ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఆరుగురు గల్లంతు

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఆరుగురు గల్లంతు

బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైశాలిలో సెల్ఫీ తీసుకుంటూ చెరువులో మునిగి ఆరుగురు పిల్లలు గల్లంతయ్యారు. పిల్లలు ఒక పడవలో వెళ్తూ సెల్పీ తీసుకుంటున్నారు. దీంతో అది కాస్తా బోల్తా పడింది. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని చెరువు నుంచి ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. మిగిలిన వారి మునిగిపోయిన పిల్లల కోసం వెతుకుతున్నారు.
చెరువులో మునిగిన పిల్లలు
బీహార్‌లో భారీ ప్రమాదం జరిగింది. వైశాలిలో పడవ బోల్తా పడి 6 మంది పిల్లలు చెరువులో మునిగి చనిపోయారు. ఈ సంఘటన వైశాలి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు, గజఈతగాళ్ల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలను చెరువు నుండి బయటకు తీశారు. కుటుంబ సభ్యులు వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. నీటిలో మునిగిపోయిన మిగిలిన పిల్లల కోసం ప్రత్యేక బృందాలు సహాయక కొనసాగిస్తున్నారు.
ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో పిల్లలు బలి అయిన కుటుంబాల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పిల్లలందరూ పడవలో సెల్ఫీలు తీసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా పడవ మునిగిపోయింది. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం కోసం పంపారు.

Advertisements
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఆరుగురు గల్లంతు


సెల్ఫీ సరదాలో విషాదం
వైశాలి జిల్లాలోని భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ టాండ్‌లోని లాల్‌పురా గాంధీ మైదాన్ చెరువు వద్ద ఈ సంఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో, చెరువులో మునిగిపోయిన వారికోసం గాలిస్తున్నారు. కాగా గల్లంతైన వారిని ప్రతాప్ టాండ్ షేర్పూర్ నివాసితులుగా గుర్తించారు. 15 ఏళ్ల ప్రియాంషు కుమార్, 17 ఏళ్ల వికాస్ కుమార్ లను లోతైన నీటి నుండి బయటకు తీశారు. మునిగిపోయిన పిల్లలిద్దరినీ కుటుంబ సభ్యులు వెంటనే సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Related Posts
భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు: హైకోర్టు
భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు: హైకోర్టు

భర్త కాకుండా మరో వ్యక్తితో భార్య శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమం సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Read more

ఎన్నికలకు ముందు ఆప్ పార్టీకి షాక్
A shock to AAP before elections ED allowed to investigate Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాలను విచారించేందుకు Read more

మిమ్మల్నందర్నీ గ్వాంటనామో జైలుకు పంపిస్తా: ట్రంప్
donald trump

ఊహించినట్టే- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తోన్న ఏ ఒక్కడ్నీ వదలట్లేదు. వెంటాడుతున్నారు. చాలామందిని ఇప్పటికే చేతికి Read more

బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ .
cm revanth reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీ పరిశ్రమ ప్రముఖులతో చేసిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు పూర్తి Read more

×