ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ కొత్త ఫార్ములా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ కొత్త ఫార్ములా

తెలంగాణలో కొత్తగా ఐదుగురికి ఎమ్మెల్సీగా అవకాశం లభించనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేయగా, కాంగ్రెస్‌కు నాలుగు స్థానాలు, బీఆర్ఎస్‌కు ఒక స్థానం దక్కనున్నట్లు స్పష్టమైంది. అయితే, ఈ నాలుగు స్థానాల కేటాయింపుపై కాంగ్రెస్‌లో సీరియస్ చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. మిత్రపక్షమైన సీపీఐకు ఒక స్థానాన్ని కేటాయించాలని నిర్ణయించగా, ఎంఐఎం పార్టీకి సీటు ఇచ్చే అంశం కూడా తెరమీదకు వచ్చింది.

కేటాయింపులపై స్పష్టత

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాంగ్రెస్‌కు లభించిన నాలుగు స్థానాలలో ఒక సీటును సీపీఐకి ఒక ఎమ్మెల్సీ పైన కాంగ్రెస్ నాయకత్వం హామీ ఇచ్చింది. ఈ విషయం పైన పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం అభ్యర్థుల ఎంపిక సామాజిక సమీకరణాలను బట్టి జరగనుంది.కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కే జాబితా పైన ఒక స్పష్టత వస్తోంది.

రెడ్డి వర్గం

రెడ్డి సామాజిక వర్గం నుంచి జగ్గారెడ్డి, హరి వర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.అవకాశం లేకుంటే రాజ్యసభకు పరిశీలన చేసే అవకాశం కనిపిస్తోంది.మిడిల్ బ్యాక్‌వర్డ్ కమ్యూనిటీస్ఎంబీసీల నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, చరణ్‌ కౌశిక్‌ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అదే విధంగా పార్టీ సంస్థాగత కోటాలో కుమార్‌రావు, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌ పేర్లను పరిశీలిస్తున్ నట్లు సమాచారం.

113650542

ఎస్సీ సామాజికవర్గం

ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఒకరికి ఎమ్మెల్సీ సీటు ఖాయంగా లభించనుంది. అయితే, ఈ సీటు మాదిగ వర్గానికి కేటాయించాలా, మాల వర్గానికి ఇచ్చాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌కు సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా ఉన్నట్లు సమాచారం. అదే విధంగా, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాదిగ వర్గం నుంచి కీలక రేసులో ఉన్నారు.

మహిళా కోటా

మహిళా కోటాలో పారిజాత నర్సింహారెడ్డి, బాణోతు విజయాబాయి లాంటి నేతలు ఎంపిక కోసం పోటీ పడుతున్నారు. పార్టీలో నూతన ఇన్‌చార్జ్‌గా నియమితులైన మీనాక్షి నటరాజన్‌తో చర్చించిన అనంతరం తుది జాబితాను ఏఐసీసీకి పంపనున్నారు.

నల్లగొండ- వరంగల్‌- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 25,797 మంది ఓటర్లు.ఈ నియోజకవర్గం 12 జిల్లాల్లోని 191 మండలాల్లో విస్తరించగా మొత్తం 200 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఓటింగ్‌ నేపథ్యంలో అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు ఎన్నికల కోసం మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, బీఎస్పీ అఽభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి సర్దార్‌ రవీందర్‌సింగ్‌ సహా 56 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం చివరి నిమిషం వరకు హోరా హోరీగా ప్రచారం కొనసాగింది.

Related Posts
తెలంగాణ కోసం చస్తాం కాంగ్రెస్‌కు తలవంచం: కేటీఆర్
తెలంగాణ కోసం చస్తాం కాంగ్రెస్‌కు తలవంచం: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గురువారం మరోసారి తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చారు. ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాని వైఫల్యాలకు ప్రశ్నించడం కొనసాగిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చీఫ్ Read more

నాన్న తప్పూ చేయలేదు.. శ్రవణ్ కూతురు
నాన్న తప్పు చేయలేదు.. – ప్రణయ్ హత్య కేసులో శ్రవణ్ కుమార్తె ఆవేదన

2018 సంవత్సరం సెప్టెంబర్ 14న తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. కోర్టు ఏ2 Read more

పీఎం కిసాన్ నిధులు విడుదల
Release of PM Kisan funds

పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులు విడుదల అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, Read more

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాలను ప్రారంభించింది. ఇవి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త Read more