📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Wayanad landslide: ప్రకృతి ప్రకోపం వయనాడ్ విపత్తు

Author Icon By Hema
Updated: July 26, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Wayanad landslide: ప్రకృతిని సద్వినియోగం చేసుకుని చక్కటి ఫలితాలను పొందాల్సిన తరుణంలో అభివృద్ధి పేరుతో విధ్వంసాలకు పాల్పడితే కలిగే నష్టం ఏమేరకు ఉంటుందో వయనాడ్ దుర్ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

దశాబ్దాల తరబడి పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు కేరళలోని (Kerala) పశ్చిమ కనుమల్లో జరుగుతున్న విధ్వంసం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బేఖాతరు చేశాయి.

సుమారు రెండు దశాబ్దాల నుంచి ప్రకృతి విధ్వంసం యధేచ్చగా కొనసాగింది. 2010లో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటుచేసిన కమిటీ ఇలాంటి విపత్తు భవిష్యత్తులో రాబోతుందని స్పష్టంగా హెచ్చరించింది.

పశ్చిమ కనుమలు అత్యంత సున్నితంగా ఉన్నాయని, ప్రకృతి(nature) పరంగా ఏర్పడిన ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అనర్థం కలుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ అంశాన్ని పెడచెవిన పెట్టారు.

వానాకాలంలో భారీవర్షాల కారణంగా

కొండప్రాంతం నుంచి దిగువకు తీవ్రస్థాయిలో వత్తిడితో కలిగిన ప్రవాహం ముందుకు కదులుతుంది. మార్గమధ్యలో ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఆ ప్రవాహం ఎలాంటి నష్టాన్ని కలుగచేయకుండా నేలకు చేరుకుంటుంది. కొన్ని శతాబ్దాల క్రితమే ఇలాంటి ప్రవాహాలకు అనుకూలమైన భూఉపరితలం ఏర్పడింది. ముఖ్యంగా మన దేశంలో హిమాలయాల్లోను, పశ్చిమ కనుమల్లో, నీలిగిరి కొండల ప్రాంతంలో ఇలాంటి ప్రవాహాలు, కొన్ని సందర్భాల్లో కొండ చరియలు విరిగి పడటం జరుగుతూ ఉంటుంది.

కొండ చరియలు సహజంగా పడటం కంటే మానవ చర్యలు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో గరిష్టస్థాయిలో వర్షం కురిస్తే నీటి ప్రవాహంలో వాహనాలు సైతం కొట్టుకుపోతాయి. నీటి ప్రవాహానికి అడ్డంకులు కలిగిస్తూ ఇష్టారాజ్యంగా కొనసాగిన నిర్మాణాలు, కాలువలపై ఆక్రమణలు కారణం. ఇదే పరిస్థితి పశ్చిమ కనుమల్లో స్పష్టంగా కనిపించింది.

కొండపైభాగం నుంచి వర్షం నీరు సునాయసంగా ప్రవహించడానికి ఉన్న మార్గంలో కట్టడాలు, డ్యాములు, వంతెనలు నిర్మించారు. బహుళ అంతస్తుల నిర్మాణం జరిగింది. దీనితో పై నుంచి వచ్చే ప్రవాహం దారిమళ్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీనితో అడ్డువచ్చిన కట్టడాలను ధ్వంసం చేస్తూ, ప్రవాహం మళ్లింపు సమయంలో కొండచరియలను తోసుకుంటూ నీరు కిందకు వచ్చింది. సాధారణంగా వృక్షాలు నీటి ప్రవాహవేగాన్ని నిరోధించి సాధారణ స్థాయికి తీసుకువస్తాయి. వయనాడ్ సమీపంలోని కొండ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వృక్షాలను నరికివేశారు.

కొండచరియలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు, భారీ నిర్మాణాలు చేపట్టి ప్రకృతికి భిన్నంగా వ్యవహరించారు. పైగా ఈ ప్రాంతంలో గనులు, క్వారీల కోసం ఆధునాతన యంత్రాలు, భారీ వాహనాలు.ఉపయోగించారు. దీనితో కొండపై భాగంలో రాళ్లు, మట్టిలో పటుత్వం లోపించింది. పై నుంచి పల్లానికి ప్రవహిస్తున్న నీటి వేగాన్ని ఇవి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.

స్థాయికి మించి వర్షం కురిసినప్పుడు

సాధారణంగా కొండ రాళ్ల కింద మట్టి, ఇసుక పేరుకుపోయి ఉంటుంది. మట్టి తడిసిపోయి పటుత్వం కోల్పోతుంది. అదేవిధంగా ఇసుక వర్షపు నీటితో పాటు కిందకు ప్రవహిస్తుంది. కొండచరియలపై ఇది సాధారణ స్థాయిలోనే ప్రారంభం అయిన్పటికీ కిందకు వచ్చే సరికి ఉధృతికి గురై పెద్ద పెద్ద బండరాళ్లను సైతం దొర్లించుకుంటూ ముందు సాగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాధారణంగా కొన్ని సంకేతాలు అందుతాయి.

భూకంపం వచ్చే సమయంలో ముందుగా స్వల్ప కదలికలు ఉంటాయి. అదేవిధంగా సముద్రంలో తుఫానులు వచ్చినప్పుడు వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. కొన్ని గంటల ముందు నుంచే నిశబ్ద వాతావరణం ఏర్పడుతుంది. తుఫాను సమయంలో వచ్చే ఇలాంటి మార్పులను మత్య్సకారులు స్పష్టంగా గుర్తిస్తారు. 24 గంటల ముందే పరిస్థితిని గ్రహించి చేపల వేటకు సముద్రంలో వెళ్లడాన్ని విరమించుకుంటారు.

అదే విధంగా కొండచరియలు విరిగిపడటం, విపత్తును కలిగించే విధంగా ప్రవాహం వచ్చినప్పుడు ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతట అవే బిగుసుకుపోతాయి. నేల, గోడల్లో పగుళ్లు కనిపిస్తాయి. స్థంభాలు, వృక్షాలు పక్కకు ఒరిగిపోతాయి. ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తం అయితే ప్రాణనష్టాన్ని నివారించే అవకాశం కలుగుతుంది.

ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా భవన, రోడ్డు నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలను విరమించుకోవాలి.

గుజరాత్ నుంచి ప్రారంభమైన ఈ కనుమలు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి వరకు సుమారు 16 వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. కృష్ణా, గోదావరి, కావేరి వంటి ప్రధానమైన నదులకు తుంగభద్ర, భీమా, మలప్రభ, ఘటప్రభ, హేమావతి, కాబిని వంటి అనేక ఉపనదులకు పుట్టినిల్లుగా ఉన్నాయి.

మన దేశానికి ప్రకృతివరప్రదాయినిగా ఉన్న పశ్చిమకనుమలు రాజకీయ కారణాలతో అడ్డు అదుపులేకుండా ఆక్రమణలకు గురౌతున్నాయి. కొండలను, వృక్షాలను నరికివేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు సైతం పశ్చిమ కనుమల్లో అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం సరికాదని వ్యాఖ్యానించింది.

పశ్చిమ కనుమలతో పాటు ఉత్తరాదిలోని పర్వత ప్రాంతాల్లో, మన రాష్ట్రంలోని నల్లమల. శేషాచలం అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన ప్రకృతిని కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read also: hindi.vaartha.com

Read also: Illicit liquor trade: రాజ్యమేలుతున్న కల్తీ కల్లు

KeralaRainTragedy PrakrutiPrakopam WayanadDisaster WaynadLandslide2025 WesternGhatsDestruction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.