Vrushabha Rasi Phalalu 2026: వృషభరాశి సంవత్సర ఫలము 2026-2027

Read Time:  1 min
Vrushabha Rasi Phalalu 2026: వృషభరాశి సంవత్సర ఫలము 2026-2027
FONT SIZE
GET APP


Vrushabha Rasi Phalalu 2026: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల యందు పుట్టినవారు మరియు “ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, నె, వో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు వృషభరాశికి చెందినవారు.


2026-2027 సంవత్సర ఫలితములు వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ద్వితీయం, తృతీయం, చతురంలో గురువు, చతుర్ద, తృతీయంలో కేతువు, దశమం, భాగ్యంలో రాహువు, లాభంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశి జన్మించిన వారు లక్ష్మీనారాయణ పాశుపత హెూమం జరిపించండి. చేతికి శక్తి కంకణం ధరించండి. నూతన స్వగృహం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన ఫలితాలు అందుకో గలుగుతారు. స్నేహితుల ద్వారా సన్నిహితుల ద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. దూరాన ఉ న్న ఆత్మీయుల ద్వారా ఎప్పటికప్పుడు మంచి సమాచారాన్ని గ్రహించుకుంటారు.

Vrushabha Rasi Phalalu 2026: వృషభరాశి సంవత్సర ఫలము 2026-2027

విదేశాలలో ఉన్న వారితోటి సత్సంబంధాలను ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు వాళ్లకు మంచి సలహాలు సూచనలు ఇవ్వటము, వాళ్ల ద్వారా ప్రయోజనాలను పొందటము జరుగుతుంది నూతన వస్తువులు వస్త్రాభరణాలు సువర్ణాభరణాలను ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను కొనుగోలు చేస్తారు. మనస్ఫూర్తిని సంతోషాన్ని కలిగి ఉంటారు ఎన్నో రకాల సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాము. మన జీవితంలో మనం ఈ స్థాయికి ఎదుగుతామని ఎవరు ఊహించలేదు దైవ బలం తోడుగా ఉంది. చేసిన కష్టం అక్కరకొచ్చి సుఖంగా ఉన్నాము అన్న ఆలోచనలు ఏర్పడతాయి. కుటుంబంలో కొంతమందిలో మాత్రం ఈ కృతజ్ఞతా భావము సంతోషము కనిపించకపోవచ్చు. ఎంత ఉన్న ఏదో ఒక ఏడుపు ఏమి జరిగినా ఓ సంతోషం అనేది కలగదు. వాళ్ళ జీవితాలలో మీరు మార్పు తీసుకురాలేరని గట్టిగా నిర్ణయించుకొని వీటన్నిటికీ దూరంగా ఉంటారు. లైసెన్సులు రెన్యువల్సు లీజులు కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులను దక్కించు కోగలుగుతారు. మీకున్న మంచి పేరు కారణంగా మీరు చేసినటువంటి ప్రయత్నాలలో శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. కొన్ని అవసరాల నిమిత్తం స్నేహితులను ఆర్థిక సహాయము కోరుతారు. అవి మీకు లభిస్తాయి.

విద్య ఉన్నత విద్య విదేశాలలో విద్యా అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు కొత్త భాషలపట్ల నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను అందజేస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలను అందుకుంటారు. గొప్ప కళాశాలలో సీటుని పొందగలుగుతారు. మీ కోరిక మేరకు మంచి సబ్జెక్ట్ని కూడా పొందగలుగుతారు కొన్ని వస్తువులు కొన్ని వనరులు లోటు ఏర్పడవచ్చు. అయినప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొన్ని విలాసాలకు దూరంగా ఉంటే మంచిదని భావిస్తారు. కొంతకాలం ఉ పాధ్యాయులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువలన ఎడిషనల్గా ట్యూషన్లు పెట్టించుకుని టైం ఎక్కువ కేటాయించి శ్రద్ధ పెట్టి చదువుకొని ఆ లోటుని భర్తీ చేసుకుంటారు. ఈ నిమిత్తం ధనం ఊహించని స్థాయిలో ఖర్చు అవుతుంది మీరు దాచాలనుకున్న ధనము మంచికే ఖర్చయ్యే విధంగా ఉంటుంది.

Vrushabha Rasi Phalalu 2026: వృషభరాశి సంవత్సర ఫలము 2026-2027

మీ పనులలో మీ వ్యవహారాలలో మీకు సహాయం చేయడానికి కొంతమంది మక్కువ చూపిస్తారు. వీళ్ళ సహాయం పూర్తిగా పొందటానికి మీ మనసు అంగీకరించదు. కొంతకాలం సరేనని కొంతకాలం ఆపి ఈ విధమైనటువంటి పనులను మీరు చేస్తారు. ఈ కారణంగా వాళ్లంటే మీకు నచ్చదని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయడం లేదని వాళ్ళు బాధపడి మీకు దూరం జరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆర్ధిక పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగరీత్యా మంచి స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు లు నైపుణ్యత ఎప్పటికప్పుడు వెలుగు చూస్తాయి. మీరు ప్రతి ఒక్క సమస్యని దాటగలుగుతారు. ప్రస్తుతం ఉన్న లోకం తీరు విధానంతో పోటీ పడగలుగుతారు. ప్రతిదీ డబ్బుతోనే కదా ముడిపడి ఉంది ఉద్యోగం ఉంటే ధనం ఉంటుంది. ఉద్యోగం లేకపోతే ఏమీ ఉండవు ఈ రకమైన స్థితి నుంచి ఇప్పుడు బయటపడ్డాము. కాస్త నిల దొక్కుకోగలుగుతున్నాము అన్న ధైర్యాన్ని మనస్ఫూర్తిని కలిగి ఉంటారు.

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.