📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Power Shortages in Summer:వేసవి ప్రారంభంలోనే విద్యుత్ కోతలు మొదలు

Author Icon By Hema
Updated: August 7, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా వేసవికాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. ఒకపక్క వ్యవసాయ రంగం విద్యుత్ను పూర్తి స్థాయిలో వినియోగిస్తుండగా మరోపక్క గృహ, కార్యాలయ వినియోగదారులు వాడకాన్ని గణనీయంగా పెంచుతుంటారు. ఇక పరిశ్రమలు, కర్మాగారాలు కూడా లక్ష్యం మేరకు ఉత్పత్తి సాగించాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. చిన్న తరహా పరిశ్రమలు మినహా మిగిలిన భారీ సంస్థలు, కర్మాగారాలు మూడు షిఫ్ట్లలో రోజుకు 24 గంటలు పనిచేస్తుంటాయి.

ఒకపక్క వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ డిమాండ్ ఏమాత్రం తగ్గకపోగా సాధారణ వినియోగదారుల విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగింది. విద్యుత్ సరఫరా విషయంలో ముందు నుంచీ ప్రణాళికలు అవసరం. ఈవిషయంలో ప్రభుత్వాలు (Governments) ఎంతో అప్రమత్తంగా ఉంటాయి. ఎందుకంటేవిద్యుత్ కోతలు నేరుగా ప్రజలపై ప్రభావం చూపుతాయి . గంటల తరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో వారిలో అసంతృప్తి పెరుగుతుంది.

ఒక్కసారి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు (votes) వేయాలన్న భావన వచ్చినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చరిత్రలో పలుమార్లు చవిచూశాం. ఓటర్లకు ప్రధానంగా మంచినీరు, విద్యుత్, వైద్యం, విద్య, నిత్యావసర వస్తువుల ధరలను బేరీజు వేసుకుని ఓట్లను వేస్తుంటారు. ఈ అంశాల్లో విద్యుత్సరఫరా కీలకంగా ఉంటుంది. గంటల తరబడి విద్యుత్ కోతలు అమలుచేస్తే ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఓట్లు పోలయ్యే
అవకాశం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో విద్యుత్ కోతల ప్రభావం ఎక్కువగా ఉంది. పొరుగునే ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో విద్యుత్ కోతలను అమలు చేయడం లేదు. దీనితో ఏపీపై విద్యుత్ కోతలు అమలుచేయకూడదన్న డిమాండ్ పెరుతోంది. గత పది రోజులుగా ఏపీలో విద్యుత్ కోతలు ఎక్కువగా అమలుచేస్తున్నారు.

గ్రామల్లో ఆరు నుంచి పది గంటల వరకు విద్యుత్ కోతను అమలుచేస్తున్నారు. పట్టణాల్లో నాలుగు గంటలు, నగరాల్లో రెండు నుంచి మూడు గంటల పాటు విద్యుత్సరఫరాను నిలిపివేస్తున్నారు. పరిశ్రమలకు ఏకంగా పవర్ హాలిడే ప్రకటించారు. వారంలో రెండు రోజులు పరిశ్రమలు మూతవేయాలని ఎపి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అదే విధంగా మూడు షిఫ్ట్లు పనిచేసే ఫ్యాక్టరీలపై మరిన్ని ఆంక్షలు విధించింది. పరిశ్రమలు, కర్మాగారాలు ఎట్టి పరిస్థితుల్లో తమకు కేటాయించిన లోడు లో కేవలం 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ రంగంపై కూడా విద్యుత్ కోతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మోటార్లు పనిచేయకపోవడడంతో పంటలకు కావల్సిన మేరకు నీరందించే పరిస్థితి లేక అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. చివరకు అత్యవసర సర్వీసులుగా పరిగణించే ఆసుపత్రులకు కూడా సక్రమంగా విద్యుత్ పంపిణీ జరగడం
లేదు. దీనితో గతవారం రోజులుగా చీకటిలోనే శస్త్ర చిక్సితలు చేసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో అత్యవసర వేళల్లో ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసిన జనరేటర్లు కూడా పనిచేయడం లేదు.

ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు

ఇవి మరమ్మత్తుకు నోచుకోవడంతో వాటిని సరిదిద్దే విషయంలో . నిధుల కొరతసమస్య దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలోనే కొంత అధికంగా
కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో 230 మిలియన్ యూనిట్ల విద్యుత్డిమాండ్ ఉండగా అందుకు భిన్నంగా కేవలం 180 ఎంయూలు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీనితో సుమారు 50 మిలియన్
-యూనిట్ల విద్యుత్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

ఏపీలోని థర్మల్పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన బొగ్గు కొరత అధికంగా ఉండటంతో సమస్య మరింత జటిలంగా మారింది.
గతంలో 24 నుంచి నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉండేవి. ప్రస్తుతం బొగ్గుకొరత కారణంగా ఏరోజుకు ఆరోజు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందని అధికారులు వివరిస్తున్నారు.
ఏపీలో ఈనెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు విద్యుత్ శాఖ పరిశ్రమలకు ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల సుమారు 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకునే అవకాశం
కలిగిందని విద్యుత్ శాఖ అధికారులు వివరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు విద్యుత్ సరఫరాలో సమస్య ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రజలు, వ్యవసాయరంగం, పరిశ్రమలు, కగర్మాగాలు ఒకేసారి విద్యుత్ వినియోగాన్ని రెట్టింపు చేయడంతో విద్యుత్ కోతలు అమలుచేయక తప్పడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈమేరకు ఈ నెలాఖరు వరకు విద్యుత్ కోతలు,పవర్ హాలిడేనుఅమలుచేయడం మినహా వేరే గత్యంతరం లేదని సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. తెలంగాణలోని మొత్తం విద్యుత్లో 30 నుంచి 40 శాతం వ్యవసాయ రంగానికి వినియోగాస్తారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తెలంగాణలో వరిసాగును తగ్గించారు. వరి కొనుగోలు విషయంలో వివాదం నెలకొనడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించారు. దీనితో మండు వేసవిలో వ్యవసాయ రంగం విద్యుత్ వాడకాన్ని గణనీయంగా తగ్గించుకుంది. ఇక్కడ వేసవిలో ప్రతిరోజూ 12 నుంచి 13 మెగా వాట్ల విద్యుత్ వినియోగం ఉంటుంది. వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరగడం, ఉత్పత్తి తగ్గడం విద్యుత్కొరత సమస్య ఏర్పడుతుంది.

తెలంగాణలో అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 25 శాతం గృహ అవసరాలకు, 15 శాతం వరకు పరిశ్రమలు వినియోగిస్తాయి. తెలంగాణకు సరఫరా అయ్యే విద్యుత్లో 40 శాతం జెన్కో సరఫరా చేస్తుంది. మరో 25 నుంచి 35 శాతం కేంద్రం పరిధిలో ఉన్న ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ నుంచి సరఫరా అవుతుంది. ఏపీలో సాంప్రదాయేతర విద్యుత్ సంస్థతోవివాదం నెలకొన్న దృష్ట్యా అక్కడి నుంచి ఆశించిన మేరకు విద్యుత్ను సరఫరా అందడం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు
తీసుకుని వ్యవసాయ, పారిశ్రామిక రంగానికి విద్యుత్సరఫరా చేయాలి ఉంది.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/endless-land-encroachments/sanghibavam/527331/

APPowerIssues ElectricityShortage IndustrialShutdown PowerCrisis SummerPowerCuts

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.