हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Chenab Rail Bridge : వ‌ర‌ల్డ్‌లోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారభించబోతున్న ప్రధాని

Sudheer
Chenab Rail Bridge : వ‌ర‌ల్డ్‌లోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారభించబోతున్న ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) జూన్ 6వ తేదీన జమ్మూ కశ్మీర్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చీనాబ్ నది(Chenab Rail Bridge)పై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇది అతివేగంగా జరిగిన ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇటీవలే ఏప్రిల్ 22న పెహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత ప్రధాని మళ్లీ జమ్మూ కశ్మీర్‌కు వెళ్తుండడం ఇది మొదటిసారి కావడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

భూకంపాలు, గాలివానలు, భారీ వర్షాలకు కూడా తట్టుకుంటుంది

ఈ రైల్వే బ్రిడ్జ్‌ను ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే మార్గంలో భాగంగా నిర్మించారు. బ్రిడ్జ్ నిర్మాణం అత్యంత శక్తివంతంగా, విపత్తులకు తట్టుకునేలా చేయబడింది. భూకంపాలు, గాలివానలు, భారీ వర్షాల వంటి ప్రకృతి విపత్తుల నుంచి ఇది రక్షణ కలిగించేలా రూపొందించబడింది. ఇది నూతన భారత్ శక్తిని, విజన్‌ను ప్రతిబింబించే చిహ్నంగా నిలుస్తుందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో బ్రిడ్జ్ నిర్మాణం

ఈ బ్రిడ్జ్ సముద్ర మట్టానికి 358 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎత్తులో ఉండడం గమనార్హం. చీనాబ్ నదిపై ఇంత భారీ మరియు సాంకేతికంగా నూతనత కలిగిన నిర్మాణం చేయడం భారతదేశ ఇంజినీరింగ్ విజ్ఞానానికి ఒక గొప్ప మైలురాయిగా చెప్పవచ్చు. ప్రపంచంలోనే అత్యుత్తమ రైల్వే మౌలిక సదుపాయాల్లో ఇది ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది.

Read Also : Coolie: ఆగస్టు 14న భారీస్థాయిలో కూలీ విడుదలకు సన్నాహాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870