📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Aqua Sector Crisis: సంక్షోభంలో ఆక్వా రంగం

Author Icon By Hema
Updated: September 8, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశానికి భారీ మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని అందిస్తున్న ఆక్వా రంగం ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఆక్వా రంగంపై తీవ్రస్థాయిలో చూపిస్తోంది. ఆది నుంచి పెద్ద మొత్తంలో రొయ్యలను అమెరికాకు ఇక్కడ నుంచి ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రికార్డు స్థాయిలో ఎగుమతులు ఉంటాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత సం॥లో 62 వేల కోట్ల రూపాయల మేర ఎగుమతులు జరిగితే అందులో 45 శాతం వరకు కేవలం ఆక్వా రంగం నుంచి రొయ్యల వాటా ఉండటం గమనార్హం. మన దేశం నుంచి 17 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయ్యాయి. ఈ రంగంపై ఆధారపడి రాష్ట్రంలో ప్రత్యక్షంగా సుమారు 15 లక్షల మంది రైతులు (Farmers) ఆధారపడి ఉన్నారు. పరోక్షంగా మరో 25 లక్షల మంది ఆక్వారంగం నుంచి వివిధ స్థాయిలో ఉపాధి పొందుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించినమేరకు ఆక్వా రైతులకు సహాయం అందడం లేదన్నది వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వైరస్ సోకినా ఆక్వా రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. మన దేశ ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఈ రంగంపై ఆధారపడి రాష్ట్రంలో

ప్రత్యక్షంగా 15 లక్షల మంది ఉపాధి పొందుతుండగా, పరోక్షంగా దాదాపు 20 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. మన దేశ ఆక్వా ఎగు మతులకు ఎంతో కాలంగా అమెరికా (America) ప్రధాన కేంద్రంగా ఉంది. ఇటీవల ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల దెబ్బతో ఈ రంగం తీవ్రంగా ప్రభావితమవుతున్నది. ఆక్వా ఎగుమతుల పరంగా అమెరికాపై ఎక్కువగా ఆధారపడటం, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వాలు ముందస్తుగా దృష్టి సారించకపోవడం, అంతర్గతంగా దేశీయ మార్కెట్లో ఈ ఉత్పత్తుల వినియోగంపై బుద్ధిపూర్వక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం వంటి అనేకానేక కారణాలు నేడు ఏపీలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఆయోమయ, ఆందోళనకర పరిస్థితులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారణమవుతున్నాయి. మన దేశ చేపల ఉత్పత్తిలోనూ ఒక్క ఏపీ మాత్రమే దాదాపు మూడో వంతు ఉత్పత్తిని సాధిస్తూ, రాష్ట్రంలోని పలు జిల్లాల వ్యాప్తంగా 5,72,065 ఎకరాల్లో చేపల చెరువులు విస్తరించి ఉన్నాయి. రెండు లక్షల ఎకరాల్లో సంప్రదాయ నీటి వనరుల నుంచి చేపలు, రొయ్యల సాగును కొనసాగిస్తున్న లక్షలాది మంది మత్స్యకారు లున్నారు. అయితే ఆక్వా ఎగుమతుల్లో అగ్రభాగం అమెరికాకు మాత్రమే జరుగుతుండటం వల్ల ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాల నిర్ణయంతో ఈ రంగానికి తీవ్ర నష్టం చేకూరుతోంది. ఈ ఉత్పత్తుల్లో అమెరికాకు 36.4 శాతం, చైనాకు 17.2 శాతం, యూరప్ దేశాలకు 15 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. ముందు నుంచి వ్యూహాత్మకంగా ఆక్వా ఎగుమతులను ఇతర దేశాలకు ఎగుమతులు చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. దీనితో ఒక దేశం తీసుకున్న నిర్ణయానికి ఆక్వా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొనే దుస్ధితి కలిగింది. అనేక దేశాలకు ఆక్వా దిగుమతులు అవసరం ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వెరైటీ రొయ్యలను. చేపలను వినియోగిస్తుంటారు. ఆ మేరకు ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించవలసి ఉంది.

Aqua Sector Crisis

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వెనామీ రంగం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వెనామీ రంగం రొయ్యల ఉత్పత్తి అధికంగా ఉంది. దీనినే అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచ విపణి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆక్వా రంగంలో వేర్వేరు వంగడాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం రొయ్యలను, చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఆధునిక పద్ధతులు అందు బాటులో లేవు. ఫ్రీజింగ్ వల్ల కొన్ని రోజులు మాత్రమే రొయ్యలు, చేపలు తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటాయి. దీనితో చెరువుల నుంచి వచ్చిన రొయ్యల ఉత్పత్తిని ఆఘమేఘాలపై ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఏమాత్రం ఆలస్యమైనా ఇక్కడ నుంచి వెళ్లిన నౌకలు సరుకు దిగుమతి చేయకుండా తిరిగి వెనక్కు వస్తుంటాయి.

వేల కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని సాధిస్తున్న ఆక్వా రంగాన్ని

వేల కోట్ల రూపాయల విదేశీ మారకాన్ని సాధిస్తున్న ఆక్వా రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. దశాబ్దాల తరబడిగా పాత విధానాలనే కొనసాగించడం వల్ల ఆశించిన మేరకు ఆక్వా రంగం పురోగతి సాధించలేకపోతోంది. ఎన్నో యేళ్లుగా కేవలం అమెరికా మార్కెట్ మీద మాత్రమే ఆధారపడిన ఎగుమతుల విధానాన్ని సవరించుకుని మన దేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను చేసుకోగలిగే ప్రత్యామ్నాయ మార్కెట్ వెసులుబాటు ధోరణులను అనుసరించడం మరింత శ్రేయస్కరంగా
ఉంటుంది.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/online-the-center-is-focused-on-online-gaming/sanghibavam/539351/

AquaCrisis AquaIndustry AquaSector FishFarming Latest News in Telugu ShrimpFarming Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.