Trump Criticism on India:భారతదేశానికి తాను మిత్రుడిగా ప్రచారం చేసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచరణశైలి మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. అమెరికా ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో అగ్రభాగం భారత్ను ఇబ్బంది పెట్టేవే ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా భారత్ ఎదుగుతున్న సమయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు (Decisions) దానికి అడ్డుకట్ట వేసేవిగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క ప్రతీకార పన్నుల విషయంలో దూకుడుగా వ్యవహరించడంతో పాటు పాకిస్థానీ ఉగ్రవాదులు (Terrorists) పెహల్గామ్ లో మారణకాండను సృష్టించినప్పుడు ఇతర దేశాలు స్పందించిన తీరుకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరించారు.
ఉగ్రవాద చర్యలను ఖండించకుండా పాకిస్థాన్, భారత్ తనకు రెండూ మిత్రదేశాలేనని ప్రకటించారు. భారత్ పై యుద్ధానికి పాకిస్థాన్కు సహకరించిన తుర్కియేకు అమెరికా ఆయుధాలు అందించడం ద్వారా పరోక్షంగా భారత్ పై యుద్ధానికి పాకిస్థాన్కు మద్దతు పలికినట్లు అయ్యింది. 79.1 మిలియన్ డాలర్ల 60 బ్లాక్ 2 క్షిపణులను కూడా తుర్కియేకు అందించి భారత్పై ధీటుగా పోరాడాలని ట్రంప్ పాకిస్థాన్కు ప్రోత్సహించారు.
ఆపరేషన్ సింధూర్
కొనసాగుతున్న సమయంలో యుద్ధాన్ని ఆపాలని రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రకటనలు చేశారు. అంతేకాకుండా రెండు దేశాల మధ్య అవగాహనతో యుద్ధం నిలిపివేస్తే తానే ఈ యుద్ధాన్ని ఆపానని ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపించారు.
యుద్ధ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో కాల్పుల విరమణ ప్రక్రియపై ఇటు భారత్గానీ, అటు పాకిస్థాన్గానీ ఈ ప్రకటన చేయాలి. అయితే అత్యుత్సాహంతో ఆయన చేసిన పలు విమర్శలను ఎదుర్కోవడంతో పాటు భారత్తో మిగిలిన దేశాల దౌత్య సంబంధాలకు ఇబ్బందికరంగా పరిణమించింది. అంతటితో ఆగకుండా పాకిస్థాన్ మిలటరీ చీఫ్ ్ను అమెరికాకు ఆహ్వానించి అతనితో విందులో పాల్గొన్నారు.
భారత్పై ప్రతీకార పన్నుల విషయంలో అమెరికాతో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ప్రకటించి ఇబ్బందులు కలిగించారు. భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించిన తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా భారత్ స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేశారు. ఆపిల్ సంస్థ భారత్తో పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే బాహాటంగానే హెచ్చరికలు చేశారు.
అంతేకాకుండా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తమ కార్ల షోరూంలను భారత్లో ఏర్పాటు చేస్తుంటే దానిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. చివరికి వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుని ఏకంగా ఎలాన్ మస్క్ రాజకీయాల్లోకి ప్రవేశించేలా చేసుకున్నారు.
ప్రపంచ దేశాల ముందు భారత్ను తక్కువ చేసి మాట్లాడారు.
గల్ఫ్ దేశాల్లో పర్యటించిన సందర్భంగా ట్రంప్ అక్కడ కూడా భారత్ పట్ల ఇవే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ప్రపంచ దేశాల ముందు భారత్ను తక్కువ చేసి మాట్లాడారు. ప్రస్తుతం తాజాగా వాషింగ్టన్లో జరిగిన కృత్రిమ మేధ సదస్సులో ఆయన మాట్లాడుతూ భారతీయ భారతీయులను ఐటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల్లో తీసుకోవడాన్ని తప్పు పట్టారు. గూగుల్, మైక్రోసాప్ట్ వంటి సంస్థల్లో అత్యధికులు భారతీయులు ఉన్నారని, ఇలాంటి విధానాలు ఇకపై సాగవని ఆయన హెచ్చరికలు చేశారు.
అమెరికాలో ఉంటూ తమ సంస్థలను చైనాలో ఏర్పాటు చేసి అక్కడ భారతీయులను ఉద్యోగులుగా తీసుకుంటున్నారని, ఇది సరైన పద్దతి కాదని ఆయన విమర్శించారు. అంతేకాకుండా గతంలో జరిగిన పాలనలో ఇవి కొనసాగాయని, తన హయాంలో ఇలాంటివి అంగీకరించేది లేదని స్పష్టమైన హెచ్చరికలు చేశారు.
ఐటి దిగ్గజ కంపెనీలు దేశభక్తిని కలిగి ఉండాలని, అంటే అమెరికా ప్రయోజనాల కోసం మాత్రమే శ్రమించాలని, వారి సంస్థల్లో కేవలం అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా భారత్ను ఇబ్బంది పెట్టాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగా ఎదుగుతోంది.
చివరకు అమెరికా సాయం కూడా తీసుకోవడం లేదు. దీంతో ట్రంప్ భారత్పై కక్ష కట్టినట్లు తెలుస్తోంది. అమెరికా లాంటి దేశం నుంచి సాయం పొందితే ఆ దేశం చెప్పినట్లే తోక ఆడించాల్సిన పరిస్థితిలో భారత్ లేదు. ఈ కారణంగానే ఆయన భారత్ పట్ల వ్యతిరేక ధోరణిని అవలంభిస్తున్నట్లు భావిస్తున్నారు
Read also: hindi.vaartha.com
Read also: