దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న రిలీజ్ అయ్యి, భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది.ఇందులో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రలో మెరిసింది.2023 డిసెంబర్ 7న విడుదలైన ఈ సినిమా, నాని అభిమానులకు ఇంకా మరింత దగ్గరయ్యింది. నాని ప్రస్తుతం వరుసగా హిట్స్ అందుకుంటున్నాడు.దసరా సినిమాతో ప్రారంభించిన విజయానికి, సరిపోదా శనివారం వంటి హిట్ సినిమా వచ్చింది.ఇప్పుడు, హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విజయాల మధ్య, నాని నటించిన హాయ్ నాన్న చిత్రం ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది.

హాయ్ నాన్న ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.ఈ చిత్రంలో నాని నటనను మరింత మెచ్చుకున్నారంతా.మృణాళ్ ఠాకూర్ కూడా ఈ సినిమాకు ముఖ్యమైన అస్తిత్వాన్ని ఇచ్చింది.థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం,ఓటీటీలో కూడా మంచి ఆదరణను పొందింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా కాపీ కథనాలతో వివాదంలో ఉంది.కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య, భీమ సేన నలమహారాజు సినిమాకి కాపీ కొట్టి హాయ్ నాన్న తీసుకున్నారని ఆరోపించారు.తాను నిర్మించిన సినిమాకు సంబంధించిన కథను కాపీ చేసి ఈ చిత్రం తీసారని, రీమేక్ హక్కులు లేకుండా ఇలా సినిమాలు చేయడం అన్యాయమని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“ఇంత నీచమైన పనులు ఎలా చేస్తారో అర్థం కాదని” అంటూ,పుష్కర మల్లికార్జునయ్య హీరో నాని ను ట్యాగ్ చేశారు. ఈ ఆరోపణలపై హాయ్ నాన్న టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం,నాని అభిమానులు ఈ వివాదంపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.హాయ్ నాన్న చిత్రంపై తాము ఉన్న అభిప్రాయాలను అభిమానులు పంచుకుంటున్నారు. కొందరు ఈ సినిమా కథనంపై ఆశక్తి చూపగా, మరికొందరు ఈ వివాదం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.