The Conjuring Last Rites Movie Review : హాలీవుడ్‌కి చెందిన హారర్ ఫ్రాంచైజ్ ది కాంజ్యూరింగ్ చివరి భాగం “లాస్ట్ రైట్స్” సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్‌కు ముందే భారత్‌లో 3.5 లక్షల టిక్కెట్లు అమ్ముడవడం ద్వారా రికార్డ్ సృష్టించింది. (The Conjuring Last Rites Movie Review) విడుదలైన రోజు ఈ సినిమా ₹15 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా, మొదటి షోలు వరకూ ₹4.2 కోట్లు వసూలు చేసింది.
అయితే, సోషల్ మీడియాలో ప్రేక్షకులు మిశ్రమ స్పందన ఇస్తున్నారు. కొంతమంది నటీనటుల ప్రదర్శన బాగుందని అంటుంటే, మరికొందరు మాత్రం ఈ సినిమా అసలు ఫ్రాంచైజ్‌కు సరైన ముగింపు కాదని చెబుతున్నారు. ఒక యూజర్ అభిప్రాయం ప్రకారం, “లాస్ట్ రైట్స్ పూర్తిగా నిరాశ పరిచింది. కొత్తదనం లేదు, థ్రిల్ లేదు. ఫ్రాంచైజ్‌లోనే చెత్త సినిమా ఇది.” అని పేర్కొన్నాడు. మరొకరు “ఈ సినిమాలో అసలు డెమన్ కథే. ఈ కథకే ఎక్సార్సిజం అవసరం. బలహీనమైన ఎండింగ్ ఇచ్చారు.” అని ట్వీట్ చేశారు.
న్యూయార్క్ టైమ్స్ క్రిటిక్ బియాట్రిస్ లోయాజా అభిప్రాయం ప్రకారం, “ఈ సినిమా హారర్ లా కాకుండా ఫ్యామిలీ డ్రామా లా ఉంది. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఎండింగ్ ఇవ్వలేకపోయింది.” అని అన్నారు.
అయితే, పాజిటివ్ రివ్యూలు కూడా ఉన్నాయి. ఒక యూజర్ రాసినది: “ది కాంజ్యూరింగ్ 2 లాంటి స్కేరీ ఫీల్ రాలేదు కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్‌కి నచ్చుతాయి.” అని పేర్కొన్నారు. డైలీ మెయిల్ క్రిటిక్ టిమ్ రాబే కూడా “ఫ్రాంచైజ్ స్టైల్‌లోనే బాగా ముగించారని, కొన్ని చిల్లింగ్ టచ్‌లు ఆకట్టుకున్నాయి.” అని రాశారు.
ఈ సినిమాను మైఖేల్ ఛావెస్ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్యాట్రిక్ విల్సన్, వీరా ఫార్మిగా, ఎలియట్ కోవాన్, బెన్ హార్డీ, బియూ గాడ్స్డన్, జాన్ బ్రోతర్టన్, మియా టామ్‌లిన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Read also :