రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి మరింత విషమం..

రతన్ టాటా (86) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్‌లో.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రక్తపోటు తగ్గడంతో రతన్‌ను హాస్పిటల్‌లో చేర్చగా.. ప్రస్తుతం రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 1991లో భారత అతిపెద్ద సంస్థలలో ఒకటైన టాటా సన్స్‌కు రతన్ టాటా చైర్మన్ అయ్యారు. 2012 వరకు టాటా గ్రూపుకు ఆయనే నాయకత్వ బాధ్యతలు వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు.

ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన టాటా కంపెనీకి చైర్మన్ గా పనిచేశారు. 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ కు చైర్మన్ గా కొనసాగారు. ఆయన హయాంలో టాటా కంపెనీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేశాడు. అంతేకాకుండా ప్రముఖ టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రధాన కంపెనీలను సైతం కొనుగోలు చేసింది. ఇలా క్రమక్రమంగా టాటా దేశీయ సంస్థ నుంచి గ్లోబల్ పవర్ హౌస్ గా మారింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు.. టాటా నానోను ఈయన హయాంలో ప్రవేశ పెట్టడం విశేషం. అదేవిధంగా దాని సాఫ్ట్ వేర్ సేవల విభాగం టాటా కన్సల్టెన్సీ -టీసీఎస్ ను ప్రపంచ ఐటీ అగ్రగామీగా విస్తరింపజేశారు. 2012లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తరువాత టాటా సన్స్ మరియు టాటా మోటార్స్, టాటా స్టీల్ తో సహా ఇతర గ్రూప్ కంపెనీలకు చైర్మన్ ఎమెరిటస్ గా ఎంపికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *