జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి దేశమంతా షాక్‌కు గురిచేసింది.ఈ ఘటనపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రమైన భావోద్వేగంతో స్పందించారు.ఈ దాడి కేవలం పర్యాటకులపై కాదు, కశ్మీర్ యొక్క గౌరవంపైనే జరిగిన దాడిగా అభివర్ణించారు.ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా, ‘ఎక్స్’ లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు.”ఇలాంటి దారుణాలు జరిగినప్పుడల్లా మనం మనుషులమా? అనే సందేహం వస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పర్యాటకుల్ని స్వాగతించాల్సిన ప్రదేశం వారిని కాల్చి చంపే ప్రదేశంగా మారిందంటే, అది మన సమాజానికి పెద్ద మచ్చ అని అన్నారు.మన ఇంటికి అతిథిగా వచ్చినవారిని కాల్చి చంపారు.వారిని మేము కరుణగా స్వాగతించాలి.

కానీ, వాళ్లు బాధతో వెనుదిరిగారు.ఇది మన సంస్కృతికి ఆవమానం, అంటూ ప్రకాశ్ రాజ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.కశ్మీరీల ఆథ్యంపై నమ్మకాన్ని తుంచివేసే చర్యగా ఈ దాడిని పేర్కొన్నారు.ఈ దారుణ దాడిని కేవలం ఖండించడం సరిపోదని, కశ్మీరీలంతా మౌనాన్ని విడిచి, ఒక్కసారి గట్టిగా నిదర్శనంగా మాట్లాడాల్సిన సమయం వచ్చిందని ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు.”ఇది నిజమైన కశ్మీరీలు చేసిన పని కాదు. మేము హింసకు ఉపకరిస్తే, మానవత్వానికి మనం మిగిలేది ఏముంటుంది?”అని ప్రశ్నించారు.ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద ఉద్దేశాలు ఏమిటన్నది ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. “పిల్లల్ని అనాథలుగా మార్చే చర్యలు మానవత్వానికి ద్రోహం. ఇది బలహీనత, పిరికితనాన్ని సూచించే పని,” అని చెప్పారు. ఈ బాధను మరిచిపోవడం కష్టం అని తెలిపారు.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన గాఢమైన సానుభూతిని తెలియజేశారు. “మీరు కశ్మీర్‌కి ప్రశాంతత కోసం వచ్చారు. కానీ మేము దానిని కాపాడలేకపోయాం. దానికి మేము క్షమాపణ చెబుతున్నాం,” అంటూ హృదయాన్ని తాకే మాటలతో తన పోస్టును ముగించారు.
Read Also : Tourist Killing : నా భర్తను కళ్లెదుటే కాల్చివేశారు : భరత్ భూషణ్ భార్య