📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telangana – Maharashtra Border : బదలీ వివాదాల్లో ‘గ్రామాలు’

Author Icon By Sudheer
Updated: July 21, 2025 • 10:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రజామోదయోగ్య నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలు ఎప్పుడు ఆపసోపాలు పడుతుంటాయి. ఒక్కోసారి అనవసర బేషజాలకు పోయి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజామోదయోగ్యం కాకపోవచ్చు. అయినా కొన్నిటిలో తలడూర్చి మంచి నిర్ణయాలు తీసుకునే విషయంలో ‘తప్పు’లో’ కాలు వేస్తుంటాయి. వాటిని పరిచేయడంలో ఎటూ తెగక ప్రజలకు తామేం చేయాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడ్తుం ది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి తీరని కష్టం వచ్చింది. ఒకపక్క రాష్ట్రాల పునర్విభజనలో తెలంగాణ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కు కలిపారు. వాటిపై ఇరు రాష్ట్రాలూ తమకే కావాలని పట్టుపడుతు న్నాయి. ఎవరివాదన వారికుంది. అలాగే భద్రాచల క్రీ. రామచంద్రుని ఆలయం, అక్కడి ప్రజలు ఖమ్మం జిల్లా లోనూ, వారి భూములు ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి. రాముడు అందరివాడు కనుక పెద్దగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. కానీ భద్రాచలం వాసుల భూములు ‘సమీప ఆంధ్రప్రదేశ్ కు మారిన గ్రామాల్లో ఉన్నప్పుడు. భూములకు సంబంధించిన సాగు ప్రణాళికలు, వ్యవ సాయ విధానం, సమగ్ర నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంచారు.

‘ప్రత్యేక చట్టం’ ద్వారా ఏపీలో

గోదావరికి వరదలొచ్చినప్పుడు వాటి నిర్వహణలో కూడా ఇరు ప్రభుత్వాలలో ఆంధ్రప్రదేశ్ ఇటీవలి వరదల్లో తెలంగాణ నుంచి తీసుకున్న గ్రామాల ఆవసరాల నిర్వహణ, బాధితులు సంరక్షణ’లో విపరీత మైన ఇబ్బందులేర్పడిన విషయం తెలిసిందే. ప్రకృతి బీభత్సాలను ఆపడం, రాకుండా నిరోధించడం మానవుని చేతిలో లేని విషయం కావున సమగ్ర యాజమాన్య నిర్వహణ ఒక్కటే మార్గం. ఈ పదేళ్లలోనూ ఆంధ్రప్రదేశ్ లో చేరిన తెలంగాణ గ్రామాల సమస్యలు ఎటూ తీర లేదు. పోలవరం ముంపు గ్రామాలు వాటి వాధ్యతల రీత్యా ఆయా గ్రామాలు తమకే కావా లని పోరాడి మరీ. ఆంధ్రప్రదేశ్ వాటిని ‘ప్రత్యేక చట్టం’ ద్వారా తనలో ఇమున్చుకుంది. అంతా జరిగాక అక్కడి వారి కాష యాస్, జీవన విధానం మాది కనుక వారి పర్యవేక్షణ మాకే కావాలి ఆయా గ్రామాలను మాకే కలిపే యండని ఇప్పటికీ తెలంగాణ వాదిస్తోంది. అడపాదడపా ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించింది కూడా. మరో. విషయంలో కూడా తెలంగాణ గ్రామవాసుల అవేదన. పట్టించుకోకుండా చాపకింద నీరులా ఆదిలాబాద్ ప్రాంతంలోని 14 గ్రామాలను సొంతం చేసుకోవాలన్న పూనికతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

మహారాష్ట్ర సీఎం ప్రకటనతో ఆందోళన బాట పట్టిన ఆయా గ్రామాల వారు

రేపోమాపో తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగమన్న తరుణంలో ఆదిలాబాద్ జిల్లాలోని 14 గ్రామాలు తమవేనంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటనతో ఆయా గ్రామాల వారు ఆందోళనబాటపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరు తమ గోడు విన్నవిం చుకున్నారు. తమ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతాయా లేక ‘జరుగుతున్న తంతు” రావణకాష్టంతా సాగుతుండా. అనే మీమాంస వారిలో ఏర్పడింది.

దశాబ్దాల క్రితం నమ సిపోయి తెలంగాణ ప్రభుత్వంతో మమేకమై సజావుగా జీవనం సాగిస్తున్న గ్రామీణులకు నిద్రపట్టడంలేదు. భౌగో ళికంగా కొన్ని సమస్యలుండొచ్చు, కానీ వాటి పరిష్కారం ప్రజలకు ఆమోదయోగ్యంగా జరగాలి, తప్ప ఆయా ప్రభు త్వాల సొంత నిర్ణయం కాకూడదు. సరిహద్దు రాష్ట్రాల మధ్య మిశ్రమ భాషల వాడకం ఉన్నట్లే. నీటి పంపిణీలు ఉంటాయి. వాటి వ్యత్యాసాల తీరుతెన్నులను క్రమబద్ధీక ఉంచుకోకుండా భూభాగాలను ఇటూ అటూ కలుపుకోవాల సుకోవడం సరైన పద్దతి కాదు. ఇవేదో రెండు రాష్ట్రాల వాదనతోనే కాదు అక్కడ ఉన్న ప్రజల ఆమోదంతో జర గాలి. ఇలాంటి సమస్యలను సున్నితంగా డీల్ చేయాలి. సంక్లిష్టం చేయరాదు.

భారతదేశంలో ఏ భూభాగాన్ని ఎటు కలపాలన్న రాష్ట్ర సరిహద్దులు మార్చాలన్నా స్థానిక ప్రభుత్వాల అభిప్రాయంతోపాలు జనాభిప్రాయం సమగ్ర సర్వే నివేదికలతో పార్లమెంటులో చర్చ జరగాలి. ఏరా భిప్రాయం రావాలి. గతంలో రాష్ట్రాల విభజనలన్నీ ఆ మేరకే జరిగాయి. ఇప్పుడైతే స్థానిక పాలకులు అవేమీ లేకుండా తమ సొంత అభిప్రాయాలను ప్రజలపై రుద్ది తమ అనుదిత ప్రసంగాల ద్వారా సమసును సంక్లిష్టం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. భౌగోళిక సరి హద్దులు మార్చాలనుకున్నప్పుడు తీసుకోదగిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందితే మొత్తం పాలనలోనే ఏలికలు వైఫల్యం చెందినట్లు. ఈ విషయాన్ని తెలుసుకో లేక ప్రజాబాహుళ్యంలో ప్రభుత్వాలు చులకన అయిపో తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని చంద్రపూర్ జీవతీ తహాశీల్లోని గ్రామాల బదిలీ అంశం ఈనాటిది కాదు. 1987 నాటిది. ఆయా గ్రామాల్లో ఇరు రాష్ట్రాలు వారి వారి పథకాలను అమలు చేస్తున్నాయి.

ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అంతకు ముందే కెకె. నాయుడు కమిటీ వేసినా ఫలితం లేకపోయింది. తాజాగా మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ భవాంకుకే ఆదిలాబాద్ జిల్లాలోని 14 గ్రామాలనూ తమ రాష్ట్రంలో కలుపుకునే విలీన ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించారు. చిత్రమే మిటంటే మహారాష్ట్ర రెవిన్యూ సరిహద్దుల్లో ఉందని ఆ రాష్ట్రం రోడ్లు, నీటి పథకాలు, పాఠశాలల నిర్వహణ చస్తుంటే విద్యుత్ సరఫరా చేస్తున్న తెలంగాన పాలనా పెత్తనం చేస్తోంది. ఒకపక్క ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య జలజగదాలతోనే సతమతమవుతున్న రాష్ట్రాలకు ‘గ్రామాల బదిలీ’ వివాణాలు కొత్త తలపోటు, వీటిని జనాంతికంగా కాకుండా జనాభిప్రాయ సేకరణతో సామరస్యంగా పరిష్కరించుకోవడం సర్వశుభప్రదం.

BJP Urges Action On Maha’s 14-Village Claim Google News in Telugu Maha Vs Telangana Over Border Villages Telangana - Maharashtra Border

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.