हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Ramayapatnam: రామాయపట్నం పోర్టు నిర్మాణ గడువు పెంపు

Anusha
Ramayapatnam: రామాయపట్నం పోర్టు నిర్మాణ గడువు పెంపు

విజయవాడ : రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ గడువు పెంపు, పోర్టు డ్రామ్ని 16 మీటర్ల నుంచి 18.5 మీటర్లకు పెంపు ప్రతిపాదనల్ని పరిశీలించి సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పెట్టుబడులు, మౌలిక వసతుల మంత్రి బిసి జనార్ధనరెడ్డి (BC Janardhana Reddy), పర్యాటక శాఖ మంత్రి కందుల దర్గేష్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శి కన్వీనర్గా వ్యవహరిస్తారు. రామాయపట్నం పోర్టు పనుల్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ సీఎల్), అరబిందో రియల్టీ లిమిటెడ్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన సంస్థ(జేవీ) దక్కించుకుంది.

గడువు పొడిగించాలని

మొదట నిర్దేశించిన గడువు ప్రకారం రూ.4,929.39 కోట్లతో చేపట్టే తొలి దశ పనుల్ని 2025 జూన్ 23కు పూర్తి చేయాలి. కానీ పనులు నిలిచిపోవడం, గుత్తేదారు సంస్థకు భూమి అప్పగించడంలో జాప్యం, ఇతర అంశాల్ని పరిగణనలోకి తీసుకొని గడువు పొడిగించాలని ఈ నెల నాలుగో తేదీన జరిగిన ఈపీసీ కమిటీ (EPC Committee) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దాని ఆధారంగా 2026 ఏప్రిల్ 27వ తేదీ వరకు గడువు పొడిగించాలని ఏపీ మారిటైమ్ బోర్టు సీఈఓ ప్రభుత్వానికి లేఖ రాశారు. మరో పక్క పోర్టు లోకి కేప్ సైజ్, సూపర్ కేప్ సైజ్ నౌకలు వచ్చేందుకు వీలుగా ప్రతిపాదిత డ్రాఫ్ట్, 16 మీటర్ల నుంచి 18.5 మీటర్లకు పెంచేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి విజప్తి చేశారు.

Ramayapatnam: రామాయపట్నం పోర్టు నిర్మాణ గడువు పెంపు
Ramayapatnam: రామాయపట్నం పోర్టు నిర్మాణ గడువు పెంపు

అవసరమైన మార్గదర్శనం

దీని కోసం అప్రోచ్ ఛానల్, బెర్త్ పాకెట్స్ లో అదనపు డ్రెడ్జింగ్, ప్రతిపాదిత బ్యాకప్ యార్డ్ వరకు అదనపు రైల్వే లైన్ల నిర్మాణం, కార్గో నిల్వ, ట్రక్ల రాకపోకలు,మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాల కోసం బ్యాకప్ యార్ట్ సదుపాయాల అభివృద్ధి, అదనపు రోడ్డు కనెక్టివిటీ (Road connectivity), పోర్టు లోపల అంతర్గత రోడ్డు కనెక్టివిటీ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుందని, దానికి అవసరమైన మార్గదర్శనం చేయాలని మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రభుత్వాన్ని కోరారు. దానిపై ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. వీలైనంత త్వరగా నివేదిక అందచేయాలని సూచించింది.

విజయవాడ లో చూడవలసిన ప్రదేశాలు?

విజయవాడలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు: కనకదుర్గమ్మ ఆలయం, ఉండవల్లి గుహలు, ప్రకాశం బ్యారేజి, భవానీ ద్వీపం, గాంధీ కొండ. 

విజయవాడ నగర విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు?

1981లో ఈ మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 1985లో గుణదల, పటమట ,భవానీపురం గ్రామ పంచాయతీలు,పాయకపురం, కుందవారి కండ్రిక అనే రెండు గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం చేయబడ్డాయి. కార్పొరేషన్ మొత్తం వైశాల్యం 61.88 చదరపు కి.మీ.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Tirumala: శ్రీరంగం నుండి తిరుమలేశునికి పట్టువస్త్రాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870