📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

AP& TS water disputes: పెరుగుతున్న జల వివాదాలు

Author Icon By Digital
Updated: June 30, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ముదురుతోంది, as water disputes continue to affect both regions.

AP& TS water disputes: రెండు తెలుగు రాష్ట్రాల(AP&TS) మధ్య క్రమంగా జలవివాదాలు(water disputes) ముదురుతున్నాయి. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన జల వాటాల సున్నిత సమస్యలో రాజకీయాలు కీలకపాత్ర పోషించడంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. ప్రధానంగా స్థానికత, వేర్పాటువాదం వంటి విషయాలను ఈ అంశాల్లో జొప్పించడంతో పీటముడి బిగుసుపోతోంది.

రాజకీయ జోక్యంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి

ద్వైపాక్షిక చర్చలతో పరిష్కారం చేసుకోవాల్సిన అంశాలను రాజకీయ పార్టీలు జోక్యంతో ప్రజలకు, రైతులకు అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో నీటి వాటాలకు సంబంధించి కొన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రాల విభజన తరువాత సమస్య చిక్కుముడి విప్పడానికి లేనివిధంగా తయారైంది.

జల వృథా – ప్రాజెక్టులపై విమర్శలు

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి(godavari), కృష్ణా(krishna)నదులు ప్రధానంగా ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులపై సరైన ప్రాజెక్టు నిర్మించకపోవడంతో ఏటా వర్షాకాలంలో మూడు వందల నుంచి 5 వందల టిఎంసి నీరు వృథాగా సముద్రంలో కలసిపోతోంది. తెలంగాణలో లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదు. భారీగా నిధులు ఖర్చు చేయడంతో మిగులు బడ్జెట్లో ప్రారంభమైన తెలంగాణా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.

కాళేశ్వరం-బనకచర్లలు: ప్రణాళిక లోపాలు

ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించే ముందు తగిన ప్రణాళికలు, అధ్యయనం సక్రమంగా జరగలేదన్న విషయంలో కాళేశ్వరం చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రకృతికి వ్యతిరేకంగా నీటిని పారించే ప్రయత్నం చేయడం పెద్ద తప్పిదంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలోనే ఇదే సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకంగా 80 వేల కోట్ల అంచనాతో బనకచర్లకు పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) ను సిద్ధం చేశారు.

ఇన్ఫ్రా-పరిమితులు, రాజకీయ అభిప్రాయ మార్పులు

పోలవరం నుంచి సుమారు 460 కి.మీ. మేర లిఫ్ట్లు, సొరంగాలు, రిజర్వాయర్లు, భారీ మోటార్లు వంటివి వినియోగించాల్సి వస్తోంది. మరోపక్క లిఫ్ట వద్ద సుమారు 5 వేల మెగావాట్ల విద్యుత్ను ప్రస్తుతం వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో విద్యుత్ వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉంది.

రాజకీయాల మార్పులతో అభ్యంతరాలు

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బనకచర్ల విషయంలో ఎటువంటి అడ్డంకి తెలపలేదు. మాజీ మంత్రి రోజా ఇంటికి వెళ్లినప్పుడు కూడా కేసీఆర్ నీటి ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. అదేవిధంగా కాళేశ్వరం విషయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం చెప్పలేదు.

ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది

ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాయి. ప్రస్తుతం బిఆర్ఎస్ బనకచర్లను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అప్పుడు అనుకూలంగా ఉండి ప్రస్తుతం ఒక్కసారిగా ప్రాంతీయవాదాన్ని వెలుగులోకి తీసుకువచ్చి సమస్యను జటిలం చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బనకచర్ల విషయంలో వ్యతిరేకంగానే ఉంది.

ప్రయోజనాలపై మళ్లీ దృష్టి పెట్టాలి

పోలవరం దాటిన తరువాత గోదావరి నది జలాలు ప్రతి యేటా మూడు వందల నుంచి 5 వందల టిఎంసీలు సముద్రంలో కలుస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ జలాలను మాత్రమే తాము ఉపయోగించుకుంటామని, అది కూడా వరదల సీజన్ రోజుకు రెండు టిఎంసిల చొప్పున వంద రోజుల్లో 2 వందల టిఎంసీల వరకు ఉపయోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

కేంద్రానికి కీలక పాత్ర

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపీ పార్టీయే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామ్యంగా ఉండటంతో పర్యావరణ, ఇతరత్రా అనుమతులు సులువుగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జలవాటాల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమైన కష్టనష్టాలపై చర్చించడం ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు.

వాస్తవికత ఆధారంగా ముందుకెళ్లాలి

ఈ లోగానే ప్రతిపక్షాలు ఈ జలవాటాల వ్యవహారాన్ని జటిలం చేసే విధంగా ప్రకటనలు చేయడంతో ఇటు రైతుల్లోను, అటు ప్రజల్లోను భయాందోళనలు కలుగుతున్నాయి. ముఖ్యంగా నరేంద్రమోడీ ప్రధానిగా వచ్చినప్పటి నుంచి నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ – జలసంధానం దిశగా ముందడుగు

ఆంధ్రలో చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి, కృష్ణా నదీజలాల అనుసంధానం కలుగుతుంది. ఈ కారణంగా కూడా కేంద్ర ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు చెప్పకుండా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. కృష్ణానదికి ఎగువ ప్రాంతంలో పొరుగు రాష్ట్రాలు ప్రాజెక్ట్లు నిర్మించడం వల్ల గోదావరి నదితో పోలిస్తే ఈ నదిలో జలాలు తక్కువ మోతాదులో ఉంటాయి.

నీటి వినియోగం – ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి

గోదావరి నదికి ఎస్సా ఎస్పీ తరువాత పోలవరం మాత్రమే ఉన్నాయి. దీనితో వర్షాలు, తుఫానుల సీజన్లో భారీ మొత్తంలో నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు జలమయం అవుతుంటాయి. భారీగా నష్టాన్ని కలిగిస్తాయి.

నిర్ధారిత ప్రణాళికలతో జలవివాదాలకు ముగింపు

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సమన్వయంగా వ్యవహరించడం ద్వారా నీటికొరత, కరువు వంటి సమస్యలను అధిగమించవచ్చు. రాజకీయ కోణంతో కాకుండా వాస్తవికత, నీటి లభ్యత వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది.

Read also: Srisailam Project :పెనుప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్ట్

AP Telangana water dispute AP TS water issue Banakacharla project controversy Breaking News in Telugu Godavari water politics Google news increasing water disputes inter-state water conflict India Kaleshwaram project issues Krishna Godavari river issue Krishna river sharing Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu states river dispute Today news water crisis in South India water disputes between Telugu states

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.