స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Prime Minister Modi participated in the cleanliness drive

న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. చీపురు ప‌ట్టి ఆయ‌న చెత్త‌ను ఊడ్చేశారు. త‌న ఎక్స్ అకౌంట్‌లో ఆయ‌న కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. ఈరోజు గాంధీ జ‌యంతి అని, యువ స్నేహితుల‌తో క‌లిసి స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాన‌ని, మీరు కూడా ఇలా స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని కోరుతున్న‌ట్లు మోడీ తెలిపారు. స్వ‌చ్ఛ‌తా భార‌త్ మిష‌న్‌ను మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని ఆయ‌న కోరారు. హైద‌రాబాద్‌లో కేంద్ర మంత్రి కిష‌ణ్ రెడ్డి, పోరుబంద‌ర్‌లో మాన్సూక్ మాండ‌వీయ‌.. స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.