📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Farmers Struggle Never Ends:అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..?

Author Icon By Hema
Updated: August 11, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Farmers Struggle Never Ends:వ్యవసాయాధారిత దేశంగా ఉన్నప్పటికీ అన్నదాతకు ప్రతి సీజన్లోను తిప్పలు తప్పడం లేదు. దేశంలో అన్ని వ్యాపారాలకు, పరిశ్రమలకు, వస్తువులకు కనీస మద్దతు ప్రభుత్వం నుంచి లభి
స్తున్నప్పటికీ అన్నదాతకు మాత్రం సరైన సహకారం ఉండటంలేదు. ఇప్పటి వరకు పంట చేతికి వచ్చినా దానికి సంబంధించిన డబ్బు అందేవరకు అన్నదాత ఆతృతగానే ఉంటున్నాడు.

ఈసీజన్లో అకాల వర్షాలు రైతుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రభుత్వం చేసే ప్రకటనలకు, మంత్రులు, స్థానిక ప్రజాప్రతి నిధులు చేస్తున్న హామీలకు(guarantees) ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ఈ యాసంగి సీజన్లో అకాల వర్షాలు (rains) రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పంట దిగుబడి అధికంగా వచ్చింది.

సీజన్ మొత్తం

సానుకూలంగా గడిచి పంట కూడా చేతికి వచ్చింది. ఇక వారం రోజుల్లో విక్రయాలు జరిగి డబ్బు చేతికి వస్తుందని ఆశగా ఉన్న రైతుకు అకాల వర్షాల రూపంలో వచ్చిన ఉపద్రవం కన్నీరు
పెట్టించే విధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ఇస్తానని ప్రకటించింది.

20శాతం తేమగా ఉన్నా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇది అమలులో ఏమేరకు సఫలీకృతం అవుతుందన్నది అనుమానస్పదమే. నష్టపరిహారం చెల్లించేందుకుఎన్నో నిబంధనలు ఉంటాయి. ఇది ఈ ఒక్కసీజన్ సమస్య కాదు. వరి ధాన్యం పండించేందుకు సుమారు 30 నుంచి 40 వేలు ఖర్చు ఉంటుంది.

నారుమడి, పొలం దున్నడం, చదును చేయడం, గట్టు చెక్కడం, వరినాటు, విత్తనాల కొనుగోలు, డిఎపీ రెండు బస్తాలు, యూరియా రెండు బస్తాలు, పొటాష్ ఒక బస్తా, పిచకారి, వరికోత మిషన్, ట్రాక్టర్, హమాలీ ఖర్చుల
ఇలా ఎన్నో రకాలుగా పెట్టుబడి పెట్టాలి. ఆ తరువాత సుమారు ఆరు నెలల పాటు శ్రమిస్తే, వాతావరణం అనుకూలించి, చీడపీడల బెడద లేకపోతే పంట చేతికి వస్తుంది. ఈ ఖర్చులన్నీ కలుపు కుంటే సుమారు 40 వేల రూపాయలు దాటుతుంది. సమస్యలు ఎదురై పంట నష్టపోతే ఇక ఆరుగాలం పండిన కష్టంతో పాటు పెట్టుబడి కూడా కోల్పోవలసి వస్తుంది.

ప్రభుత్వం కరుణ

చూపితే అక్కడి నుంచి వచ్చే మొత్తం పదివేల రూపాయలకుమించి ఉండటం లేదు. కనీసం నారుమడి, పొలం దున్నడానికి అయ్యే ఖర్చు కూడా తిరిగి రావడం లేదు. ఈ సీజన్లో నష్ట
పోయినా రాబోయే సీజన్లో తేరుకుందామన్న ఆశతో మళ్లీ పొలంబాట పట్టడం జరుగుతుంది. అయితే చాలామంది రైతులు వడ్డీలకు అప్పు చేసి పెట్టుబడి డబ్బులు తీసుకువస్తుంటారు.
ఈ సీజన్ సమస్యలతో సంబంధం లేకుండా వడ్డీవ్యాపారులు వ్యవహరిస్తుంటారు.

సకాలంలో డబ్బు తిరిగి చెల్లించకపోతే వడ్డీ, అసలు కలిపి కొత్త బాకీ తయారుచేస్తారు. ఇక మరో సీజన్కుడబ్బు ఇవ్వాలంటే ఎన్నో షరతులు ఉంటాయి. వాటన్నింటినీ భరించి రెండవ సీజన్లో రైతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. బీమా సౌకర్యం ఉన్నా రైతులకు పూర్తి స్థాయిలో సహాయం అందిన దాఖలాలు లేవు.

పంట రుణాలు తీసుకునే సమయంలో బ్యాంకులు బీమాకు సంబంధించి మొత్తాలను మినహాయించుకుని చెల్లింపులు చేస్తుంటారు. అయితే నష్టం
జరిగినప్పుడు మాత్రం బీమా క్లయిమ్తో సంబంధం లేకుండా ఇచ్చిన రుణాలను తిరిగి రాబట్టేందుకు బ్యాంకులు పట్టుపడుతుంటాయి.

కొందరు బ్యాంకు అధికారులు తమ లక్ష్యాలను పూర్తి చేసుకునేందుకు రైతులకు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లింపులు జరిగినట్లు రికార్డుల్లో చూపిస్తారు. రైతు రుణం తీసుకుని గడువు లోగా చెల్లించే పరిస్థితి లేకపోతే రైతును బ్యాంకుకు రప్పించి పాత రుణం చెల్లించినట్లు, అప్పటికప్పుడు కొత్త రుణం ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించి చేతులు దులుపుకుంటారు. ఈ సమయంలో ప్రభుత్వం రుణమాఫీ ప్రకటిస్తే ఆయా రైతులకు అన్యాయం జరుగుతుంది. ప్రతి సీజన్లో రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్క వరి రైతే కాదు వ్యవసాయ రంగానికి చెందిన అన్ని ఉత్పత్తులకు సంబంధించిన రైతుల పరిస్థితి ఇదే
విధంగా ఉంది. మనదేశం వ్యవసాయాధారిత దేశంగా గుర్తింపు పొందినా రైతులకు మాత్రం చేకూరిన ప్రయోజనం లేదు.

వ్యవసాయరంగాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం
కాని, రాష్ట్ర ప్రభుత్వాలు కాని ముందుకు రావడం లేదు. రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కంటి తుడుపు చర్యలు మినహా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం జరగడం లేదు. మన కంటే చిన్న దేశాల్లో, వ్యవసాయ విస్తీర్ణం తక్కువగా ఉన్న దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి.

చైనా వంటి దేశాల్లో వ్యవసాయ రంగం ప్రభుత్వ ఆధీనంలో
ఉంది. కొన్ని దేశాల్లో వ్యవసాయ పెట్టుబడులు పెట్టడమే కాకుండా, పంటను కొనుగోలు చేసే బాధ్యతను కూడా ప్రభుత్వాలే భరిస్తున్నాయి. ఈ కారణంతో అక్కడి యువత ఉన్నత చదువు
లు చదివినా వ్యవసాయ రంగంపై ఆసక్తి చూపుతున్నారు.

మన దేశంలో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ వ్యవసాయం నుంచి వేరే ఉపాధి మార్గాలను అన్వేసిస్తున్నారు. ప్రధా
నంగా రైతు కుటుంబాలకు చెందిన యువత వ్యవసాయానికిదూరంగా ఉండాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొవడమే కాకుం
డా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయ్యే ప్రమాదంఉంది.

ఇకనైనా ప్రభుత్వాలు రైతులను రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలతో సంబంధం లేకుండా వ్యవసాయరంగాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/software-jobs-crisis/sanghibavam/528775/


agricultural challenges crop loss farmer compensation Farmers issues Unseasonal rains

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.