Endless Land Encroachments:విలువైన ప్రభుత్వ భూముల కబ్జాలకు అంతం లేకుండా ఉంది. కొందరు ప్రజాప్రతినిధుల నుంచి రియల్టర్లు, వ్యాపారులు, రాజకీయ పలుకుబడి ఉన్న బడా వ్యక్తులు యదేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములు, ఇనాం భూములు, దేవాదాయశాఖ భూములు, చెరువులు, కుంటలు, కాల్వలకు చెందిన భూములను కబ్జా చేసి పక్కా భవంతులు నిర్మించుకుంటున్నారు.
హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో శివారు ప్రాంతాల్లో కబ్జాల పర్వం జోరుగా సాగుతోంది. అధికార పార్టీలో ఉన్న కొందరు నేతలు, ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున భూకబ్జాలకు పాల్పడుతూ
భవంతులు నిర్మించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంపై ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారే కాని కబ్జాలపై ఏ పార్టీ కూడా అధికారం చేపట్టిన తరువాత చర్యలు (Actions) తీసుకున్న దాఖలాలు లేవు. రెండు తెలుగు రాష్ట్రాలో ఏదో ఒక ప్రాంతంలో నిరంతరం కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. కబ్జాలకు అడ్డుకట్టవేయాల్సిన రెవెన్యూ (Revenue) యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. ఒకవేళ చర్యలు తీసుకున్నా ఆయా అధికారులపై వేధింపులు ప్రారంభం అవుతున్నాయి.
దీనితో కబ్జాలు జరుగుతున్నట్లు గుర్తించినా చర్యలు తీసుకు నేందుకు రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపలేకపోతోంది. చిన్న చిన్న కబ్జాలను సైతం అరికట్టలేని నిస్సహాయ స్థితిలో నేడు ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
ముఖ్యంగా చెరువులు, కాల్వలు కబ్జాలకు గురౌతున్నాయి.
హైదరాబాద్లో పరిశీలిస్తే మూసీ నది మొత్తం కబ్జాలకు గురైంది. దీనితో చిన్నపాటి వర్షం వచ్చినా నీరు పారేందుకు అవకాశం లేకపోవడంతో చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తుతోంది. ఇటీవల కాలంలో ముంపు ప్రాంతాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
జిల్లాల్లో కూడా ఇదే విధమైన కబ్జాలు కొనసాగుతున్నాయి. ఒక పథకం ప్రకారం స్థలాన్ని కబ్జా చేసి ఒకటి రెండు నెలల్లో పక్కా భవనాన్ని నిర్మించుకుంటున్నారు. అనంతరం తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేయించి మున్సిపల్ శాఖ నుంచి మంచినీరు, విద్యుత్ సరఫరా వంటివి పొందుతున్నారు. ఇక వారిని అక్కడి నుంచి తొలగించే అవకాశం లేకుండా పోతోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి, ఫైనాన్సియల్ సిటీ, బైరామల్గూడ వంటి ప్రాంతాల్లో కబ్జాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ భూముల విలువ గణనీయంగా పెరిగి పోవడంతో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
రాత్రికి రాత్రే భవనాలు వెలుస్తున్నాయి, రోడ్లు వేసి విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి భూకబ్జాకు వెనుక అధికార పార్టీ ప్రతినిధుల మద్దతు ఉంటోందని, అందుకే తాము ఏమీ చేయలేకపోతున్నట్లు అధికారు లు వాపోతున్నారు. ఇక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లను ఏర్పాటుచేస్తున్నారు.ఆదివారం వస్తే చాలు కొనుగోలుదారులు ఈ ప్రాంతాలకు రావడంతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేసి రియల్టర్లు అమ్ముకుంటున్నారు.
అక్రమ వెంచర్ల వద్ద భారీ బోర్డులు సైతం పెట్టి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అక్రమాలు జరుగుతున్నా వారిని అడ్డుకునే వారు లేకుండాపోయారు. ప్రతి వెంచర్క తాము పెద్దమొత్తంలో డబ్బులను ఆయా ప్రాంతాల్లోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు, బడా నేతలకు ముట్టజెబుతున్నట్లు రియల్టర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సదరు వెంచర్ నిర్వాహకులు ఏర్పాటుచేసే కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు సైతం హాజరు అవుతున్నారు. ఆయా ఫంక్షన్లలో పాల్గొన్న ప్రముఖుల ఫోటోలను ఆల్బమ్లు తయారు చేసి భూమి కొనుగోలు చేయడానికి వచ్చిన వారిని బురిడీ కొట్టించి విక్రయాలు కొనసాగిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు
అక్రమ వెంచర్లు, భూకబ్జాదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఒకరిద్దరిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వారు బెయిల్ తీసుకుంటున్నారు. భూకబ్జాలకు సంబంధించి సరైన చట్టాలు లేకపోవడంతో అధికారులు కూడా
కబ్జాదారులపై కఠినంగా వ్యవ హరించలేకపోతున్నారు.
పోలీసుల దృష్టికి వెళ్లిన కేసులను సాధారణ సెక్షన్లతో సరిపెడుతున్నారు. భూవిక్రయాలు జోరుగా జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు
సెటిల్మెంటట్ సెంటర్లుగా రూపాంతరం చెందుతున్నాయి. రౌడీషీటర్లు, కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సెటిల్మెంట్ల ద్వారా లక్షల రూపాయ లను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూముల కబ్జాలు పట్టించుకునే వారు లేకుండా పోయారు.
కొన్నింటిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకునే ప్రయత్నం చేయగా కబ్జాదారులు కోర్టును ఆశ్రయించి చర్యల నుంచి మినహాయింపు పొందుతున్నారు. సివిల్ కేసులు కావడంతో సంవత్సరాల తరబడి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. కబ్జాలకు సంబంధించి మీడియా ప్రతిరోజూ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూనే ఉన్నాయి, అయితే అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు.
చాలా సందర్భాల్లో మీడియా ప్రతినిధులకు కబ్జాదారుల నుంచి హెచ్చరికలు రావడం, అక్కడకక్కడా దాడులు కూడా జరిగాయి. కబ్జాదారులు ఆర్థికంగా బలవంతులు కావడం, రాజకీయ పలుకుబడి ఉండటంతో వారిని ఎదుర్కొనే అవకాశం ఉండటం లేదు. అక్రమ లేఅవుట్లకు విషయం లో అడ్డుకట్ట వేయడానికి సరైన చట్టాలు లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే చెరువులు, పంటకాల్వలు కనిపించకుండాపోతున్నాయి. ఇకనైనా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టసవరణలు చేయాల్సిన అవసరం ఉంది.
Read also:hindi.vaartha.com
Read also: