మోదీకి బార్బడోస్‌ అత్యున్నత పురస్కారం

మోదీకి బార్బడోస్‌ అత్యున్నత పురస్కారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. బార్బడోస్ దేశం ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో సమర్థమైన వ్యూహాత్మక నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తింపుగా ఈ అవార్డును ప్రధానం చేశారు. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ తరపున విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

Advertisements

అవార్డు  ప్రకటన

2024 నవంబర్ 20న గయానాలో జరిగిన రెండో ఇండియా-CARICOM లీడర్స్ సమ్మిట్ సందర్భంగా బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ ఈ అవార్డును ప్రకటించారు. మహమ్మారి సమయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. భారతదేశం-బార్బడోస్ మధ్య సంబంధాలను మరింత బలపరిచేలా ఈ పురస్కారం నిలుస్తుందని ప్రధాని మియా మోట్లీ తెలిపారు.

మోదీ స్పందన

ఈ అరుదైన గౌరవంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బార్బడోస్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును 1.4 బిలియన్ల భారతీయులకు అంకితం చేస్తున్నానని, భారతదేశం-బార్బడోస్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ఈ గుర్తింపు సంకేతమని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారతదేశం-బార్బడోస్ సంబంధాలు

భారతదేశం-బార్బడోస్ మధ్య 1966 నుంచి దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి సహకారం, వ్యాపార ఒప్పందాలు, ఆరోగ్యరంగ సహాయాలు, విద్య సహకారం వంటి విభాగాల్లో ఉభయ దేశాలు అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. బార్బడోస్ సహా కరీబియన్ దేశాలకు భారతదేశం కొవిడ్-19 మహమ్మారి సమయంలో టీకాలు, వైద్య సామగ్రి, ఆర్థిక సహాయం అందించింది.

ప్రధాని మోదీకి లభించిన ఈ పురస్కారం భారతదేశం యొక్క అంతర్జాతీయ నాయకత్వానికి, సహకార దృక్పథానికి నిదర్శనం. మహమ్మారి సమయంలో భారతదేశం అందించిన సహాయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పురస్కారం బార్బడోస్-భారతదేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది.విలువైన సహాయాన్ని గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన ‘గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ అవార్డును ప్రదానం చేసింది.ప్రధానమంత్రి తరపున అవార్డును అందుకున్న మార్గెరిటా.. ఈ గుర్తింపునకు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరుఫున ప్రాతినిధ్యం వహించడం, ఆయన తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం ఒక గొప్ప గౌరవం” అని పేర్కొన్నారు.

Related Posts
స్టాలిన్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్
stalin govt kishan reddy

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిభాషా విధానాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. భారతదేశ భాషా Read more

కదులుతున్న బస్సులో నుంచి దూకిన బాలికలు
పూణె నిందితుడి కేసు : పోలీసులకు అజిత్ పవార్ ఆదేశం

మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో డ్రైవర్, కండక్టర్, మరో ఇద్దరు వ్యక్తులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, వారిని చూస్తూ వాహనాన్ని ఆపడానికి నిరాకరించడంతో ఇద్దరు బాలికలు నడుస్తున్న బస్సులోంచి Read more

బడ్జెట్ పై ప్రముఖుల స్పందనలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టిన 8వ Read more

పుష్ప 2 నిర్మాతలు 50 లక్షల విరాళం
పుష్ప 2 నిర్మాతలు 50 లక్షల విరాళం

పుష్ప 2 తొక్కిసలాట బాధిత కుటుంబానికి చిత్ర నిర్మాత అందించిన 50 లక్షల చెక్కు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని, అల్లు అర్జున్ నటించిన Read more

×