📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Eco-Conscious Siddhi Vinayaka:ప్రకృతి పరిరక్షణ సిద్ధి వినాయకుడి ఆశయం

Author Icon By Hema
Updated: July 30, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వినాయక చవితి అనేక సందేశాలను మానవాళికి పంచే గొప్ప పండుగ.ఇతర పండుగల్లా కాకుండా ఇది సామాజికపరంగా కొనసాగుతోంది. అంతేకాదు ప్రకృతి పరంగా మనకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. కొన్ని పండుగలు భక్తి శ్రద్ధలతో ఇంటికి మాత్రమే పరిమితమై జరుపుకుంటారు. అయితే సామాజికంగా అందరూ కలిసి చేసుకునే అతికొద్ది పండుగల్లో వినాయక చవితి అతి ముఖ్యమైనది. వర్షాకాలం ప్రారంభమై చెట్లకు చిగురులు పట్టి పర్యావరణం ఆకుపచ్చ (green) చీర కట్టుకున్నట్లు ఉండే సీజన్లో ఈ పండుగ వస్తుంది.

వినాయక చవితి నాడు తప్పనిసరిగా వర్షం (rain) కురుస్తుంది. పండగకు ముందే నెల రోజుల నుంచి వర్షాలు కురుస్తాయి. వేసవి కాలం మండుటెండకు బోసిపోయినట్లుండే చెట్లు చిగురులు వేసి కొత్త లేతాకుపచ్చతో కళకళలాడుతుంటాయి.

మరోపక్క చెరువుల్లో వర్షం కురిసి అప్పటి వరకు బీడువాడినట్లు ఉండే నేల తడిగా మెత్తగా మారుతుంది. సమాజం ఆధునిక పోకడలు పోక ముందు 90 శాతం వ్యవసాయాధారిత కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. గ్రామాల్లో
చెరువులు, కుంటలు, నదుల నిర్వహణ విషయంలో ప్రతిఒక్కరూ ఆలోచన చేసే వారు. సాంకేతికత పెరగడం, నగరాల్లో పనిచేయాలని యువత భావించడంతో క్రమంగా తమ గ్రామం గురించి ఆలోచించే వారు తగ్గిపోయారు.

వినాయక చవితి అటు వ్యవసాయ రంగానికి, ఇటు ప్రకృతి పరిరక్షణకు ఉపయోగపడుతుంది

ఏ పనిచేయాలన్నా ప్రభుత్వందే బాధ్యత అన్న భావన పెంచుకున్నారు. మనకు ఉపయోగూపడే చెరువును గాని, నిత్యం ప్రయాణించే రహదారి కాని ఏదైనా అది ప్రభుత్వం చూసుకోవాలన్న భావన పెరిగిపోవడం వల్ల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితాలు సాధించడం లేదు.వినాయక చవితి అటు వ్యవసాయ రంగానికి, ఇటు ప్రకృతి పరిరక్షణకు విధంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు.

తొలకరి వర్షాలతో చెరువులు, కుంటల్లో నేల తడి గా మారుతుంది. ఆ మట్టిని గ్రామస్తులు తీసుకువచ్చి వినాయక ప్రతిమలు చేసి పూజలు చేస్తారు. దీనితో మొత్తం గ్రామం తమ సమీపంలోని చెరువులు, కుంటల వద్దకు వెళ్లి ప్రతి కుటుంబం ఎంతోకొంత మట్టి తవ్వి ఇంటికి తీసుకువెళ్లేవారు. ఇది కాకుండా ప్రతి బస్తీలో, కాలనీలో యువకులు భారీ మొత్తంలో మట్టిని పోగుచేసి చౌరస్తాల్లో పెద్దపెద్ద వినాయక విగ్రహాల ప్రతిమలు ప్రతిష్టించే వారు. దీనితో చెరువుల్లో పూడికను ఎవరికి వారు తీసివేసి నీరు నిల్వ ఉండటానికి ఆయా చెరువులకు జీవం పోసేవారు. వినాయకుడిని పత్రితో పూజిస్తారు కాబట్టి 14 రకాల చెట్ల నుంచి ఆకులను కోసి ఇంటికి తీసుకువచ్చే వారు.

దీనివల్ల కొత్త ఆకులు మళ్లీ చిగురించి చెట్టుకు జీవం పోసుకునేందుకు దోహదపడేది. సీజన్ మారుతుండటం, లేత ఆకులు ఉండటంతో చీడపురుగులు ఆశించి నష్టం కలిగించేవి. ఈ తరుణంలో ఆకులను తెంపుకోవడం వల్ల చీడపురుగుల నుంచి చెట్లుకు విముక్తి లభించేది. దీనివల్ల సెప్టెంబరు, నవంబర్లో కురిసే వర్షాలకు చెట్టు మరింత ఏపుగా పెరిగి పర్యావరణాన్ని సమతుల్యం చేసే అవకాశం కలుగుతుంది.

మరోపక్క ఇది సామాజిక పండుగ కావడంతో కాలనీవాసులు ప్రాంతీయ, వర్గ విభేదాలు
మరిచి కలిసి మెలసి తిరిగే అవకాశం కలిగేది. స్థానికంగా చిన్నచిన్నతగాదాలు, ఘర్షణలు ఉన్నా వినాయకచవితి సమయంలో అందరూ కలిసి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడేది. ఈ విధంగా ప్రకృతి పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి అనేక అంశా ల్లో స్పష్టమైన ఫలితాలు కనిపించేవి. మట్టిపనివారికి, విద్యుత్ దీపాలం కరణ చేసే వారికి, వివిధ వృత్తులకు చెందిన వారికి ఏదో ఒక పని వినాయక చవితి సమయంలో లభించేంది.

ఇక పురాతన సాంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట,
నాటకాలు వంటి అనేక కాలక్షేప కార్యక్రమాలు వినాయక పందిళ్లలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వారు. దీనివల్ల ఆయా కుటుంబా లకు కొంత ఆర్థిక వెసులుబాటు లభించేది. ఇక తొమ్మిది రోజుల పాటు వినాయకుడి పూజలు ముగించి అందరూ కలిసి వినాయక ప్రతిమను
సమీపంలో చెరువుల్లో నిమజ్జనం చేసే వారు.

దీనివల్ల చెరువుల్లో మట్టి రీసైక్లింగ్ అయ్యేంది. చెరువు గట్లు పటిష్టంగా మారేందుకు అవకాశం కలిగేది. వినాయకుడిని పూజించిన పత్రి చెరువుల్లో వేయడం వల్ల ఆయా ఆకుల నుంచి వచ్చే రసాలు ప్రకృతిపరంగా నీటికి కొన్ని వనరు లను కల్పించేవి. నీటిలో కలిగిన ఈ ఆకుల పసరు, రసాలు నీటిని శుద్ధి చేయడంతో పాటు వ్యవసాయానికి ఉపయోగించే నీటికి కొత్త శక్తిని ఇవ్వడం జరుగుతుంది.

ఇదంతా ఒకప్పటి అంశాలు, విషయాలు. ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం వినాయకచవితి పందిళ్లలో
కనిపిస్తోంది. విగ్రహాలను ఎత్తు పెంచడం ఫ్యాషన్గా మారిపోయింది. దీనికోసం మట్టికి బదులు పర్యావరణాన్ని హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ప్యారిస్ ను ఉపయోగిస్తున్నారు. ఇళ్లలో వినాయక ప్రతిమల విషయంలో కొంత మార్పు వచ్చింది.

చాలా మంది ప్రస్తుతం మట్టి గణపతులను


కొనుగోలు చేసి పూజలు చేస్తున్నారు. బస్తీల్లో ఏర్పాటుచేసే విగ్రహాల విషయంలో కూడా కొందరు మట్టితో చేసిన విగ్రహాలను ప్రతిష్టించాలని కమిటీలు దృష్టి సారిస్తున్నాయి. ఇది శుభపరిణామంగా
కనిపిస్తోంది. విగ్రహాల ఎత్తు కంటే పర్యావరణాన్ని మద్దతు పలికే విధంగా ప్రతిమలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విగ్రహాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకారిగా ఉండే పెయింటింగ్లను ఉపయోగిస్తున్నారు.

వీటి స్థానంలో సాంప్రదాయ బద్ధమైన రంగులను ఉపయోగించేందుకు ప్రయత్నించాలి. విగ్రహం ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలే కాని ఎత్తు ముఖ్యం కాదన్న విషయాన్ని పందిరి నిర్వాహకులు గ్రహించాలి. న్యాయస్థానాలు
కూడా పర్యావరణం దిశగా ఆలోచనలు చేయాలని ధార్మిక సంస్థలకు పదే పదే సూచనలు చేస్తున్నాయి. ఇది అతి సున్నితమైన విషయం కావడంతో న్యాయస్థానాలు, ప్రభుత్వాలు అంతకు మించి ఏమీ చేయలేవు. ప్రజల్లో మార్పులు రావాలి.

వినాయకుడు కోరుకునే పర్యావరణానికి చేరువుగా ఉంటూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆశీస్సులు పొందడంతో పాటు రాబోయే తరాలకు
ప్రకృతి ఫలాలు ఇవ్వడానికి ప్రతిఒక్కరూ ఆలోచించాలి.

Read also: hindi.vaartha.com
Read also: Ragging:కొత్త పుంతలు తొక్కుతున్న ర్యాగింగ్

EcoFriendlyFestival EnvironmentalAwareness GaneshChaturthi SiddhiVinayaka

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.