ఎన్నికల సమయంలో విజయం సాధించేందుకు సుమారురెండు దశాబ్దాలుగా ఉచితాల వరాలపై వివిధ రాజకీయలను ఓటర్లకు అందిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొంటున్నాయి.
నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు కొన్ని సందర్భాల్లో ఉచితంగా (free) కొన్ని పథకాలు ప్రవేశపెట్టడంలో తప్పులేదు.
అయితే అవి పరిధి దాటి ఒకే కుటుంబంలో నాలుగైదు రకాలు ఉచితాలు, నగదు బదిలీలు వంటివి అమలుచేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరి అభివృద్ధి కార్యక్రమాలు, నిరంతరం కొనసాగే కొన్ని సేవలకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది.
గత నాలుగైదు ఎన్నికల సమయంలో ప్రచార సరళిని పరిశీలిస్తే వివిధ పార్టీలు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యూహత్మక సరళిపై ఆధారపడుతున్నట్లు స్పష్టం (Clear) అవుతోంది.
దీనివల్ల సమగ్ర అభివృద్ధి నిలిచిపోయి తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది.
ఇదే విధానం కొన్నిసంవత్సరాల పాటు కొనసాగితే ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. ఏదైనా ఒక అంశం పరిధి దాటినప్పుడు దానిపై చర్చ సర్వసాధారణంగా తెరపైకి వస్తుంది. ప్రస్తుతం అటువంటి చర్చ ఎన్నికల ఉచితాలపై కొనసాగుతోంది.
ఉచితాలు ఇవ్వడం సరికాదన్నమోడి
ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ అంశంపై ప్రకటన చేస్తూఉచితాలు ఇవ్వడం సరికాదన్న తన అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. దేశంలోని సర్వోత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వి రమణ కూడా ఇదే అభిప్రాయాన్ని ప్రకటించారు.
ఉచితాలు ఇవ్వడం అన్నది సుమారు 5 దశాబ్దాల క్రితం నుంచే ప్రారంభమైంది. అది కాస్తా రెండు దశాబ్దాల నుంచి పరిధి దాటి విస్తరించింది. ఒకసారి అలవాటు అయిన పథకాలను, పద్ధతులను మార్చుకోవాలంటే ఎంతో సంఘర్షణకు దారితీస్తోంది.
ప్రస్తుతం ఇదే జరుగుతోంది. కొందరు ఉచితాలు లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తుంటే- మరికొందరు ఉచితాల వల్ల కలిగే అనర్థాలపై
దృష్టి సారిస్తున్నారు. ఉచితాల విషయంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు రాజకీయ నాయకులు చేస్తున్నారు, ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి.
అందులో తప్పేమీ లేదు. అయితే అంతిమంగా
అవి సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి. తమ పార్టీకి అనుకూలంగానో, ఏదో ఒక వర్గానికి మేలు చేసే విధంగానో ఉండటం వల్ల భవిష్యత్తులో ఆయా వర్గాలకు అన్యాయం జరిగినట్లు అవుతుంది.
తమిళనాడులో ఎన్నికల సమయంలో
ముఖ్యంగా తమిళనాడులో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు పోటీలు పడి ఉచితాలను ప్రకటిస్తారు. స్కూటీ బైకులు, మోటారుసైకిళ్లు, కుక్కర్లు, టివిలు, ఉచిత కేబుల్
కనెక్షన్లు, ఉచిత విద్యుత్, ల్యాప్టాప్లు, టాబ్లు, సైకిళ్లు, గ్రైండర్లు ఇలా ఎన్నో వస్తువులను ఉచితంగా ఇస్తామని ఎన్నికలమ్యానిఫెస్టోలో వివరిస్తున్నారు.
ఎన్నికల్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇదే వైఖరి అవలంభిస్తున్నాయి. దీనితో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే భారీ మొత్తంలో ఈ ఉచితాలను అందించాల్సి వస్తుంది. ఖరీదైన వస్తువులు ప్రజలకు ఉచితంగాపంచడం వల్ల ఒక్కసారిగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతోంది. వివిధ పథకాల అమలుకు డబ్బు లేకపోవడంతో అవి కుంటుపడుతున్నాయి.
ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత వ్యవసాయపరంగాను, పారిశ్రామికంగా, రవాణా పరంగా అనేక పనులు నిరంతరంచేపట్టాల్సి వస్తుంది. సాగునీరు, తాగునీరు కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంటుంది.
అదేవిధంగా గతంలోనిర్మించిన వాటికి నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఇక నిత్యావసర వస్తువులను నిరుపేదలకు అందించడం కోసం సబ్సిడీ ఇవ్వవలసి వస్తుంది. ఇవన్నీ తప్పనిసరి. ప్రజలకు ఉచితంగా
విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఉపాధ్యాయులకు, వైద్య సిబ్బందికి ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఇవన్నీ అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత. ఆసుపత్రుల్లో మందులు ఉచితంగా అందిస్తారు.
పాఠశాలల్లో ఉచితంగా పుస్తకాలు. దుస్తులు అందిస్తారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇస్తుంటారు. ఇవన్నీ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి పథకాలకు ఎంత డబ్బుఖర్చు చేసినా దానికి తగిన ఫలితం ఉంటుంది. అదేవిధంగా రవాణా సౌకర్యం మెరుగుపరడానికి కొత్త కొత్త రహదారుల నిర్మాణం నిరంతరం జరుగుతూ ఉండాలి. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎన్నోఫ్లైఓవర్లు, కొత్త రహదారులు నిర్మిస్తున్నారు.
ఈ నిర్మాణాలు లేకపోతే జనజీవనం స్తంభించి పోతుంది. అదేవిధంగా నీటి సరఫరాలకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు అవుతాయి, ఇది ప్రజలకు అందిస్తున్న సేవల్లో ఒక భాగంగా గుర్తించాలి. అలాగే మార్కెట్ యార్డుల నిర్మాణం, నిర్వహణ వంటివి కూడా ప్రభుత్వమే భరిస్తుంది. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఇలాంటి ఖర్చులకు, పథకాలకు వినియోగిం
చాల్సి ఉంటుంది.
అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పద్దుల నుంచి నిధులను మళ్లిస్తుంటాయి. దీనివల్ల ఆయా పథకాలు కుంటుపడతాయి. తెలంగాణలో నిరుపేదల కోసం 5రూపాయలకు భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆసుపత్రులు, బస్టాండ్ల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
రైతులకు రాయితీపై ఎరువులు, క్రిమిసంహారక మందులు
ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. అయితే కొంత నగదును నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేయడం వల్లడబ్బు నిరుపయోగం అవుతోంది. ఉచితాలను పూర్తిగా ఎత్తివేయ
కుండా ఎక్కడ ఏది అవసరమో వాటికి ఉపయోగిస్తే మంచిది. ప్రభుత్వాలు ఉచితాలను పక్కన పెట్టి వ్యవస్థలు అభివృద్ధి చెందడానికి రాయితీలు, ఇతర ప్రయోజనకర పథకాలు అమలుచేస్తే ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
Read also: hindi.vaartha.com
Read also: Faced by farmers:అప్పుల ఊబిలో అన్నదాతలు