📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు హైదరాబాద్ ను హడలెత్తిస్తున్న భారీ వర్షాలు జీ ఎస్ టి సంస్కరణలతో సామాన్యులకు మేలు పగ్గాలు లేని పసిడి ధరలు సంక్షోభంలో ఆక్వా రంగం ఆన్ లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర్ర నిఘా లోపంతోనే ఫెర్టిలిటీ మోసాలు ఖైదీల్లో గోల్డ్ మెడలిస్ట్లు చిన్నపిల్లలకు సైతం గుండెపోటు బెడద అన్నదాత బతుకు ఎప్పుడూ ఆగమేనా..? సంక్షోభంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు

Agriculture Crisis in India :సంక్షోభంలో వ్యవసాయ రంగం

Author Icon By Hema
Updated: August 2, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Agriculture Crisis in India:మన దేశం వ్యవసాయాధారిత ప్రాంతం, ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పరిశ్రమల్లో కార్మికుల కన్నా రెట్టింపు ఉంటుంది. అనేక దేశాలు మన వ్యవసాయ ఉత్పత్తుల కోసం వేచి చూస్తుంటారు. అయితే కొన్ని ఉత్పత్తులను ఇతర దేశాలను దిగుమతి చేసుకోవడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు కలుగుతున్నాయి.

తాజాగా గుజరాత్ మార్కెట్లో చైనాలో ఉత్పత్తి చేసే వెల్లుల్లి (garlic) చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా మన దేశంలో ఉత్పత్తి అవుతున్న వెల్లుల్లి గడ్డకంటే చైనా వెల్లుల్లి దాదాపుగా రెట్టింపు పరిమాణంలో ఉంటుంది.

అదేవిధంగా వెల్లుల్లి రెమ్మలు కూడా పెద్దవిగా, ఆకర్షణీయంగా ఉంటాయి. పైగా ప్రత్యేకమైన హైబ్రీడ్ (Hybrid) విధానాల్లో వీటిని పండించడం వల్ల ధరలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ మధ్యంతరంగా ఉండే వెల్లుల్లి సమారు వంద నుంచి 120 రూపాయలు ఉంటే చైనా వెల్లుల్లి అందులో సగం ధరకే మార్కెట్లో లభిస్తుంది.

అయితే చూడటానికి ఆకర్షణీయం గా ఉన్నప్పటికీ వాటి స్వభావాన్ని దగ్గరగా పరిశీలిస్తే దేశీయ వెల్లుల్లి అనేక రెట్లు నాణ్యత కనిపిస్తుంది. మనదేశంలో ఉత్పత్తి అయ్యే వెల్లుల్లి గడ్డలో రెమ్మలు దగ్గరగా ఉంటాయి. వాటిపై పొట్టును తీసిన వెంటనే వెల్లుల్లి ఘాటు వాసన వస్తుంది. అయితే చైనా వెల్లుల్లిలో ఆ రకమైన సువాసన గాని, ఘాటుతనం కాని ఉండదు.

గుజరాతీయులు స్పష్టం చేస్తున్నారు

వంటల్లో వాడే సమయంలోగుజరాతీయులు స్పష్టం చేస్తున్నారు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందని . చైనా నుంచి పెద్ద సంఖ్యలో వెల్లుల్లి దిగుమతి అయితే మన మార్కెట్లో స్వదేశీ వెల్లుల్లికి సంక్షోభం ఏర్పడుతుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు ఇక్కడ ధర పెరిగినప్పుడు మాత్రమే విపణిలో దర్శనమిస్తాయి.

రేట్లు పడిపోతే దిగుమతులు నిలిచి పోతాయి. దీనివల్ల మంచి ధర పలుకుతున్నప్పుడు మన రైతులు నష్టపోతారు. వ్యవసాయంలో లాభనష్టాల స్థాయి అత్యధికంగా ఉంటుంది. ఉదాహరణకు టమోటాను పరిశీలిస్తే కొన్ని సందర్భాల్లో కిలో 200 రూపాయలు పలుకుతాయి. నెల రోజుల వ్యవధిలో ఒక్కసారిగా కిలో పదిరూపాయలకు పడిపోతుంది. ధరలు పడిపోయినప్పుడు నష్టపోయిన రైతులు పెరిగినప్పుడు కొంతసొమ్ము చేసుకుని ఆర్థికంగా నిలబడతారు.

అయితే విదేశాల నుంచి ఉత్పత్తులు దిగుమతి అయ్యే సమయంలో ఈ హెచ్చుతగ్గుల చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల మన దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారు. గత రెండు దశాబ్దాల లెక్కలను పరిశీలిస్తే వ్యవసాయ రంగంతో ఉత్పత్తులు ఇప్పటికే 20 శాతం వరకు 30 తగ్గాయి. వ్యవసాయం గిట్టుబాటు కాదని రైతులు తమ పిల్లలను ఐటీ ఉద్యోగాలకు ప్రోత్సహించడం, వ్యవసాయ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడటం వంటి అంశాలవల్ల వ్యవసాయం కుదించుకుపోతోంది.

గిట్టుబాటు ధర రాక రైతులు అవస్థలు

మరోపక్క గిట్టుబాటు ధర రాక రైతులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో విదేశీ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతుల మెడకు ఉరితాడు వేసినట్లు అవుతుంది. 1970 వరకు పెద్ద ఎత్తున బియ్యాన్ని దిగుమతి చేసుకుంటే ప్రస్తుతం నూనెలు, పప్పులు, దిగుమతి చేసుకుంటున్నాం. నూనె గింజల సేద్యం విస్తీర్ణత, ఉత్పత్తి పెరగకపోవడం వల్ల మన దేశంలో వంట నూనెల కొరత ఏర్పడి దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశంలో అన్ని రకాల సాధారణ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించి, మేలు రకాల బియ్యం ఎగుమతి అనుమతించడంతో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశ ప్రయోజనాలకు అనుకూలమైన స్వంత వ్యవసాయ విధానాలు అమలుజరిపి, ఆహార పంటల్లో సమతుల్యత పాటించి వేలు రకం విత్తనాలతో కందులు, మినుములు, వేరుశెనగ, సన్ ఫ్లవర్ ఆయిల్, నువ్వుల పంటల విస్తీర్ణత పెంచి వాటటి దిగుబడులు పెరిగేలా చేసి స్వయం సమృద్ధిని సాధించినప్పుడే పప్పులు, నూనెల ధరలు తగ్గుముఖం పడతాయి.

ప్రధానంగా మన దేశంలో వ్యవసాయాభివృద్ధి రేటు గణనీయంగా పడిపోతోంది. నిర్దేశిత లక్ష్యాల సాధనలో ప్రతి సంవత్సరం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. మద్దతు ధరలు స్వల్పంగా పెంచినప్పటికీ ధాన్యం కొనుగోలులో భరోసా లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న జనాభాకు సరిపోయే పరిణామంలో ఆహార ధాన్యాలను పండించలేకపోవడం, దిగుమతులు పెరిగిపోవడం వంటి కారణాల వల్ల రైతులకు ప్రోత్సహం దక్కడం లేదు.

నాలుగైదు సంవత్సరాలుగా పరిశీలిస్తే ఆహార ధాన్యాల పెరుగుదల కేవలం 15 లక్షల టన్నులు మాత్రమే ఉంది. డిమాండ్కు సరిపడా ఉత్పత్తులు లేకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దీనితో విదేశీమారక నిల్వలు కోల్పోవాల్సి వస్తోంది. ముఖ్యంగా చిరు, తృణధాన్యాలు, పప్పులు, నూనెగింజల దిగుమతుల కారణంగా వ్యవసాయ రంగం ఆర్థికంగా నష్టపోతోంది. కనీస మద్దతు ప్రకటించి రైతులకు ప్రభుత్వాలు అండగా నిలిచి తగిన ప్రోత్సాహం ఇస్తే అద్భుతాలు సృష్టించడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు.

వరి వేస్తే ఉరి, వ్యవసాయం దండుగ వంటి పిలుపులను స్వయంగా ప్రభుత్వాలే చెప్పడం వల్ల రైతన్నలు మానసిక ఆందోళనకు గురౌతున్నారు. ముఖ్యంగా కాలం చెల్లిన రైతు విధానాలను రద్దు చేసి, నూతన జాతీయ ఆధునిక వ్యవసాయ విధానం అమలుచేస్తే అటు రైతులకు న్యాయం జరగడంతో పాటు ధరలు అదుపులోకి వస్తాయి. మరోపక్క దిగుమతులు తగ్గడం వల్ల విదేశీమారక నిల్వలను సమృద్ధిగా పెంచుకునే అవకాశం ఉంటుంది.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/fake-products-regulation-failure-india/sanghibavam/524201/

Agricultural Imports Crop Prices Farmers issues Food Security Garlic Crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.