ఎన్నికలు ఎప్పుడైనా వాటి పర్యవసానాలు ఎలా వున్నా పోలింగ్ నాటికి ముందు ఆరేడునెలలు అధికార పార్టీ టక్కుటమార గోకర్ణ విద్యలు, విన్యాసాలూ సర్వసాధారణం. ఉన్నట్టుండి ప్రజా ప్రయోజనాల మీద ప్రేమ పుట్టుకురావడం చాలా విచి త్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు బీహార్ లో అదే తంతు జరు గుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటి ప్రత్యామ్నాయ ప్రయోజనాలను ‘ఎర’ వేస్తూనే ఉంటారు. ఇంతవరకు కనిపించని ప్రయోజనాలను ఇకపై అధికార పార్టీ కల్పిస్తుందంటే ప్రజల్లో ఒక విధమైన అను మానాలు రాకపోవు. కానీ ఎవరి ప్రయత్నాలు వారుచేస్తుం టారు. నిజానికి ఉచితాలను ఉచితానుచితాలు మరచిపో యి ప్రకటించేస్తుండడం రాజకీయ పార్టీల వంతు. వాటి సాధ్యాసాధ్యాల సంగతి దేవుడెరుగు. ఎవరు ఎలాంటి ప్రయోజనం కల్పించినా స్వాగతించాల్సిందే. జనం కోసం కొండమీద కోతిని తీసుకురాలేం. అయినా ఏమో గుర్రం ఎగురావచ్చు! అనే ధోరణిలో ప్రజాహృదయాలను చూర గొనే క్రమంలో ఎలాంటి వాగ్దానాలనైనా చేయడానికి ముందుకు వస్తున్నారు.
మేనిఫెస్టోలను తప్పని సరిగా అమలు చేయాలన్న చట్టమేదీ లేదు
గతంలో మేనిఫెస్టోలో చెప్పిన అంశాలకు పవిత్రత ఉండేది. చెప్పిన విషయాలకు చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలన్న నిబద్ధత ఉండేది. ఇప్పుడా నిబద్ధత ఏదీ లేదు. ఏ పార్టీకి ఆపార్టీ వారికి నోటికొచ్చిన హామీలిచ్చేయడం, ఆ తదుపరి వాటిని గాలికి వదిలేయడం మామూలైపోయింది. మేనిఫెస్టోలను తప్పని సరిగా అమలు చేయాలన్న చట్టమేదీ లేనందున ఎన్నికల ప్రణాళిక గురించి పెద్దపట్టింపేమీ ఉండదు. విచక్షణ ఉండ దు. సాధ్యాసాధ్యాల పరిశీలన ఉండదు. చేస్తే చేసినట్లు, చేయకుంటే చేయనట్లు. ఈ మధ్యకాలంలో మేనిఫెస్టోలు తయారు చేసేలోగానే ఎన్నికల ర్యాలీల్లోనే ‘వరాల జల్లు’ కురిపించేస్తున్నారు. బీహార్లో ప్రధాని నరేంద్రమోడీ(Narendra Modi) శుక్రవారం ప్రజల్నికలిసేందుకు వచ్చారు. రోడ్డుకిరువైపులా ఉన్న జనాన్ని పలుకరించారు. వారిచ్చిన శుభస్వాగతానికి బదులుగా వారిపై అభినందనల వర్షం కురిపించారు. వస్తూ వస్తూనే బీహార్ పర్యటనలో ప్రధాని మోతీహార్ రూ.7200 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. నాలుగు అమృత్ భారత్ రైళ్లను బీహార్ రాష్ట్ర ప్రయాణి కుల సౌకర్యార్థం నడపనున్నట్లు ప్రకటించారు. పాట్నాలో ఎసిపిఐ అత్యాధునిక ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దర్భాంగాలో న్యూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల రీత్యా బీహార్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు భారీ ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయని ఈ బీహార్ సమాచారం వెల్లడిస్తోంది. ఓటర్లను ఆకట్టుకో వడం ఒక ఎత్తయితే చేతికందని ఓటర్ల ఓట్లను ఏదో ఓ సాకుతో రద్దు చేసే ప్రక్రియ మరొకటి. ‘ఎలక్షన్ ఆర్ ఎలి
మినేషన్’ విధానాన్ని ఈమధ్యకాలంలో ఎన్నో రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఇప్పుడు బీహార్ అదేబాటలో వెళ్తాం దని తాజాగా ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తేటతెల్లం చేస్తున్నాయి. దాని మీద నిరసనలు వ్యక్తమవడం ఉన్నత స్థాయి ధర్మాసనాలు జోక్యం చేసుకున్నాయికూడా. ఓటర్ల ను భయపెట్టి వారిలో నిరుత్సాహం కలుగచేసేప్రయత్నా లకు కోర్టులు అడ్డుపడ్డాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో రాజకీయ పార్టీలన్నీ అందెవేసిన చెయ్యే. అధికారంలో ఉన్న వాటికి ఇలాంటి పథకాల రూపకల్పన కాస్తవీలు.
వరాల జల్లు కురిపించిన. మోడీ నితీష్కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్,(Nitish Kumar) ప్రధాని బీహార్ వచ్చేలోపలనే కొంతమేరకు వరాల జల్లు కురిపిం చారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు 125 యూనిట్లు వాడకం వరకు ఉచితమని ప్రకటించారు. అక్టోబరులో కానీ నవంబరులో కానీ బీహార్ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఆగస్టు 1 నుంచి ‘చౌకధరకే విద్యుత్ పథకం కింద విద్యుత్తు, ఫ్రీ, గృహవినియోగదారులు 125 యూనిట్ల వరకు ఎలాంటి బిల్లు చెల్లించనవసరం లేదు. ఆ రాష్ట్రంలోని 1కోటి 67లక్షల కుటుంబాలకు ఈ ప్రయో జనం కలుగుతుంది. సౌరగృహ విద్యుత్తు కూడా ఉచితం గా ఇంటి పైకప్పుల మీద ఏర్పాటు చేస్తారు. కుటీర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా ప్లాన్ ఉంటుం దని వాటిలో ప్రత్యేకించి మహిళలకు 35 శాతం నియామ కాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 10 మిలియన్ ఉద్యోగాల హామీ, వృద్ధులకు 400 నుంచి 1100 వరకు పెన్షన్ పెంపు, విద్యార్థులకు 4 వేల నుంచి 6వేలవరకు నగదు ప్రోత్సాహకాలు ఇంతవరకు నితీష్ ప్రభుత్వం ఇవ్వగల కానుకలు. దేశవ్యాప్తంగా పేదరికం తగ్గిందని అంచనాలు వేసుకుంటున్న తరుణంలో బీహార్ పేదరికం రేటు బాగా తగ్గినట్లు నీతి ఆయోగ్ 2023నివేదిక చెబుతోంది. గ్రామీ ణప్రాంతాల్లో పేదరికం లెక్కలు పరిశీలిస్తే 56 శాతం నుంచి 36.95 శాతానికి తగ్గింది. మొత్తానికి బీహార్లో 2.25 కోట్లమంది ప్రజానీకం పేదరికం నుంచి బయటకు వచ్చేసినట్లు. వారి జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయని అంచనా. బహుముఖ పేదరికమున్న రాష్ట్రాలలో బిహార్, జార్ఖండ్ ప్రధానం. వీటిలో తక్కువ తలసరి ఆదాయం, మౌలిక సదుపాయాలలోటు సామాజిక సవాళ్లు ఇప్పటికే ఎదుర్కొంటున్న అత్యంత పేద రాష్ట్రం బీహారే. ఇది అతి తక్కువ పారిశ్రామికీకరణ, ఎక్కువస్థాయిలో నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రం బీహార్. పార్టీలు ప్రకటించే పథకాలు పేదరికాన్ని ఏమాత్రం తగ్గిస్తాయో ఎంతవరకు మేలు చేస్తాయో తెలియదు కానీ రేపొచ్చే ఎన్నికలు ఎన్డీయే ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తాయో! లేదో రాజకీయ ఔత్సాహికులకెవరికైనా దారిస్తాయో తేలుస్తాయి.
Read also:hindi.vaartha.com
Read also: Ragging : ‘ర్యాగింగ్’ రాక్షస క్రీడను నిరోధించలేమా?