📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Vijayanand Movie: విజయానంద్ (ఆహా) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: August 13, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆ మధ్య కాలంలో బయోపిక్‌లు తెలుగుదర్శకుల, ప్రేక్షకుల మన్నన పొందిన జానర్‌గా మారాయి. సినిమా పరిశ్రమ, క్రీడా రంగం, రాజకీయ రంగం తదితర ప్రముఖ వ్యక్తుల జీవితాలు బయోపిక్‌లుగా రూపొందించడం ద్వారా ప్రేక్షకులలోని ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ తరహా బయోపిక్‌ల ద్వారా కేవలం ఒక వ్యక్తి కృత్యాలే కాకుండా, వారి వ్యక్తిత్వం, ప్రయత్నాలు, ఆలోచనలు, సామాజిక దృష్టికోణం, సమస్యలతో తుదిగీడుగా ఎలా వ్యవహరించినారో కూడా చూపించడం జరుగుతోంది.ఇలాంటి బయోపిక్‌లలో ‘విజయానంద్’ (Vijayanand) ప్రత్యేక స్థానం కలిగింది. ఇది కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త ‘విజయ్ సంకేశ్వర్’ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించబడిన సినిమా. విజయ్ సంకేశ్వర్ వ్యాపార రంగంలో తన కృషి, ధైర్యం, విజయం సాధించిన విధానం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లన్నీ ఈ చిత్రంలో ప్రతిబింబించబడ్డాయి. ఆయన వర్గీయ, సామాజిక, వ్యాపార కృషులు, బలమైన నాయకత్వ లక్షణాలు, కష్టసాధ్యమైన పరిస్థితులలోను ధైర్యంగా ఎదుర్కోవడం వంటి అంశాలు ప్రేక్షకులకు ప్రేరణగా నిలుస్తాయి.ఈ సినిమా, డిసెంబర్ 9 వ తేదీన 2022లో విడుదలైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ

విజయ్ సంకేశ్వర్ ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. ‘గదగ్’లో ఆయన తండ్రి ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. ముంబై నుంచి కొత్త మెషిన్ కొనుక్కొచ్చిన విజయ్ సంకేశ్వర్, సాధ్యమైనంత త్వరగా ముద్రణ కొనసాగేలా చేస్తాడు. తన తెలివితేటలతో పెద్దమొత్తంలో ఆర్డర్లు వచ్చేలా చేస్తాడు. స్కూటర్ .. ఆ తరువాత కారులో తిరిగే స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలోనే ‘లలిత’తో ఆయన వివాహం జరుగుతుంది.కుటుంబ సభ్యులంతా ప్రింటింగ్ ప్రెస్ పైనే ఆధారపడటం మంచిది కాదని భావించిన విజయ్ సంకేశ్వర్ (Vijay Sankeshwar), తాను ట్రాన్స్ పోర్టు బిజినెస్ మొదలుపెట్టాలని అనుకుంటాడు. అనుభవం లేని పనులు మొదలుపెట్టొదని తండ్రి వారిస్తాడు. ముందుకు వెళుతూ ఉంటే అనుభవం అదే వస్తుంది అన్నట్టుగా ఆయన ఒక లారీని కొనుగోలు చేస్తాడు. ‘గదగ్’ మార్కెట్లో తన లారీని పెడతాడు. అయితే ఆ మార్కెట్ కి సంబంధించిన రవాణా అంతా కూడా జీ ఎమ్ బ్రదర్స్ కనుసన్నలలో నడుస్తూ ఉంటుంది. 

Vijayanand Movie

విశ్లేషణ

ఇక అదే మార్కెట్ లో రమాకాంత్ పాటిల్ లారీలు కూడా నడుస్తూ ఉంటాయి. జీఎమ్ బ్రదర్స్ కీ .. రమాకాంత్ పాటిల్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే కొత్తగా విజయ్ సంకేశ్వర్ కూడా అదే బిజినెస్ లోకి దిగడంతో .. మార్కెట్ లో తన లారీని పెట్టడంతో వాళ్లిద్దరూ ఒకటవుతారు. విజయ్ సంకేశ్వర్ ను దెబ్బతీయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఎలాంటి ప్లాన్ చేస్తారు? వాళ్లను విజయ్ సంకేశ్వర్ ఎలా ఎదుర్కొంటాడు? అనేది కథ.  జీవితంలో నీతిగా నిలబడటం .. నిజాయితీతో ఎదగడం చాలా కష్టమైన విషయం. వ్యాపారంలో నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండటం మరింత కష్టం. ఏ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించినా అక్కడివారికి అది పోటీ అవుతూనే ఉంటుంది. అక్కడి నుంచి శత్రువులు పుట్టుకురావడం మొదలవుతుంది. అలాంటి వాళ్లను ఎదిరిస్తూ ముందుకు వెళ్లడానికి ధైర్యం కావాలి .. వాళ్లు సృష్టించే సుడిగుండాలను దాటుతూ వెళ్లడానికి మనో నిబ్బరం కావాలి. అలాంటి అంశాలను ప్రధానంగా చేసుకునే ఈ కథ ముందుకు వెళుతుంది.    

విజయానంద్ సినిమా నిజమైన జీవితకథా కథపై తెరకెక్కిందా?

అవును. విజయానంద్ సినిమా భారతీయ వ్యాపారవేత్త విజయ్ సంకేశ్వర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాను ఆయన వారసుడు ఆనంద్ సంకేశ్వర్ నిర్మించారు.

విజయానంద్ సినిమా చూడదగ్గదా?

ఖచ్చితంగా. ఇది ఒక ప్రేరణాత్మక సినిమా.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/super-man-ott-superman-streaming-anytime/cinema/529863/

2022 movie release Anand Sankeshwar biography film biopic movies Breaking News Kannada Cinema latest news streaming on Aha Telugu News Vijay Anand Vijay Sankeshwar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.