క, మల్లె చెట్టు, జాస్మిన్ వైన్స్ వంటి మొక్కలు ఎక్కువగా దట్టంగా పెరిగే గుణం కలిగి ఉంటాయి. ఈ మొక్కలు ఎలుకలు, తేళ్లు, కీటకాలు వంటి జీవులకు ఆశ్రయంగా మారుతాయి. అవి అక్కడ నివసించడం వల్ల వాటిని వేటాడే పాములు కూడా ఇంటి చుట్టూ తిరిగే అవకాశముంటుంది. ప్రత్యేకంగా మల్లె చెట్టు తెల్లని పువ్వులు, వాసన ఉన్నా కూడా దట్టంగా ఉండటం వల్ల దీనిలో పాములు దాక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ మొక్కలకు పాములను ఆకర్శించే గుణం
చందనం, సైప్రస్ వంటి మొక్కలు చల్లదనం, నీడ, సువాసన కలిగినవిగా ఉండటం వల్ల కూడా పాములను ఆకర్షిస్తాయి. ఈ మొక్కలు అలంకారంగా కనిపించినా, అవి ఎక్కువగా నీడనిచ్చే విధంగా పెరిగే వల్ల పాములకు ఆశ్రయంగా మారుతాయి. అందువల్ల, ఇంటి భద్రత, కుటుంబ సభ్యుల రక్షణ దృష్ట్యా ఇటువంటి మొక్కలను ఇంటి తోటల్లో నాటే ముందు ఆలోచించడం చాలా అవసరం.
Read Also : Odisha : ఒడిశా కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మృతి