Preparations underway for auction of 'Golconda Blue' diamond

Golconda Blue diamond :’ గోల్కొండ బ్లూ’ వజ్రం వేలంపాటకు సన్నాహాలు..

Golconda Blue diamond : భారతీయ రాజుల దగ్గర ఉన్న అరుదైన వజ్రం’ గోల్కొండ బ్లూ’ ను వేలం వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇందౌర్‌, బరోడా మహారాజుల వద్ద ఉన్న విలువైన సంపదలో ఇదీ ఒకటి. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో జరిగే “క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్” సేల్‌లో వేలం వేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వేలంలో దీని ధర దాదాపు రూ.430కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాని రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో “ది గోల్కొండ బ్లూ” ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisements
  గోల్కొండ బ్లూ వజ్రం వేలం

అది బరోడా మహారాజు వద్దకు చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొల్లూరులో ఈ వజ్రం లభ్యమయినట్లు తెలుస్తోంది. పూర్వం ఇందౌర్‌ను పరిపాలించిన మహారాజా యశ్వంత్‌ రావు హోల్కర్‌-ll వద్ద ఇది ఉండేది. 1923లో మహారాజా తండ్రి దీనిని ఓ బ్రాస్‌లెట్‌లో పొదిగించారు. అనంతరం ఆభరణాలను రీడిజైన్‌ చేయడంలో భాగంగా ఇందౌర్‌ పియర్‌ వజ్రాలతో చేసిన నెక్లెస్‌లో “ది గోల్కొండ బ్లూ” ను అమర్చారు. ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌటెట్ డి మోన్వెల్ అప్పట్లో గీసిన ఇందౌర్‌ మహారాణి చిత్రపటంలో ఆమె ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 1947లో ఈ వజ్రాన్ని ప్రఖ్యాత న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశాడు. తర్వాత అది బరోడా మహారాజు వద్దకు చేరుకుంది. అనంతరం దీనిని ఓ ప్రైవేటు సంస్థ సొంతం చేసుకుంది.

Related Posts
రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
Minister strong warning to registration department employees

తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా, ఉద్యోగులు Read more

Revanth Reddy : 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజన
Revanth Reddy 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజన

Revanth Reddy : 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజన తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది. ఈ బిల్లును 59 ఎస్సీ కులాలను Read more

ఆప్ ఓటమి పై స్వాతి మాలీవాల్ ట్వీట్
Swati Maliwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం 'ద్రౌపది Read more

మస్క్ యొక్క మార్స్ ప్రాజెక్ట్ : స్టార్షిప్ టెస్ట్‌లో సాంకేతిక సవాళ్లు
starship failure

స్పేస్ఎక్స్ కంపెనీ తమ స్టార్షిప్ రాకెట్‌ను టెక్సాస్‌లోని ప్రణాళిక ప్రకారం ప్రయోగించగా,ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.స్టార్షిప్ రాకెట్ పరీక్షా ప్రొగ్రామ్‌ లో భాగంగా, దీని సూపర్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×