📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ

Author Icon By Aanusha
Updated: October 2, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంతార సినిమాతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ పాన్ ఇండియానే తనవైపు చూసేలా చేశారు రిషబ్ శెట్టి (Rishab Shetty) . ఎలాంటి అంచనాలు లేకుండా 2022లో విడుదలైన కాంతార అటు కలెక్షన్లలోనూ, ఇటు క్రిటిక్స్ ప్రశంసల్లోనూ రికార్డులు సృష్టించింది. ఆ సినిమా రిషబ్ శెట్టి కెరీర్‌ను మలుపుతిప్పింది. అటు నేషనల్ లెవెల్‌లోనూ,

nayanika: అల్లు శిరీశ్ నయనికతో నిశ్చితార్ధానికి మూహూర్తం ఖరారు

ఇటు అంతర్జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులు దక్కాయి. అలాంటి విజయం తరువాత రిషబ్ తనపై మరింత నమ్మకాన్ని పెంచుకుని కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1)అనే ప్రీక్వెల్‌ను రూపొందించాడు. ఈసారి మాత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ స్టాండర్డ్స్,తో సినిమాని తెరకెక్కించాడు. మరి ఈ సినిమా నిజంగా కాంతార రేంజ్‌లో ఉందా? చూద్దాం.

కథ

మా నాన్న ఇక్కడే మాయమయ్యాడు.. అసలు ఇక్కడేముంది అంటూ హీరో అడిగే ప్రశ్నతో కాంతార సినిమా ఎండ్ అవుతుంది. ఇక కాంతార చాప్టర్ 1 (Kantara Chapter 1) అదే ప్రశ్నతో మొదలవుతుంది. ఆ కుర్రాడికి ఓ పెద్దాయన చెప్పిన కాంతార కథే ఈ సినిమా. “ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో.. అప్పుడు ధర్మాన్ని కాపాడటానికి ఆ ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు.

ఈ గణాలన్నీ వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలోనే” అంటూ దట్టమైన అడవిలో ఉన్న కాంతార రహస్యాలు చెబుతూ సినిమా మొదలవుతుంది.సాక్షాత్ పరమేశ్వరుడు కాంతారలో వెలిశాడని.. తన భర్త ధ్యానం చేసుకునేందుకు అక్కడే పార్వతి దేవి ‘శివుని పూతోట’ అంటూ ఓ ప్రాంతాన్ని సృష్టించిందంటూ అక్కడి ప్రజలు నమ్ముతారు.

కథనం

అయితే అక్కడ కాంతారవాసులకి ఒకరోజు నీటిలో ఒక రాయి (శివలింగం ఆకారంలో) దొరుకుతుంది. దీంతో దాన్నే దేవుడిగా భావించి ఆరాధించుకుంటారు. అయితే అప్పటికే చుట్టూ ఉన్న రాజ్యాలన్నీ గెలుచుకొని బాంగ్రా మహారాజు మహాగర్వంతో విర్రవీగుతూ ఉంటాడు.ఒక రోజు అనుకోకుండా అడవిలో ఉన్న కాంతారకి వచ్చిన బాంగ్రా మహారాజుని ఓ అదృశ్య శక్తి చంపేస్తుంది.

Kantara Chapter 1

ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొని తన రాజ్యానికి చేరుకుంటాడు మహారాజు కొడుకు (జయరామ్). కానీ తన కళ్ల ముందే తన నాన్నని చంపేసిన ఆ శక్తిని తలచుకొని ప్రతిరోజూ భయపడుతూనే ఉంటాడు. తనకి పుట్టిన ఇద్దరి పిల్లలకి రోజూ కాంతార గురించి కథలు కథలుగా చెబుతుంటాడు. ఏమైనా సరే కాంతారకి మాత్రం వెళ్లొద్దు.. అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని చెబుతుంటాడు.

విశ్లేషణ

కొన్నాళ్లకి తన కొడుకు కులశేఖర (గుల్షన్ దేవయ్య)కి మహారాజ పట్టాభిషేకం (Coronation of the Maharaja) చేసి మురిసిపోతాడు రాజు. కానీ కులశేఖరకి లేని అలవాటు ఉండదు. చిన్నప్పటి నుంచి కాంతార గురించి తన నాన్న చెప్పినవన్నీ కట్టుకథలే అంటూ తన స్నేహితుల్ని, భటుల్ని తీసుకొని కాంతారకి వేటకి వెళ్తాడు. హద్దులు దాటి తమ ప్రదేశానికి వచ్చిన వీళ్లని కాంతార వాసులు తరిమికొడతారు.

కొన్నేళ్ల క్రితం కాంతార వాసులకి అక్కడే ఉన్న ఒక లోయలో పులి పక్కనే ఓ పసిబిడ్డ దొరుకుతాడు. వాడికి బర్మే (రిషబ్ శెట్టి) అని పేరు పెట్టి పెంచుతారు. కాంతారకి తనే నాయుకుడు అవుతాడు.ఇక తమ ప్రదేశానికి వచ్చిన బాంగ్రా రాజుకి సరైన గుణపాఠం చెప్పాలని బర్మే తన స్నేహితులతో కలిసి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు.

అక్కడ ఓ ప్రమాదం నుంచి యువరాణి కనకావతి (రుక్మిణి వసంత్)‌ని కాపాడతాడు. తర్వాత ఆమె బర్మేపై మనసు పారేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు కులశేఖర మొత్తం కాంతారనే తగలబెట్టేస్తాడు. మరి అప్పుడు ఏం జరిగింది? కాంతారని ఎవరు కాపాడారు? అసలు బర్మే ఎవరు? బాంగ్రా రాజ్యంతో కాంతార ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? అసలు కనకావతి ఎవరు అనేదే మిగిలిన కథ.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Kantara Chapter 1 Movie Talk Kantara Chapter 1 Review Kantara Rishab Shetty Kantara Telugu Review latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.