📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

ISRO Makes History:ఘనత సాధించిన ఇస్రో

Author Icon By Hema
Updated: July 28, 2025 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచంలోని అగ్రదేశాలకు ధీటుగా తన సత్తాను చాటుతోంది. 2025 మొదట్లోనే రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది.

ఇస్రో ప్రయోగించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసి సత్తా చాటింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో ప్రకటించడం భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది.

మూడుసార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు

ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. గత డిసెంబరు 30న తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేసెంటర్ షార్లో నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ (Launch)వెహికల్ సీ60లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్ 1ఎ రాకెట్ (Rocket) నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు . పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఒక్కొక్కటీ 220 కేజీల బరువుండే ఈ రెండు శాటిలైట్ల మధ్య దూరం 20 కిలోమీటర్లు ఉండేలా లాంచింగ్ సమయంలోనే జాగ్రత్తలు తీసుకున్నారు.

తర్వాత క్రమంగా వీటి మధ్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చి 7వ తేదీన ఉదయం 9.30 గంటల సమయంలో అనుసంధానం చేయాలని భావించారు. అయితే చేజర్ ఉపగ్రహంలోని అనుసంధాన లింకు తెరుచుకోకపోవడంతో ఆ ప్రక్రియను జనవరి 9కి వాయిదా వేశారు. ఆ సమయంలో ఆ రెండు ఉపగ్రహాలు 1.5 కి.మీ దూరంలో ప్రయాణిస్తున్నాయి. వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో 1.3 కి. మీ దగ్గరికి తీసుకొచ్చారు. రెండింటి మధ్య దూరాన్ని 225 మీటర్లకు తగ్గించేందుకు ప్రయత్నించింది.

వాటి వేగం అదుపులోకి రాకపోవడంతో అనుసంధాన ప్రక్రియను మళ్లీ జనవరి 11కి వాయిదా వేశారు. ఎట్టకేలకు రెండు ఉపగ్రహాలనూ 230 మీటర్ల దగ్గరకు తీసుకొచ్చారు. జనవరి 12న ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్లకు తీసుకొచ్చారు. కొంత సమయం తర్వాత ఉపగ్రహాల వేగాన్ని నియంత్రించుకుంటూ రెండింటినీ 10 అడుగుల దగ్గరకు చేర్చారు. ఎట్టకేలకు గురువారం ఉదయం 9 గంటలకు నెమ్మదిగా రెండింటినీ అనుసంధానించారు. చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు.

దీనికోసం రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చి డాకింగ్ను మొదలుపెట్టారు. ఈ ప్రయత్నం విజయవంతమైనట్లు ఇస్రో చెప్పింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది. రాబోయే సంవత్సరాల్లో మన దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇది కీలక మెట్టుగా నిలవబోతోంది.

భవిష్యత్తులో చేపట్టబోయే భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్ 4, గగన్యాన్ ప్రయోగాలను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిర్వహించేందుకు బాటలు వేస్తుందని భావిస్తున్నారు. ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో భారత్ సొంత అంతరిక్ష కేంద్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు. అదేవిధంగా భారత్ చేపట్టబోయే గగన్యాను కూడా డాకింగ్ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు ప్రకటించారు.

శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన

మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఇస్రో పరిశోధనలకు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా శ్రీహరికోటలో ఇస్రో కోసం మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో రూ.3,985 కోట్ల పెట్టుబడితో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అంతరిక్ష మౌలిక సదుపాయాల్లో దేశానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. మొదటి, రెండో లాంచ్ ప్యాడ్లను పరిశీలిస్తే, ఈ రెండింటి కంటే ఇది చాలా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కొత్త లాంచ్ ప్యాడ్ ఇస్రో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోటలో ప్రయోగ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, రెండో లాంచ్ ప్యాడ్కు బ్యాకప్ పనిచేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ కొత్త లాంచ్ ప్యాడ్ భవిష్యత్తులో భారత మానవ అంతరిక్ష యాత్రలకు ఇస్రో సామర్థ్యాన్ని పెంచుతుందని, నాలుగేళ్లలో ఇది పూర్తవుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. మూడో లాంచ్ ప్యాడ్ కేవలం నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్ఐఎల్వి) మాత్రమే కాకుండా సెమీ క్రయోజనిక్ స్టేజ్తో లాంచ్ వెహికల్ మార్క్ 3 (ఎల్వీఎం3) వాహనాలకు, అలాగే ఎన్డీఎల్వీ స్కేల్ అప్ కాన్ఫిగరేషన్లను సపోర్ట్ చేసేలా డిజైన్ చేయబడుతుంది. ఈ ప్రాజెక్టులో విస్తృతమైన పరిశ్రమ భాగస్వామ్యం ఉంటుంది.

మునుపటి లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేయడంలో ఇస్రో అనుభవాన్ని ఉపయోగించడం, ఇప్పటికే ఉన్న లాంచ్ కాంప్లెక్స్ సౌకర్యాలను గరిష్టంగా ఉపయోగించడం కూడా ఇందులో భాగం. దీనితో తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరింత సాంకేతిక అభివృద్ధిని సాధించినట్లు అయ్యింది.

Read also: hindi.vaartha.com

Read also: Freebie Politics: ఓట్ల కోసం ఖజానా ఖాళీ

India Space Program ISRO ISRO Achievement ISRO Success Space Milestone

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.