📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Software Jobs in Crisis:సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Author Icon By Hema
Updated: August 11, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకప్పుడు యువతకు కల్పతరువుగా ఉన్న సాఫ్ట్‌వేర్ రంగం ఇప్పుడు ప్రతికూలంగా మారింది. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తున్నారు. లాభాల బాటలో ఉన్న సంస్థలు సైతం ఇష్టారాజ్యంగా యువతను ఇళ్లకు పంపించివేస్తున్నారు.

సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవడం ద్వారా మిగిలిన సిబ్బందిపై (staff) పనివత్తిడి పెంచి మరిన్ని లాభాలు ఆర్జించాలన్న లక్ష్యంగా కొన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు (Founder) నారాయణమూర్తి ఒక ప్రకటన చేస్తూ ఉద్యోగులు రోజుకు కనీసం పది నుంచి పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పారు.

ఎల్ అండ్ టి అధినేత సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకు వేసి సెలవు దినాల్లో ఇళ్లలో భార్యల ముఖాలు చూస్తూ కాలయాపన చేయడం సరికాదని అన్నారు. ప్రముఖ దిగ్గజ కంపెనీల అధినేతలు, సిఇవోలు ఈ విధమైన ప్రకటనలు చేయడం వల్ల ఆయా రంగాల్లో మిగిలిన సంస్థలు వీరిని ఉదహరిస్తూ పనిగంటలు పెంచడం, జీతాలు తగ్గించడం, సెలవులను మంజూరు చేయకపోవడం వంటివి చేస్తున్నారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)

తన ఉద్యోగుల్లో రెండు శాతం మందిని తొలగిస్తున్నట్లు చేసిన ప్రకటన సాఫ్ట్‌వేర్ రంగంలో ఆందోళనలను కలిగిస్తోంది. ఇదే పరిస్థితి ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో వంటి సంస్థలలో కూడా నెలకొంది. మైక్రోసాఫ్ట్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు సుమారు 15 వేల మంది ఉద్యోగాలు తొలగించి ఇళ్లకు పంపించింది. మరికొంత మందిపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతోంది. గూగుల్. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే వైఖరితో ఉండటం విశేషం.

ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ) ప్రభావం రోజురోజుకి పెరుగుతుండటంతో సాధారణ కోడింగ్, టెస్టింగ్ వంటి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. కేవలం ఒక్క ఏఐ వల్ల రాబోయే సంవత్సర కాలంలో వివిధ సాఫ్ట్‌వేర్సంస్థల్లో కనీసం లక్షమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐటి నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఉద్యోగాలు తొలగిస్తున్న సంస్థలు ఏవీ కూడా నష్టాల బాటలో లేవు. దాదాపుగా అన్ని సంస్థలు ప్రతి సంవత్సరం కనీసం 5 నుంచి 15 శాతం వరకు అధిక లాభాలను గడిస్తున్నాయి. 40-45 సంవత్సరాలవయస్సులో ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే వారికి మళ్లీ ఉద్యోగం లభించడం సమస్యగా మారుతుంది. కేవలం లాభాలు గడించేందుకు మాత్రమే ఉద్యోగుల తొలగింపు, ఎక్కువ పనిగంటలు అన్న విధానాలను సాఫ్ట్వేర్ కంపెనీలు అమలు చేస్తున్నాయి.

ఇప్పటికే వర్క్ ఫ్రం హోం పేరుతో పనివేళలు ఇష్టారాజ్యంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా క్లయింట్ల సమావేశాలు ఉన్నాయని చెబుతూ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ల్యాప్టాప్లపై పనిచేస్తూ గడిపే దుర్భర పరిస్థితులను కల్పిస్తున్నారు. ఒకప్పుడు జల్సాగా, ఆనందంగా కనిపించే సాఫ్ట్‌వేర్ఉద్యోగులు ప్రస్తుతం ఆందోళనలతో, పనిభారంతో సతమతం అవుతూ కనిపిస్తున్నారు. పరిశ్రమల్లోను, దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకు కనీస హక్కులు కల్పిస్తున్న ప్రభుత్వాలు సాఫ్ట్వేర్ సంస్థలపై పట్టును సాధించేందుకు వెనుకడుగు వేస్తున్నాయి.

ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీల ఏర్పాటుకు

వందల ఎకరాలు సంస్థ అతి తక్కువ ధరకు కట్టబెడుతున్నాయి. సంస్థల కార్యాల యాలు ఏర్పాటు చేయడానికి అనేక రాయితీలు కల్పిస్తున్నాయి. అయితే అందులో పనిచేసే ఉద్యోగుల సంక్షేమాన్ని, భద్రతను మాత్రం గాలికి వదిలివేశాయి. లాభాల్లో నడుస్తున్న సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి.

వాస్తవానికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ప్రభుత్వాలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. దీనితో వాటి జోలికి వెళ్లేందుకు ప్రభుత్వాలు సాహసించడం లేదు. లేబర్ చట్టాలు, కోర్టులు ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగుల విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదు.

ఇంజినీరింగ్, ఎంబిఏలతో పాటు ఇతర ఉన్నత విద్యను అభ్యసించిన వారిని క్యాంపస్ ఇంటర్వ్యూల పేరుతో అతి తక్కువ వేతనానికి ఉద్యోగాల్లో తీసుకుని, మూడు నాలుగేళ్ల తరువాత వేతనాలు పెంచే సమయానికి వారిని తొలగించి, వారి స్థానంలో మళ్లీ ఫ్రెషర్స్ న్ను తక్కువ వేతనాలతో నియమించుకుని పబ్బం గడుపుకుంటున్నారు.

ఇకనైనా ప్రభుత్వాలు, కార్మిక శాఖ అధికారులు సాఫ్ట్‌వేర్కంపెనీల దురాగతాలపై దృష్టి సారించకపోతే యువత తప్పుడు మార్గాల్లో పయనించి వ్యవస్థకు ముప్పు తీసుకువచ్చే ప్రమాదం లేకపోలేదు.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/power-shortages-in-summer/sanghibavam/527362/

ArtificialIntelligenceImpact ITJobsIndia ITLayoffs SoftwareJobs TechIndustryCrisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.