Service charges in Delhi restaurants.. High Court angers

High Court : ఢిల్లీ రెస్టారంట్లలో సర్వీస్‌ ఛార్జీలు.. హైకోర్టు ఆగ్రహం

Service charge: ఢిల్లీ హైకోర్టు హోటళ్లు, రెస్టారంట్లు ఆహార బిల్లులలో సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వీస్‌ ఛార్జీలను వినియోగదారులు కచ్చితంగా చెల్లించేలా బిల్లులో వాటిని కలిపి ఇవ్వడం వారి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వ్యాపార విధానాలతో సమానమని మండిపడింది. సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాలా.. వద్దా..? అనే విషయాన్ని కస్టమర్ల విచక్షణకే వదిలేయాలని సూచించింది.

Advertisements
ఢిల్లీ రెస్టారంట్లలో సర్వీస్‌ ఛార్జీలు

అదనపు ఛార్జీలను విధించే రెస్టారంట్లపై తగిన చర్యలు

ఈ విధంగా వినియోగదారులపై అదనపు ఛార్జీలను విధించే రెస్టారంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థకు సూచించింది. హోటళ్లు బిల్లులలో సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) గతంలో చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ పలు రెస్టారంట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్‌ ఛార్జీలు

కొన్ని రకాల హోటళ్లు, రెస్టారంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్‌ ఛార్జీలు.. పన్నుల కిందికి రావని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రకటించింది. వీటిని సేవా పన్నుగా పరిగణించడం పొరపాటేనని తెలిపింది. వాటి చెల్లింపులను వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు అన్ని హోటళ్లలో బోర్డు ప్రదర్శించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలి. అయినప్పటికీ హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్‌ ఛార్జీలు విధిస్తున్నాయి.

Related Posts
నేడు సాలూరులో పవన్ కల్యాణ్ పర్యటన
Pawan Kalyan visit to Kadapa today

విశాఖ: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. నేడు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం పవన్‌ Read more

SLBC Tunnel: 36వ రోజుకు చేరుకున్నఎస్ఎల్‌బీసీ సహాయక చర్యలు
SLBC Tunnel: SLBC టన్నెల్ ప్రమాదం- 36 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. రెస్క్యూ బృందాలు చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు నిరంతర Read more

నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే
Ashwini Vaishnaw

క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ అమలు Read more

కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఊహించిన పోలీసులు మంగళవారం హైదరాబాద్ లో పలువురు బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×