సూడాన్ లో విమాన ప్రమాదం: 46 మంది మృతి

సూడాన్ లో విమాన ప్రమాదం: 46 మంది మృతి

సూడాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నివాసాల మధ్య ఓ సైనిక విమానం కూలడంతో 46 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా.. కర్రారి జిల్లాలోని ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు. మృతుల్లో సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని బుధవారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

v


ఉద్రిక్త పరిస్థితులు
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని మిలిటరీ అధికారులు చెప్పారు. దాదాపు రెండేళ్ల నుంచి సూడన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ మిలిటరీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ -ఆర్ఎస్ఎఫ్ దళాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా చాలా పట్టణ ప్రాంతాలు ధ్వంసమయ్యాయి.
యుద్ధం మరింత ఉద్రక్తంగా..
ఇటీవల కాలంలో ఈ యుద్ధం మరింత ఉద్రక్తంగా మారింది. ఆర్​ఎస్​ఎఫ్​దళాలపై సూడాన్ మిలిటరీ విరుచుకుపడుతోంది. డార్ఫర్​పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని నియంత్రించే ఆర్​ఎస్​ఎఫ్, నైలా ప్రాంతంలో సోమవారం తాము ఒక సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించడం గమనార్హం.
మరోవైపు, ఈ ప్రాంతంలో సామూహిక అత్యాచారాలు, జాతిరంగా ప్రేరేపితమైన హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యకం చేశాయి. ఇవి యుద్ధ నేరాలు, మానవాళిపై నేరాలని పేర్కొన్నాయి. డార్నర్ ప్రంంలో ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించాయి.

Related Posts
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నైజీరియా నుండి గౌరవం
nigeria

నైజీరియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా (GCON) అవార్డుతో సత్కరించనున్నది. ఈ గౌరవం, 1969లో క్వీన్ ఎలిజబెత్ Read more

డొనాల్డ్ ట్రంప్ 100% టారిఫ్ హెచ్చరిక
tarrif

ఈ జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ప్రపంచంలో మరో టారిఫ్ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ట్రంప్, BRICS దేశాలు అమెరికా Read more

గుండెపోటు నివారణకు అందుబాటులో వ్యాక్సిన్
గుండెపోటు నివారణకు అందుబాటులో వ్యాక్సిన్

ప్రస్తుతం గుండెపోటు, స్ట్రోక్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, చైనా శాస్త్రవేత్తలు అథెరోస్క్లెరోసిస్‌ను నిరోధించే సంభావ్య వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. అథెరోస్క్లెరోసిస్ అనేది ధమనులలో కొవ్వు ఫలకం పేరుకుపోవడం Read more

Telangana: సంగారెడ్డి లో ఘోరం..ముగ్గురు పిల్ల‌ల్ని హతమార్చిన తల్లి ఆపై ఆత్మహత్యాయత్నం..
Telangana: సంగారెడ్డి లో ఘోరం..ముగ్గురు పిల్ల‌ల్ని హతమార్చిన తల్లి ఆపై ఆత్మహత్యాయత్నం..

తెలంగాణ సంగారెడ్డి జిల్లా లో అమీన్‌పూర్‌లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఓ తల్లి తన ముగ్గురు పిల్లల జీవితాలను విషాదకరంగా ముగించిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. Read more