📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Panchayat election : పంచాయితీ ఎన్నికల సందడి

Author Icon By Abhinav
Updated: December 8, 2025 • 11:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎట్టకేలకు తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు కార్యరూపం దాల్చుతున్నాయి.

గ్రామాల్లో అభివృద్ది జరగాలంటే కమిటీలు అత్యంత కీలకంగా మారతాయి, వాస్తవానికి గ్రామానికి సర్పంచ్గా ఉన్న వ్యక్తిని ఆ గ్రామానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్లు భావిస్తారు. గ్రామానికి సంబంధించి ఆదాయ, వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాల్లోనే కాకుండా ప్రభుత్వం అమలుచేసే అనేక పధకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే బాధ్యత కలిగి ఉంటాడు. మహాత్మా గాంధీ సైతం గ్రామ స్వరాజ్యాలు పటిష్టంగా ఉన్నప్పుడే ఆయా ప్రాంతాలు జిల్లాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

గ్రామ సీమలు స్వర్గ సీమలుగా మారాలంటే పటిష్టమైన నాయకత్వం అవసరం, శాసనసభ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికలు అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. ఇతర ఎన్నికలతో పోలిస్తే పంచాయితీ ఎన్నికలు (Panchayat Elections) ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని నిధులను, పథకాలను నేరుగా పంచాయితీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. తెలంగాణలో పంచాయితీ ఎన్నికల శంఖారావం మోగింది. దీనితో గ్రామాల్లో ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. కొన్ని పంచాయితీలో దశాబ్దాల నుంచి సర్పంచ్లుగా కొనసాగుతున్న వారు ఉన్నారు.

మరికొన్ని కొన్ని చోట్ల చాలా తక్కువ కాలం పనిచేసిన సర్పంచ్లు, పంచాయితీ సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలలో తమను గెలిపిస్తే గ్రామానికి తాము చేసే అభివృద్ధిని అభ్యర్థులు వివరిస్తున్నారు. తెలంగాణలో 564 మండలాల్లోని మొత్తం 12 వేల 728 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈనెల 11, 14,17 తేదీల్లో మూడు విడదతలుగా ఎన్నికలు జరుగుతాయి. తొలి దశలో భాగంగా 189 మండలాల పరిధిలోని 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

అదేవిధంగా రెండవ విడతలో 193 మండలాల్లోని 4,333 గ్రామాలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. మూడవ విడతలో 182 మండలాల్లోని 4,159 గ్రామాలు, 36,452 వార్డుల్లో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో మొత్తం లక్షా 66 వేల 55 వేల 186 మంది ఓటర్లు ఉన్నారు, వీరిలో 81 లక్షల 42 వేల 231 మంది పురుషులు, 85 లక్షల 12 వేల 455 మందిమహిళలు, 500 మంది ఇతరులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఫలితాలను వెల్లడించి, ఉప సర్పంచి ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. ఎన్నిలకు పూర్తిగా బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగిన తరువాత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. దీనితో ఎన్నికల ప్రక్రియ. ముగుస్తుంది. ఏకగ్రీవం అయిన పంచాయితీలకు పోలింగ్ రోజు మధ్యాహ్నం వారికి అర్హత పత్రాలను అందిస్తారు. గ్రామ పంచాయతీ జనాభా 2011 లెక్కల ప్రకారం 5,000 దాటితే సర్పంచి అభ్యర్థులు రెండున్నర లక్షలు, వార్డు సభ్యులు 50 వేల రూపాయలకు మించి ఖర్చు చేయరాదు. గ్రామ పంచాయతీలో 2011లో జనాభా 5 వేలలోపు ఉన్నట్లయితే సర్పంచి అభ్యర్థులు గరిష్టంగా లక్షన్నర రూపాయలు, వార్డు సభ్యులు 30 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఈసారి పంచాయితీ ఎన్నికల తేదీ ప్రకటించే అంశంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఎన్నికలు అసలు జరుగుతాయా లేదా అన్న మీమాంస కలిగింది. అయితే ఎట్టకేలకు పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తూ పదవులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయితీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తరువాత జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి. జిల్లా పరిషత్ ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతాయి కాబట్టి హడావిడి మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పంచాయితీ ఎన్నికల తరువాత జరిగే జిల్లా పరిషత్లలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క బిఆర్ఎస్ గత పదేళ్లుగా పాలనలో ఉండటంతో జిల్లాల్లో ఆ పార్టీ కూడా పట్టు కలిగి ఉంది. అదేవిధంగా బిజెపీ కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని భవిష్యత్తులో శాసనసభ ఎన్నికలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు సాగిస్తోంది.

-డాక్టర్ గిరీష్ కుమార్ సంఘీ

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Ballot Paper Voting BRS party Election Notification local body elections Mandal Elections Rural Governance Rural Leadership sarpanch elections Telangana Congress Telangana politics Telangana Voters Three-Phase Elections Unanimous Elections Village Administration Village Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.