Revanth Reddy.. Secret agreement with Modi.. Jagadishwar Reddy

రేవంత్ రెడ్డి.. మోడీతో రహస్య ఒప్పందం : జగదీశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌: రేవంత్ పక్కా మోడీ మనిషే అంటూ కీలక ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..మోడీని కలసి వచ్చాక.. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ మెదలు పెట్టారని తెలిపారు. రేవంత్ రెడ్డి.. మోడీ ఏజంట్ గా మాట్లాడుతున్నారు. రేవంత్ పక్కా మోడీ మనిషే అంటూ బాంబ్‌ పేల్చారు. మోడీని కలసొచ్చాక కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై రేవంత్ దాడి తీవ్రతరం చేశాడని చురలకు అంటించారు.

Advertisements
image

మోడీ భజన చేస్తూ..

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పంచాయితీ మోడీ ఏ టీం, మోడీ బీ టీం మాదిరి ఉందన్నారు. రేవంత్ రెడ్డి మోడీతో రహస్య ఒప్పందం చేసుకుని వచ్చాడని వెల్లడించారు. రాహుల్ గాంధీకి అర్థం అవుతుందో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. మోడీ తెలంగాణకు నిధులు ఇస్తానంటే కిషన్ రెడ్డి ఆపితే ఆగుతదా ? మోడీ భజన చేస్తూ.. రేవంత్ బహిరంగంగా దొరికిపోతున్నాడన్నారు. పదవి, ఆస్తులు కాపాడుకోవటానికే రేవంత్ మోడీ భజన చేస్తున్నాడని ఆగ్రహించారు. హరీష్ రావుపై సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు.

పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా?

కాగా, పదేళ్లుగా పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు ఎండబెట్టారని బీఆర్ఎస్ నేతలను రేవంత్ ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్లే కుప్పకూలిందని రేవంత్ ఆరోపించారు. పాలమూరు రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేరా? అని కేటీఆర్, హరీశ్ రావు, కవితపై మండిపడ్డారు. మామునూరు ఎయిర్ పోర్ట్ ప్రధాని మోడీ ఇచ్చారు.. నేనే తెచ్చానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మెట్రో రాలేదు.. మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు.. ఆపింది మోడీనేనా అని రేవంత్ ప్రశ్నించారు.

Related Posts
గోదావరి, కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
గోదావరి, కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు

గోదావరి, కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నాయి. ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా హాజరవుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ Read more

KTR : కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు:కుమార్ గౌడ్
KTR కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు కుమార్ గౌడ్

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన ఆరోపణలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ Read more

పుప్పాలగూడలో అగ్నిప్రమాదం : ముగ్గురు మృతి
Fire in Puppalguda.. Three killed

దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాలగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు Read more

మహిళపై చిరుత దాడి
Leopard attack on woman

ఆదిలాబాద్‌ జిల్లాలో చిరుతపులి భయం వీడడం లేదు. తాజాగా బజార్హాత్నూర్ మండలంలో చిరుతపులి దాడి జరిగింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె ముఖానికి తీవ్ర Read more

Advertisements
×