President Droupadi Murmu Address to the Houses of Parliament

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

న్యూఢిల్లీ: నేటి నుండి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన తర్వాత ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సర్వే గత సంవత్సరంలో ప్రభుత్వం పనితీరుపై సమగ్ర విశ్లేషణను అందించే వివరణాత్మక రిపోర్ట్‌కార్డ్‌ లాంటిది. ఈ సర్వే జీడీపీ, వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి వివిధ కీలక విషయాల గురించి వివరిస్తుంది. ఇక రేపు అంటే శనివారం పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పిస్తారు.

కాగా, జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వక్ఫ్‌(సవరణ) బిల్లు, బ్యాంకింగ్‌ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. ఈ నేపథ్యంలో గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీల్లో మెజార్టీని ఉపయోగించి అజెండాను కేంద్రం బలవంతంగా రుద్దుతున్నదని విపక్షాలు ఆరోపించాయి.

Related Posts
తెలంగాణలో మళ్లీ మొదలుకాబోతున్న కులగణన సర్వే
Caste Census bhatti

మరోసారి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కులగణన సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన Read more

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన సీఎం రేఖా గుప్తా
CM Rekha Gupta met the President and Vice President

ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన సీఎం రేఖా గుప్తా న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ Read more

నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు
CNG Haryana

హరియాణా ఎన్నికల కౌంటింగ్లో మొదట కనిపించిన ఫలితం పూర్తిగా మారిపోవడంతో కాంగ్రెస్ సపోర్టర్స్ తీవ్ర నిరాశ చెందారు. తొలి అరగంటలో 50+ స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉండటంతో Read more

డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్ హెచ్చరిక
tarrif

ఈ జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ప్రపంచంలో మరో టారిఫ్ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రంప్, BRICS దేశాలు అమెరికా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *