ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోల్లప్రోలు బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగు సంవత్సరాలుగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించారు. ఆయన సూచనల మేరకు CSR నిధుల ద్వారా రూ. 4 లక్షలతో ఆర్‌ఒ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది.
గత నాలుగు సంవత్సరాలుగా రక్షిత త్రాగునీరు సదుపాయం లేక విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమీపంలోని శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ వద్ద మంచినీరు వస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించారు. రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి వారిని ఒప్పించారు. 4 లక్షల CSR ( Corporate Social Responsibility) నిధులతో ఆర్వో ప్లాంట్ కు రైస్ మిల్ నుండి మంచినీటి సరఫరా ఏర్పాటు చేయడం కోసం డెడికేటెడ్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు స్వచ్ఛమైన రక్షిత త్రాగునీరు అందించేలా వెంటనే చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం, శ్రీ వేంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.