Rain alert : ఓవైపు ఎండ తీవ్రత మరో వైపు వర్షాలతో ఏపీ, తెలంగాణలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం భరించలేని ఉక్కపోత ఉంటోంది, సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. భారీ ఇదరుగు గాలులతో కూడిన వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంతకీ ఏయే జిల్లాల్లో వర్షం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

8 గంటలకే సూర్యుడు భగభగలు
ప్రస్తుతం వేసవి తీవ్రతతో పాటు తేమ కూడా ఎక్కువగా ఉండటంతో, జనం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తేమ శాతం 42% నుంచి 50% మధ్యగా ఉండడంతో ఉదయం భరించలేని ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 8 గంటలకే సూర్యుడు భగభగలు జనాలను చిరాకు పెడుతున్నాయి. సాయంత్రం కాగానే వాతావరణం మారిపోతోంది. ఆకాశం మేఘాలతో కమ్ముకొని, పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు కూడా నమోదవుతున్నాయి.
రెండు రోజుల పాటు తుఫానులు, ఈదురుగాలుల అవకాశం
ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఇలా కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే 48 గంటల (మధ్యస్థ స్థాయి హెచ్చరిక) జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు తుఫానులు, ఈదురుగాలుల అవకాశం ఉన్న జిల్లా పేర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి.
Read Also: హైడ్రా లాగా మేము ‘కోబ్రా’ తీసుకు వస్తాం: బీఆర్‌ఎస్ నేతలు