📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medical: పేదలకు అందని ప్రభుత్వ వైద్యం?

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 5:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీజన్ మారినప్పుడల్లా విజృంభిస్తున్న దోమలు వాటి వల్ల ప్రబలే రోగాలతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది విలవిల్లాడుతున్నారు. విషజ్వరాలు(Fever) ఏమీ కొత్తకాదు. వర్షాకాలం(Rain Season) ఆరంభంతో పాత నీరుపోయి, కొత్తనీరు రావడంతో రోగాలు విజృంభిస్తు న్నాయి. తెలుగు రాష్ట్రాలతో(Telugu States) సహా దేశంలోని అనేక ప్రాం తాల్లో ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ యేడాది ఇప్పటికే విషజ్వరాల బారినపడి బీదా, బిక్కి, ధనిక, అని తేడా లేకుండా అల్లాడిపోతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రభుత్వ దవాఖానాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈ వ్యాధులు సోకిన లక్ష్మిప్రసన్నుల సంగతి అలా ఉంచితే మధ్యతరగతి, మరీ ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడని రోజూ కూలీలు, చిన్నాచితక వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగించేవారి పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ఏనాడో కూకటివేళ్లతో పెకిలించామని చెప్పుకుంటున్న వ్యాధులు కూడా అక్కడక్కడ కన్పిస్తున్నాయి. పాతరోగాలు తిరిగి మొలకెత్తి విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమ స్యల్లో మలేరియా ఒకటిగా చెప్పొచ్చు. ఒకనాడు ఈ వ్యాధి సోకిందంటే ప్రాణాలు పోయినట్లేనని భయాందోళ నలు చెందేవారు. 1947లో దాదాపు ఏడు న్నర కోట్ల మందికి ఈ వ్యాధి సోకగా సుమారు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా మరణించారు. ప్రధానంగా జూన్, సెప్టెంబ రుల మధ్యనే ఈ వ్యాధి విస్తరించేది.

Medical: పేదలకు అందని ప్రభుత్వ వైద్యం?

జాతీయ వ్యూహాత్మక మలేరియా నిర్మూలన ప్రణాళిక

ఆనాటి నుంచే చేస్తున్న పరిశోధనలు, నూతన మందులు, చికిత్స విధానం లో మార్పుల ఫలితంగా తగ్గుముఖం పట్టాయనే చెప్పొ చ్చు. గత యేడాది రెండు లక్షల ఇరవై ఏడువేల మందికి ఈ వ్యాధి సోకగా మరణాలసంఖ్య కేవలం ఇరవైమూడు కు తగ్గించగలిగారు. కేంద్రప్రభుత్వం 2006లో ‘జాతీయ వ్యూహాత్మక మలేరియా నిర్మూలన ప్రణాళిక ద్వారా ఆ వ్యాధి వ్యాపిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టింది. ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రత్యేక చికిత్స విధానాన్ని చేపట్టి వ్యాధి ఒకరి నుంచి మరొకరికి రాకుండా అడ్డుకట్ట వేయగలిగారు. నగరాలు, పట్టణాల్లో కొంతవరకు నియంత్రించగలుగుతున్నా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనక రంగా ఉంది. జనాభాలో ఎనిమిది శాతానికిపైగా ఉన్న గిరిజనుల్లో మలేరియా బారినపడుతున్న వారి సంఖ్య సగానికి కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

అడవుల్లో, కొండ ప్రాంతాల్లో తేమ వాతావరణంతో దోమల వ్యాప్తి

మెదడులో వ్యాపించే ప్రమాదకర పాల్సీ పారం మలేరియా మృతుల్లో అరవైఐదు శాతానికి పైగా గిరిజనులే. అడవుల్లో, కొండ ప్రాంతాల్లో తేమ వాతావరణం దోమల వ్యాప్తికి కారణమవుతున్నది. ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న దోమల్లో ఇమ్యూనిటీ పెరగడంవల్ల వాడు తున్న మందులు వాటిని నియంత్రించలేకపోతున్నట్లు డాక్టర్లే అంగీకరిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా పారిశుధ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకుతిలో దకాలు ఇవ్వడం వల్లదోమలు పెద్దఎత్తున ఉత్పత్తికావడం, రకరకాల వ్యాధుల విస్తరణకు కారణమవుతున్నాయి. సిబ్బంది, నిధుల కొరతతోగ్రామీణ ప్రాంతాల్లో ప్రధానం గా ఏజెన్సీల్లో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయా రవుతున్నది. ఉన్న సిబ్బందిని కూడా ఆయా ప్రాంతాలకు పంపించి చికిత్స అందించడంలో పాలకులు విఫలమవు తున్నారనే చెప్పొచ్చు. భారత్ను మలేరియా రహితంగా మార్చాలనే లక్ష్యం నెరవేరాలంటే గ్రామీణరంగంలో వైద్యా న్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.

డెంగ్యూ వ్యాధి ఇంకా వదలిపెట్టడం లేదు

ప్రత్యేక నిధులను కేటాయించి పారి శుధ్యాన్ని మెరుగుపర్చాలి. ఇక కొత్తరోగాల గురించిప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డెంగ్యూ, చికెన్గున్యా, స్వైన్ఫ్లూ లాంటి వ్యాధులు విజృంభిస్తు న్నాయి. కొన్ని ప్రాంతాల్లో చికెన్గున్యా వ్యాధి గ్రామీణుల ను గడగడలాడిస్తున్నది. ఒకటి, రెండు రోజులు కాదు, నెలల తరబడి ఈ వ్యాధిసోకిన వారు మంచాన్ని వదల లేకపోతున్నారు. కొందరైతే రోజువారీ కాలకృత్యాలకు కూడా మరొకరి సహాయం లేకుండా చేసుకోలేకపోతున్నా రు. ఈ వ్యాధివల్ల ప్రాణం పోకపోవచ్చు కానీ ఈ వ్యాధి ఇతర వ్యాధులకు తోడైతే ప్రాణాపాయం కలుగవచ్చునని వైద్యనిపుణుల అభిప్రాయం. ఇక డెంగ్యూ వ్యాధి ఇంకా వదలిపెట్టడం లేదు. ఇప్పటికీ డెంగ్యూతో మరణించేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. అన్నింటికంటే ముఖ్యంగా రోగ నిర్ధారణ ఒక మిథ్యగా మారుతున్నది. మామూలు జ్వరం లేక, డెంగ్యూనా, మరేదన్ననా అనే విషయంకోసం పరీక్షలు చేయడంలోనే జాప్యం జరిగితే వ్యాధి ముదిరి ప్రాణాలకు ముప్పు తెస్తున్నది. ముఖ్యంగా వైద్యసహాయా నికి ఆమడదూరంలో ఉండే మారుమూల ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించు కోవచ్చు.

ఆరోగ్యాన్ని మెరుగుప రచడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటి

స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాల దాటినా నేటికీ కనీస ప్రాథమిక అవసరాలు తీర్చడంలో ప్రభుత్వా లు ఘోరంగా విఫలమ వుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యాన్ని మెరుగుప రచడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటి. ఆరోగ్యం అనేది ప్రజల ప్రాథమిక హక్కు. దాన్ని ప్రజలకు సమ కూర్చడంలో ప్రభుత్వాలు ఏమేరకు సఫలం అవుతున్నా యో చెప్పక్కర్లేదు. యేటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతూ ఎన్నో సంస్కరణలు చేస్తూ ప్రభుత్వ వైద్యరంగం పురోగమిస్తుందని చెప్పుకుంటుంటే కేవలం కొందరి నిర్వాహకం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం అంతకంత సన్నగిల్లుతున్నది. మొన్న కరోనా విజృంభణ సమయంలో దేశంలో వైద్యరంగం డొల్లతనం బయటపడింది. కనీసం ప్రాణవాయువు అందించలేకపోవడంతో ఎందరో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా పాలకులు ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలి .

Read hindi news: hindi.vaartha.com

Read Also: England: ఇంగ్లండ్‌కు ఐసీసీ బిగ్ షాక్‌..

#telugu News Government Hospitals Healthcare Access Healthcare Inequality Medical Services India Poor and Healthcare Public Healthcare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.