📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Fake Products Regulation Failure:కల్తీని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం

Author Icon By Hema
Updated: August 1, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Fake Products Regulation Failure:శరీరానికి శక్తి కోసం, ఆరోగ్యం కాపాడుకోవడానికి తీసుకుంటున్న ఆహారం కల్తీల కారణంగా విషతుల్యంగా మారుతోంది. పండ్లు, కూరగాయలు, చివరకు పాలు, పప్పులు అన్నీ కల్తీకి
గురౌతున్నాయి.

వీటిని సేవించడం వల్ల శక్తి రావడం పక్కన పెడితే అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో(hospital)

చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లు అప్పుడప్పుడు తనిఖీలు చేసినప్పుడు పలు హోటళ్లలో కుళ్లిన, కల్తీ చేసిన ఆహార (Food) పదార్థాలను గుర్తిస్తున్నారు.

రసాయనాలు ఉపయోగించడం లేదని చెప్పుకునే పలు స్వీట్ దుకాణాల్లో ఎన్నో లోపాలను అధికారులుగుర్తించారు. ఈ దాడులు, కేసులు నామమాత్రంగా ఉంటున్నాయి. బహిరంగ మార్కెట్లో కల్తీ పదార్థాలను యధేచ్చగావిక్రయిస్తున్నా

అధికారులు పట్టించుకోవడం లేదు. మామిడి,
అరటి పండ్ల నుంచి బాదం, పిస్తా వంటి ఖరీదైన పదార్థాలవరకు కల్తీమయంగా మారింది. బర్రెలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ను ఇస్తున్నారు.

పశువుల నుంచి సేకరించే పాలులో

దీనివల్ల ఆ పశువుల నుంచి సేకరించే పాలులో
ఇంజక్షన్ మూలాలు మిగిలి ఉంటాయి. దీనిని సేవించడం వల్ల చిన్నపిల్లల్లో హార్మోను సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. మహిళల్లో బహిష్టు, గర్భం వంటి సమయాల్లో సమతుల్యత దెబ్బతిని ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

యువతులు ఈ పాలను తాగడం వల్ల మహిళల్లో సహజసిద్ధంగా ఉండే హార్మోన్లు దెబ్బతింటాయి. బాలింతలు ఈ పాలు తాగితే ఆ ప్రభావంతమ వద్ద పాలు తాగే చిన్నారిపై చూపిస్తుంది. దీనితో పసికందులు అనేక రోగాల బారిన పడతారు.

ఇది సరిపోదంటూ పాలలో పిండి పొడి, సబ్బు నురగ, ఇతర రసాయనాలు కలుపుతారు. దీనివల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు చుట్టుముడతాయి. పప్పులలో రంగులు, రసాయానాలు, లీడ్ మెట్ వంటివి ఉప యోగిస్తున్నారు.

దీనివల్ల పేగులు దెబ్బతింటాయి. కాఫీ పొడిలోచికోరీ, చింతపండు గింజల పౌడర్ కలుపుతు న్నారు. చక్కెరలో చాక్ పౌడర్, వాషింగ్ షోడా, యూరియా వంటివి కలుపుతున్నారు. మిరియాలు, ఆవాలులో ఎండిన బొప్పాయి గింజలు,బ్లాక్బ ర్రీస్, ఆరెమోన్ విత్తనాలతో కల్తీ చేస్తారు. దీనివల్ల కడుపు, చర్మ వ్యాధులు, ఉదర సంకోచాల్లో వ్యత్యాసం, అలెర్జీలు చుట్టుముడతాయి.

ఆయుర్వేదంలో యాంటీబయోటిక్గా పేర్కొనే పసుపు సైతం కల్తీ చేస్తున్నారు. పురుగుల మందులు,
సాడస్ట్, సుద్ద, పరిశ్రమల్లో వాడే రంగులు, మెటానిల్ పసుపు, సీసం వంటివి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల కేన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

కారం, ధనియాల పొడిలో ఇటుక పౌడర్, రెడ్డ్, సింథటిక్ రంగులు, ఆరోగ్యాన్ని హానీ చేసే లవణాలు కలుపుతున్నారు. దీనివల్ల రక్తపోటు, ట్యూమర్, కేన్సర్ వ్యాధులు వస్తున్నాయి. పండ్లు కూరగాయలపై రసాయన రంగులు, మలాకైట్, కాల్షియం కార్బైడ్, కాపర్ సల్ఫేట్, ల ఆక్సిటోసిన్, సావరిన్ మైనం వంటి ప్రమాదకర వస్తువులను
కలుపుతున్నారు.

వీటి వల్ల జీర్ణవ్యవస్థ మందగించడం, క్యానర్వ్యాధి బారిన పడటం, ఉదర సంబంధ రోగాలు చుట్టుముడతున్నాయి. నెయ్యిలో పశువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు
కలుపుతున్నారు.

అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి

ఇక మామిడి పండ్లు, అరటి పండు మగ్గబెట్టడానికి రసాయనాలు ఉపయోగిస్తున్నారు. యాపిల్ పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి మైనం వాడుతున్నారు.
కొబ్బరి బోండాలు దిగుబడి రావడానికి, ఎక్కువ నీరు పొందడానికి చెట్ల మొదళ్లకు హానికర మైన ఇంజక్షన్లు వేస్తున్నారు.

దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ద్రాక్ష తోటల పెంపకం సమయంలో ఉపయోగించే క్రిమిసంహారక మందులు, ఇతర రసాయనాలు అధికంగా ఉంటున్నాయి. ఫుడ్సేఫ్టీ అండ్స్టాండర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియాను 2006 ఆహార భద్రత
ప్రమాణాల చట్టం కింద రూపొందించారు. చట్టం సెక్షన్ 22 ప్రకారం ఆహారాల తయారీ, పంపిణీ, అమ్మకం, దిగుమతుల్లో కల్తీలను నివారించే బాధ్యతను అప్పగించారు.

ప్రస్తుతం కల్తీ నేరానికి వెయ్యి రూపాయల జరిమానా, ఆరు నెలల జైలు శిక్షను విధిస్తున్నారు. అయితే దీనిని పది లక్షల వరకు జరిమానా గాను, యావజ్జీవ శిక్ష గాను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కల్తీలను మూడు విభాగాలుగా గుర్తించారు. ఆదాయం పెంచుకోవడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా కల్తీ చేయడం, అనాలో
చితంగా అంటే సాగు సమయంలో ఉపయోగించే రసాయానాల మిళితం వల్ల కలిగే నష్టాన్ని కల్తీగా గుర్తించారు. 1954 నుంచి అమలులో ఉన్న ఏడు రకాల చట్టాలను మిళితం చేసి 2006 నుంచి కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని మార్పు లు తీసుకువచ్చినా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు.

పలుమార్లు న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేకుండా ఉంది. కళ్లని అడ్డుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారు. తరచూ సోదాలు నిర్వహించి కేసులు నమోదు చేస్తే కొంత వరకు ఫలితం కనిపిస్తుంది. అయితే సోదాలు నిర్వహించడానికి కావల్సిన మేరకు సిబ్బంది లేకపోవడంతో కల్తీ వ్యాపారాలను అరికట్టేందుకు వీలు లేకుండా ఉంది. దీనితో కల్తీని నిరోధించే అవకాశం ఉండటం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీటి గురించి పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీ కరించలేకపోతున్నారు.
వ్యాపారం చేయాలంటే కల్తీ తప్పదన్న దృక్పధం వ్యాపారుల్లో కలుగుతోంది. అయితే దీనివల్ల వారికి ఆర్థికపరమైన వెసులు బాటు కలిగినా ప్రజలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కల్తీవిషయంలో ప్రభుత్వం కఠిన వైఖరి ఉపయో గించినప్పుడే కల్తీని కొంత వరకైనా నివారించ అవకాశం ఉంటుంది.

Read also: hindi.vaartha.com

Read also: Legal Awareness and Crime Prevention: చట్టాలపై అవగాహనతోనే నేరాల అదుపు

Adulterated milk Fake food items Food safety India government negligence Health hazards

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.