📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : Donald trump : ట్రంప్ జాతకం తలకిందులు!

Author Icon By Sudha
Updated: November 6, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాలో రాష్ట్రాల గవర్నర్ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ రిపబ్లికన్ అభ్యర్థులు కట్టకట్టుకొనిఓటమి పాలయ్యారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు గెలి చి విజయకేతనం ఎగురవేశారు. ఆనాడు ట్రంప్ శ్వేతసౌధంలో అడుగుపెట్టిన నాటి నుంచి తీసుకున్న నిర్ణయాలు చాలా సందర్భాల్లో ఎదురొచ్చాయి. చాలా నిర్ణయాలను అమెరికన్లే వ్యతిరేకించారు. కళ్లకు కనపడిన వారందరినీ హెచ్చరికలు చేసి భయభ్రాంతులను చేయడం, విచక్షణ లేని వాగాడంబరం ఆయన్ని పరాజయం అంచున నిలబెట్టింది. మంచి నిర్ణయాలు తీసుకున్నారని జనం భావిస్తే వాటికి తుది ఆమోదముద్రగా ముందున్న ఎన్నికల్లో ప్రజలు అభినందన పూర్వకంగా ఓట్లిచ్చి ఆయా పార్టీల అభ్యర్థులను ఆదరించేవారు. లేకంటే తిరస్కరించ డం మామూలే. గవర్నర్, మేయర్ ఎన్నికల్లోరిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్ బంధువు ఒకరు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. వివిధ రాష్ట్రాల్లో ట్రంప్ (Donald trump) వ్యతిరేకులపైనే జనం మొగ్గు చూపారని అర్థమౌతోంది. అమెరికా లో ఎన్నికల్లో ఎదురుపడేవి రెండే రెండు పార్టీలు. ఒకరు ఓడితే మరొకరు నెగ్గినట్లే. ఎప్పుడూ ఇవే అంచనాలు ప్రాతి పదికగా జనంలో అభిప్రాయాలు ఏర్పడుతాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం ట్రంప్ (Donald trump)పార్టీ అభ్యర్థులకు అపజయం తప్పదనే విషయం మీడియ ముందుగానే అంచనా వేసిం ది. అందుకే వీలుగానే విశ్లేషణలను వెలువరించింది. కాగా బ్యాలెట్ పేపర్లపై తన పేరు లేకపోవడం వల్లనే రిపబ్లికన్ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారని ట్రంప్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉంటాయో చెప్పలేకపోయినా వాటి పర్యవసానాలు ఏమి సూచిస్తున్నాయో విశ్లేషంచడం తేలిక. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై కక్షకార్పణ్యాలున్నట్లు ఈర్ష్యాసూయలతో ట్రంప్ వరుసగా ఒక పద్ధతి లేకుండా సుంకాలు విధిస్తూ లొంగి వచ్చిన వారికి సుంకాలు తగ్గిస్తూ, రాని వారికి రాలేని వారికి సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయా లు విమర్శలకు గురయ్యారు. ఏదో మిశ్రమ స్పందన అయి ఉంటే కొన్నిసీట్లేనా రిపబ్లికన్ పార్టీ గెలిచి ఉండేది. కానీ ఒక్కటంటే ఒక చోట కూడా గెలిచిన సందర్భం లేదు. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడి హోదాలో భారత దేశం మీద కాలుదువ్వడం అక్కడున్న భారతీయులెవరికీ రుచించలేదు. పైగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని ఆంక్షలు, ట్రేడ్ డీల్ కుదరకపోతే ఇక చూస్కో! అనే గంతులు భారతీయేతరులకు కూడా నచ్చ లేదు. కేవలం యేడాది పాలనలోనే ట్రంప్పై తీవ్ర వ్యతిరేకతలు ఉండబట్టే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు తగినన్ని ఓట్లు పడలేదు. ఒకసారి గెలిపించి అత్యున్నత స్థానానికి పంపిన వారు, తమకు, తమ మనుగడకు ఏమాత్రం ఇబ్బది అవుతోందన్నా వేచిచూసి అనంతర ఎన్నికల్లో ఓటర్లు చాచికొడతారన్న ఎన్నికలతత్త్వం ట్రంపుబోధపడినట్లు లేదు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో న్యూయార్క్ ఎన్ని కలలో భారీ ఓటింగ్ నమోదైంది. సుమారు రెండు మిలియన్లకుపైగా నగర ఓటర్లు తమ ఓటు హక్కును వినియో గించుకున్నారు. న్యూయార్క్ నగర తొలి ముస్లిం మేయర్గా భారతీయ మూలాలున్న జోహ్రాన్ హన్దానీ (34) చారిత్రక విజయం సాధించారు. ఆయన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మీరానాయర్ కుమారుడు. వామపక్ష అభిలాషలున్న వ్యక్తి. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్య వంటి భరోసా ఇవ్వడం వలనే గెలిచి ఉండొచ్చునని విశ్లేషకుల అంచనా. టారిఫ్లపై ఫెడరల్ చట్టాల్నిఉల్లంఘించారన్న ఆరోపణ లతో ట్రంప్ నిర్ణయాలపైదాదాపు 50 కేసులు నమోద య్యాయి. పైగా షట్టా డౌన్ కూడా ట్రంప్ అనుకూల అభ్య ర్థుల ఓటమికి కారణం. ఈ విషయాన్ని ట్రంప్ కూడా అంగీకరించారు. నిజానికి అమెరికా చట్టసభ సభ్యులు మధ్య కీలక బిల్లులపై సయోధ్య కుదరకపోవడంతో 36 రోజులుగా ‘షటౌన్’ కొనసాగుతోంది. ఇదికూడా అమెరికా రాజకీయాల్లోనేకాదు ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇలాంటి షట్టెడౌన్ కారణంగా అమెరికా వ్యవస్థ బలహీ నమైందనే ఆరోపణలు ప్రజల్నించి వినవస్తున్నాయి. గతం లో ట్రంప్ రాజ్యమేలినప్పుడు కూడా 35 రోజుల పాటు సుదీర్ఘ షట్ డౌన్ కన్నా ఈసారి మరికొన్ని రోజులు కొన సాగే అవకాశాలు కనపడుతున్నాయి. రేపెపుడో ట్రంప్ దిగివచ్చినా జరిగిన నష్టాన్ని కూడగట్టడం సాధ్యం కాదు. ఇంతవరకు
జరిగిన షట్లెడౌన్ కాలంలో 90వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం జరిగిందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు లెక్క తేల్చింది. హైదరాబాద్ మూలాలున్న భారతీయ సంతతి నేత గజాలా హష్మీ వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. అమెరికాలో షట్ డౌన్ కారణంగా ఆహార సంక్షోభం తలెత్తింది. ఫెడరల్ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సహాయం అందడం లేదు. ఇంత జరుగుతున్నా ట్రంప్ కిమ్మన్నాస్తిగా ఉండి పోయారు. ప్రధానంగా వాణిజ్య రాజధానిగా చెప్పబడే న్యూయార్పై తీవ్ర ప్రభావం పడడంతో ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీగా ప్రకటించుకుంది. అమెరికాలో కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇలాంటి ఆహార సంక్షోభాన్ని పరిష్కరించా ల్సిన బాధ్యత ట్రంప్డే. కానీ ఆయనలో చిత్తశుద్ధి లేకనే రోజుల తరబడి ఆహార సదుపాయాలు నిలిచిపోయినా జోక్యం చేసుకోవడం లేదని విపక్షాలు తమ ఎన్నికల ప్రచార ప్రస్తావనలతో ప్రజల్ని ఆకట్టుకోగల గడమే ట్రంప్ అభ్యర్థులకు
ఓటమి తెచ్చిపెట్టాయి. అంత ర్గత సమస్యలు పరిష్కరించుకునే తరుణంలో ఇతర దేశాల కింద కయ్యానికి కాలు దువ్వుతున్న ట్రంపు ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠం కాగలదు. విజ్ఞతతో వ్యవహరిస్తే ఆయనకే మేలు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Astrology Breaking News Donald Trump horoscope latest news Telugu News Trump news US Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.