📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

waste:వ్యర్థాలను తగ్గిస్తేనే భవిష్యత్తు

Author Icon By Digital
Updated: June 20, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆధునిక సమాజంలో మానవ జీవనశైలిలో స్పష్టమైన మార్పులు రావడంతో వ్యర్థాలు(waste) ఎక్కువ స్థాయిలో విసర్జించబడుతున్నాయి. రెండు మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే సుమారు నాలుగు రెట్లు వ్యర్థాలు భూమిపై పోగు అవుతున్నాయి.

దీనితో నగరాలు, పెద్దస్థాయి పట్టణాల్లో చెత్తను తరలించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రతి విషయంలో ఉపయోగించి పారవేసే (యూజ్ అండ్ థ్రో) వస్తువులు పెరిగిపోతున్నాయి. తెల్లవారు జామున ఉపయోగించే పాల ప్యాకెట్లతో పాటు రాత్రి వరకు యూజ్ అండ్ థ్రో వస్తువులు అత్యధికంగా ఉంటున్నాయి.

ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి అయితే కనీసం నెల రోజులైనా తిరిగి ఉపయోగించే విధంగా ఉండాలన్న సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి ఎక్కువ ముప్పు వాటిల్లుతోంది. ప్లాస్టిక్తోనే కాకుండా కొన్ని రకాల లోహాలు, కలప, అట్ట వస్తువులు వంటివి ఎక్కువగా ప్రజలు ఉపయోగిస్తున్నారు.

ప్రపంచం మొత్తం మీద సుమారు పదివేల టన్నుల వరకు వ్యర్థాలు ఉంటున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఒకసారి వాడిన వస్తువులు మళ్లీ వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలి.

హైదరాబాద్ లోని జవహర్ నగర్లో చెత్తను(waste) రీసైక్లింగ్ చేయడానికి ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది. అయితే నగరం నుంచి వస్తున్న చెత్త సుమారు పది కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కాలుష్యంగా మార్చివేస్తోంది. ఈ పరిధిలో బోరుబావులు సైతం కలుషితం అవుతున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

వ్యర్థాలను తగ్గించుకోవడం, కర్బన ఉద్గారకాలను తగ్గించడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది. కొందరికి పనికిరాని వస్తువులు మరికొందరికి పనికి వస్తాయి.

ఉదాహరణకు పాత కంప్యూటర్లు, ఏసీ మిషన్లు, టివీలు, ఫ్రిజ్లు వంటివి పాడైపోతే చెత్తకుప్పలో పడేస్తాం. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది వీటిని డంపింగ్ యార్డుకు తరలించి తమ పనిపూర్తి చేస్తారు.

అయితే వీటిలో కొన్ని పరికరాలు, పార్టులు వేరే వాటికి ఉపయోగపడతాయి. వీటిని విడదీసి మార్కెట్కు తరలిస్తే అవసరమైన వారు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్లోని పాతబస్తీలో చార్మినార్ వద్ద ప్రతి ఆదివారం ఉపయోగించి పారేసిన వస్తువులను మెరుగులు దిద్ది విక్రయిస్తున్నారు. ఉదాహరణకు సీలింగ్ ఫ్యాన్ రెక్కలు, కూలర్ల డోర్లు, మోటారు సైకిల్ రిమ్ములు, గ్యాస్ స్టవ్ విడిభాగాలు, టివిలు, టేప్ రికార్డర్లు, టేబుల్యాన్ పార్టులు విక్రయిస్తుంటారు.

ఇవి చాలా తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. దీనితో ఈ ప్రాంతం ఆదివారం వస్తే చాలు రద్దీగా మారుతుంది. అతి తక్కువ ధరకు తమకు కావాల్సిన పరికరాలను కొనుగోలు చేసి ఇంట్లో వృధా పడి ఉన్న వస్తువులకు బిగించడం ద్వారా వాటిని వినియోగంలోకి తీసుకువస్తుంటారు.

ఇలాంటి మార్కెట్ల వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది. పారేసిన వస్తువులను, పరికరాలను తిరిగి వినియోగంలోకి తీసుకువస్తారు. మరోపక్క ఇంట్లో వృధాగా ఉంచుకుని పారేద్దామన్న ఆలోచనతో ఉన్న వారికి ఇలాంటి చిన్న పరికరాలు అమర్చుకోవడం ద్వారా మరికొంతకాలం వినియోగిస్తారు.

ఇలాంటి మార్కెట్లు చాలా అరుదుగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం వీరికి ఉండదు. పైగా ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోందని పోలీసులు వీరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తుంటారు.

ప్లాస్టిక్ను కూడా తిరిగి ఉపయోగించే విధంగా రీసైక్లింగ్ యంత్రాలను ఎక్కువ సంఖ్యలో మార్కెట్లోకి తీసుకురావాలి. ఇప్పటికే వ్యర్థాల సమస్య అధికంగా ఉంటే కొవిడ్ వల్ల డిస్పోజబుల్ మాస్క్లు, గ్లాస్లు, సానిటైజర్ బాటిల్స్ వంటివి విరివిగా మార్కెట్లోకి వచ్చి చేరాయి.

కొవిడ్ నుంచి కాపాడుకునేందుకు వాడే అనేక వస్తువులు ఒకసారి గాని, ఒకరోజు గాని ఉపయోగించి పారేసేవే ఉన్నాయి. తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను నిషేధించారు.

ఈ స్థానంలో గాజు సీసాలు అందిస్తున్నారు. ఈ సీసాల్లో నీటిని తాగిన తరువాత తిరిగి వాటిని దుకాణదారుకు ఇచ్చేయవచ్చు. పైగా ఏ దుకాణంలో తీసుకున్నామో అక్కడే ఇవ్వవలసిన అవసరం లేదు. ఏ షాపులో ఇచ్చినా తీసుకుంటారు.

దీనివల్ల తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల బెడద తప్పింది. ఇక ప్రసాదం కూడా ప్లాస్టిక్ కవర్లో కాకుండా నేలలో కరిగిపోయే వాటితో తయారు చేసిన జ్యూట్ బ్యాగులను ఇస్తున్నారు.

బట్టల తయారీలో దాదాపు 65 శాతం పాలిస్టర్, యాక్రిలిక్, నైలాన్, సింథటిక్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. ఇవన్నీ ఐదారు నెలలు వాడి చెత్తకుప్పలో వేస్తారు.

వీటిని సేకరించి నులకడం ద్వారా బలమైన తాళ్లను తయారుచేసే అవకాశం ఉంటుంది. కాని సర్వేలు చెబుతున్న ప్రకారం 85 శాతం బట్టలు వ్యర్థపదార్థాల జాబితాల్లో భూమిపై వచ్చి చేరుతున్నాయి.

ఇలా చాలా వస్తువులు దానికి పునర్వినియోగం స్థాయి ఉన్నప్పటికీ చెత్తకుప్పలకు చేరి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి.

ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న నష్టం ఇతర ఏ వస్తువుల వల్ల కలగడం లేదు. కొంతకాలం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించారు.

షాపుల్లో, మార్కెట్ లో ప్లాస్టిక్ బ్యాగులు ఇచ్చేవారు కాదు. అయితే ఈ పద్ధతి కేవలం నెల రెండు నెలలు మాత్రమే కొనసాగింది.

ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో దుకాణదారులు క్రమంగా తిరిగి ప్లాస్టిక్ వినియోగం వైపు మొగ్గు చూపారు.

ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలంటే బ్యాగులను ఉత్పత్తి చేసే సంస్థలను మూసివేస్తే సరిపోతుంది. పర్యావరణం పట్ల కఠిన చర్యలు తీసుకుంటేనే తగిన ప్రతి ఫలం ఉంటుంది.

వ్యర్థాలను తగ్గించడానికి, వ్యర్థాలను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి తగిన ప్రణాళిక రూపుదిద్దాల్సిన అవసరం ఉంది.

Read Also: Cinema theatre: సంక్షోభంలో సినిమా థియేటర్లు

clean city green city Climate Change Solutions eco-friendly practices Google news Google News in Telugu plastic pollution Recycling reduce reuse recycle sustainable lifestyle Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Waste Management zero waste society తిరుపతి ప్లాస్టిక్ నిషేధం పర్యావరణ పరిరక్షణ పర్యావరణ భద్రత పునర్వినియోగం ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ వ్యర్థాలు వృధా పదార్థాలు హైదరాబాద్ చెత్త సమస్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.