📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Moosi Encroachments: మూసీకి ఆక్రమణల నుంచి మోక్షం లేదా?

Author Icon By Hema
Updated: July 30, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మూసీ నదికి చిన్నపాటి వరద వచ్చిన పరిసరాలు ముంపునకు గురౌతున్నాయి. సుమారు రెండు దశాబ్దాల నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు
నగర ప్రజలకు తాగునీరు అందించే మూసీ నది సరైన నిర్వహణ లేకపోవడంతో మురికికూపంగా తయారైంది. డ్రైనేజీ వ్యవస్థతో మూసీ కలిసిపోవడం, పరీవాహక ప్రాంతాల్లోని పరిశ్రమలు కలు
షిత నీటిని వదలడంతో భరించరాని దుర్వాసన వెలువడుతోంది.

సుమారు దశాబ్దకాలం నుంచి మూసీపై ఆక్రమణలను తొలగిస్తామని ప్రభుత్వాలు,(Governments) అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణ లో మాత్రం పెట్టలేకపోతున్నారు. కేవలం సర్వేలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు ఆరేడు సర్వేలు(Surveys) జరిగాయి. ప్రతి సర్వేలోను మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు వెల్లడైంది. అధికారులు నిర్వహించిన సర్వేల్లో సుమారు 8,529 ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. ఈ ఆక్రమణలు నది గట్టుపైనే కాకుండా ఏకంగా నదీగర్భంలో కూడా నిర్మించారు.

రాజకీయ వత్తిడిలు రావడంతో

అధికారులు నోటీసులు జారీ చేసి ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టడానికి రంగం సిద్ధం చేసిన ప్రతిసారీ రాజకీయ వత్తిడిలు రావడంతో పట్టించుకోవడంలేదు. రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ప్రతి ఏటా ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి.

నది గట్టు వద్ద సుమారు 500 మీటర్ల మేర ఎటువంటి కట్టడాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో నదిలోకి చొచ్చుకుని వచ్చి పక్కా కట్టడాలను నిర్మించి బస్తీలు ఏర్పాటు చేసుకున్నారు. రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినా మూసీకి వరదలు రావడం చాదర్ ఘాట్, ముసారాంబాగ్ వంతెనలు మూసివేయడం సర్వసాధారణంగా మారింది. 1908లో మూసీ నదికి భారీవరదలు వచ్చాయి.

ఆ సమయంలో భారీ వరదలు మూసీనదికి వచ్చి పరిసర ప్రాంతాలను జలమయం చేసింది. మూసీనది పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలతో పాటు ఈ ప్రాంతంలో పెద్ద
ఎత్తున పేరుకుపోయిన ఘన వ్యర్థాలు, నాలాల ఆక్రమణలు, ముంపునకు దారితీస్తున్నాయి. వర్షపు నీటి పరిమాణానికి, కాలువల సామర్థ్యానికి పొంతనలేని పరిస్థితులు, నిర్మాణ రంగంలో నిబంధ
నల ఉల్లంఘన, రాజకీయాల మితిమీరిన జోక్యం వంటి అనేక అంశాలు మూసీ వరదలకు కారణంగా నిలుస్తున్నాయి.

ఇమ్లీబన్బ స్టాండుకు పక్కనే మూసీ నదిపై డంపింగ్ యార్డు ఉంది. ఇందులో నుంచి భరించరాని దుర్వాసన రావడంతో పాటు కలుషిత నీరు మూసీలోకి ప్రవహించి కొన్ని కిలోమీటర్ల మేర ప్రవాహంపై ప్రభావం చూపుతోంది. మూసీ కలుషితంపై హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. మురికికూపంగా మారడం వల్ల దోమల ఉత్పత్తి కేంద్రంగా మారిందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నదీ ప్రక్షాళనకు వెంటనే చర్యలు చేపట్టి అమలుచేయాలని ప్రభుత్వానికిఆదేశించింది.

నది మధ్యలో సిమెంట్లో కెనాల్ను నిర్మించి నీటి ప్రవాహం పెంచడమే కాకుండా ఆ నీటిని ఉద్యానవనాల అభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రాజెక్ట్ పనులుచేపట్టారు. హైకోర్టు సమీపంలో ఒక పార్కు నిర్మించి విద్యు త్దీపాలు కూడా ఏర్పాటుచేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ను సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. మూసీనది హైదరాబాద్ నగరంలో సుమారు 14.2 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. హైదరాబాద్డి విజన్లోని గోల్కొండ, ఆసీఫ్నగర్, బహదూర్పురా, చార్మినార్, నాంపల్లి, హిమాయత్నగర్, సైదాబాద్, అంబర్పేట రెవెన్యూ
అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించారు. నివేదికలు సిద్ధం చేశారు. ఈ మేరకు సుమారు వెయ్యి కుటుంబాలకు నోటీసులు కూడా జారీ చేశారు. ఒక క్రమపద్ధతిలో ఆక్రమణలు తొలగించ
డంతో పాటు గట్టును పటిష్టం చేసే ప్రక్రియ కూడా ప్రారంభించాలని నిర్ణయించారు.

ప్రతిసారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు

అయితే రాజకీయ జోక్యంతో ఆక్రమణల తొలగింపు నిలిచిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఈ అంశం చర్చనీయంగా మారింది.ప్రతిసారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు హంగామా చేయడం మళ్లీ ఈ అంశం తెరమరుగు కావడం సర్వసాధారణంగా మారింది. ప్రభుత్వం ఆక్రమణలు తొలగించే అవకాశం లేదని తెలియడంతో నదీ పరివాహక ప్రాంతంలో కొత్తకొత్త కట్టడాలు నిర్మిస్తూనే ఉన్నారు. గతంలో చిన్న చిన్న గుడిసెలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు పక్కాగృహాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు రెండు మూడు అంతస్తులు కూడా నిర్మించుకున్నారు. మూసీకి వరదలు వచ్చినప్పుడు వంతెనలు మూసి వేయడంతో ఆ ప్రభావం ట్రాఫిక్పై పడుతోంది.

ఇటీవల కురిసిన వర్షాలకు గత నాలుగు రోజులుగా వంతెనలు మూసి వేయడంతో నగరంలో చాలా భాగం ట్రాఫిక్ఎక్కడికక్కడ నిలిచి పోయింది. అంబర్పేట, మూసారాంబాగ్, చాదర్ ఘాట్, మలక్పేట తదితర ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. వందల ఇళ్లు నీటమునిగాయి.
విలువైన సామాగ్రి, ఫర్నిచర్, వంట పాత్రలు నీటిలో కొట్టుకుపోయాయి.

ప్రతి రెండు సంవత్సరాలకు ఈసారి మూసీకి వరదలు రావడంతో అక్కడికి సమీపంలో ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గాపరిగణించి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న బస్తీలో ప్రజలను వేరే ప్రాంతానికి తరలించడం, వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించడం ద్వారా
ఆక్రమణలను ఖాళీ చేయించే అవకాశం కలుగుతుంది. రాజకీయాలకు అతీతంగా, అన్ని పక్షాలను కలుపుకుని ఈ కార్యక్రమాన్నిచేపట్టాల్సి ఉంది. అప్పుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. నాలుగు
దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం చేయని గుర్తింపు ప్రస్తుత ప్రభుత్వానికి లభించే అవకాశం
ఉంటుంది.


Read also: hindi.vaartha.com

Read also: Eco-Conscious Siddhi Vinayaka:ప్రకృతి పరిరక్షణ సిద్ధి వినాయకుడి ఆశయం

IllegalConstructions MoosiEncroachments MoosiRiver RiverPollution UrbanFlooding

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.