ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిల్సాపూర్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. 8వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ టీచర్‌ను హత్య చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా పేలుడు సంభవించే రసాయనాల గురించి తెలుసుకుని, వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించారు.
పగ తీర్చుకునేందుకు పథకం
విద్యార్థులంతా తమ టీచర్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సోడియం నాబ్ అనే రసాయనాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. నీటితో మిళితం చేయగానే భారీ పేలుడు సంభవిస్తుందని తెలుసుకున్న వారు, స్కూల్ వాష్ రూమ్ లో నీటితొట్టెలో సోడియం నాబ్ పోశారు. అయితే అనుకోకుండా టీచర్ స్థానంలో నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి వాష్ రూమ్ కి వెళ్లి ఫ్లష్ నొక్కడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చిన్నారి తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సీసీ ఫుటేజ్
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. స్కూల్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఐదుగురు విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు. ఫిబ్రవరి 23న నలుగురిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది.

ప్రమాదకర రసాయనాలు
పోలీసుల దర్యాప్తులో నిందితుల్లో ఒక విద్యార్థి తన కుటుంబసభ్యుల ఖాతా ద్వారా సోడియం నాబ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు వెల్లడైంది. అయితే, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విద్యార్థులకు అది అందుబాటులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.ఏ షాపు లేదా ల్యాబ్‌లో ఈజీగా అందుబాటులో ఉండవు. వాటి అమ్మకం, కొనుగోలు కోసం కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడంతో అది వారికి చేరింది. ఈ విషయాన్ని నోట్ చేసుకున్నాం.. పరిష్కారం దిశగా ఆలోచిస్తాం” అని స్థానిక ఎస్పీ తెలిపారు. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు. విద్యార్థులను ఎవరైనా బయటి వ్యక్తి ప్రేరేపించారా అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. అందరు విద్యార్థులు 8వ తరగతి చదువుతున్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది
ఇప్పటికే పోలీసులు విద్యార్థులని విచారిస్తున్నారు. వారు స్వతంత్రంగా ఈ హత్యాయత్నం చేయాలని నిర్ణయించుకున్నారా? లేక ఎవరైనా బయట వ్యక్తులు ప్రేరేపించారా? అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటనపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతోందో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. స్కూల్ మేనేజ్‌మెంట్, తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీస్‌పై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.