అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వ్యవసాయానికి ఉపయోగించే విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, కూలీల వేతనాలు ఇలా అన్నీ పెరిగిపోతూ ఉండటంతో రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు.
బయట అప్పులు చేసి దుక్కిదున్ని ఆరుగాలం శ్రమించిన తరువాత పంటచేతికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి.
ఇందుకు ప్రధానకారణం వ్యవసాయ రంగానికి ఉపయోగించే పలు అంశాలు కార్పొరేటర్ల చేతిలోకి వెళ్లిపోయాయి. కార్పొరేట్ సంస్థలు చెప్పిందే వేదవాక్కుగా ఉండటంతో రైతుకు వేరే గత్యంతరం ఉండటం లేదు.
ఇదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. ప్రభుత్వం(Govt) నుంచి సరైన సహకారం లేకపోవడంతో రైతుల పరిస్థితి దీనావస్థకు చేరుకుంది.
ప్రస్తుతం రైతు కుటుంబాల్లోని కొత్తతరం వ్యవసాయానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.
రైతుల పిల్లలు ఐటి రంగం పైనా, రియల్ ఏస్టేట్ వంటి ఇతర వ్యాపారాల బాట పడుతున్నారు. ఇది మనదేశానికి భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది.
మన దేశం పూర్తిగా వ్యవసాయ ఆధారితమైంది. వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి బదులు ప్రస్తుతం పారిశ్రామిక రంగం వైపు దృష్టి సారిస్తోంది.
దీనివల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రధానంగా రైతులకు పెట్టుబడి వ్యయం, పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. కనీసం వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకు నేందుకు పూర్తి స్థాయిలో గోదాములు(warehouses) అందుబాటులో లేవు.
రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మార్కెట్ యార్డుల్లో దళారులు తిష్ట వేయడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన సర్వేను పరిశీలిస్తే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం అవుతుంది.
తెలంగాణలో ఒక్కొక్క
రైతు కుటుంబంపై సగటున లక్షా 52 వేల రూపాయల మేర అప్పులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది.
ఇక్కడ ఏకంగా రైతు కుటుంబాలపై సగటున రెండు లక్షల
45 వేల రూపాయల వరకు అప్పులు ఉన్నాయి. తెలంగాణలో సుమారు 91 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు.
ఇదే ఆంధ్రప్రదేశ్లో 93 శాతం మంది రైతులు అప్పుల్లో
ఉన్నారు. చిత్రమేమిటంటే రైతులకు రుణాలు ఇవ్వడంలో సైతం ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి.
దేశంలో సగటున 70 శాతం మంది ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు అందుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
ఆంధ్రాలో 49 శాతం మందికి రుణాలు అందుతుంటే తెలంగాణలో కేవలం 42 శాతం మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయి. దీనితో రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది.
వడ్డీ ఎక్కువ గా ఉండటం వల్ల సకాలంలో రైతులు అప్పులు తీర్చలేకపోతున్నారు. ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందితే ప్రకృతివైపరీత్యాల వల్ల రైతు నష్టపోతే ప్రభుత్వపరంగా సహాయం లభి
స్తుంది. అయితే వడ్డీ వ్యాపారుల వద్ద అటువంటి వెసులుబాటు ఉండదు. పైగా ఒకసారి పూర్తిగా అసలు చెల్లించకపోతే వడ్డీపై వడ్డీని విధిస్తారు.
ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందక పోవడంతో వారికి బీమా సౌకర్యం కూడా ఉండదు.
కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం రుణాలతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం ఇచ్చేందుకు ముందుకు వచ్చినా ఆ లబ్దిని భూయజమానులకు లభిస్తోంది.
రైతుబంధు వంటి పధకాలు కూడా కౌలు రైతులకు అందడం లేదు. రైతుల అప్పులపై సర్వే నిర్వహించిన తరువాత ఆంధ్రప్రదేశ్లో రైతులే ఎక్కువ రుణాల ఊబిలో కూరుకుపోయినట్లు సర్వే వెల్లడించింది.
ఆ తరువాత కేరళలో సగటున రెండు లక్షల 42 వేల రూపాయలు, పంజాబ్లో రెండు లక్షల మూడు వేల రూపాయలు అప్పులు ఉన్నట్లు తేలింది. తెలంగాణ మాత్రం 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్న వారు 31 శాతం ఉండగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి రుణం తీసుకున్న వారు 15 శాతం మంది ఉన్నారు.
తెలంగాణలో వ్యవసాయ రుణాలు వచ్చే వారి నుంచి 9 శాతం మంది రుణాలు పొందుతుండగా, సాధారణ వడ్డీ వ్యాపారుల నుంచి 41 శాతానికి పైగా రైతులు అప్పులు తీసుకుంటున్నారు.
బయటి వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకునే సమయంలో రైతులు అనేక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సదరు భూమిని విక్రయించినట్లు కూడా దస్తావే జులు సిద్ధం చేస్తారు. ఏమాత్రం డబ్బు కట్టలేకపోయినా రైతు నుంచి భూమి స్వాధీనం చేసుకోవడానికి వడ్డీ వ్యాపారులు వెనుకా డటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న రైతు బంధు పథకం రైతులకు ఆశించినంత ఫలితం ఇవ్వడం లేదు.
దీనికంటే వ్యవసాయరంగానికి సంబంధించిన సౌకర్యాలు కల్పించి ఆదుకుంటే మంచిదని రైతులు కోరుతున్నారు. సీజన్ ప్రారంభం కాగానే ప్రతి రైతు పెట్టు
బడి పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో
బ్యాంకర్లతో ప్రభుత్వం పూర్తిస్థాయి ఒప్పందం చేసుకోవడం లేదు.
లక్ష్యాన్ని పక్కన పెట్టికొద్దిమందికి మాత్రమే రుణం ఇస్తున్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్లో పోటెత్తుతున్నాయి. రైతులను బహిరంగానే మోసం చేస్తున్నా వారిపై సరైన చర్యలు ఉండటం లేదు. ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పంట దిగుబడి సాధిస్తే మార్కెటింగ్ వసతులు ఉండటం లేదు. కొన్ని సందర్బాల్లో పంట మార్కెట్ యార్డుకు తరలించిన తరువాత వర్షాలు వస్తే కనీసం వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకునే అవకాశం ఉండటం లేదు.
పండించిన పంటకు చివరకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుబంధు వంటి పథకాల కంటే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే ఆర్థికంగా మెరుగుపడ తామని రైతులు కోరుతున్నారు.
Read also: hindi.vaartha.com
Read also: Moosi Encroachments: మూసీకి ఆక్రమణల నుంచి మోక్షం లేదా?