📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Golconda First Bonam: మొదలైన బోనాల ఉత్సవాలు..గోల్కొండ ఆలయంలో తొలి బోనం ఎందుకు?

Author Icon By Anusha
Updated: June 30, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగలలో బోనాలు ఒకటి. ఇది కేవలం భక్తి పరంగా కాక, సాంస్కృతికంగా, చారిత్రకంగా, నిలిచింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం, అప్పటి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అప్పటి నుంచీ ఈ పండుగ మరింత ఘనతతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది.ఇక ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు (Bonalu) ప్రారంభం అవుతాయి. నెల రోజుల పాటు భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి తమను సల్లంగా చూడమని వేడుకుంటారు.

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం

ఈ ఏడాది బోనాల సంబురం జూన్ 26, గురువారం నాడే మొదలు కాగా జులై 24న బోనాలు ముగుస్తాయి. బోనాల పండుగ సందర్బంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. మరి గోల్కొండ కోట (Golconda Fort) లోనే తొలి బోనం ఎందుకు సమర్పిస్తారు.ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి మొదలైంది. ప్రాముఖ్యత ఏంటి వంటి వివరాలు మీ కోసం.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ ఆలయం

ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. దీనిలో భాగంగానే గోల్కొండ జగదాంబిక ఆలయం (Jagadambika Temple) నుంచి బోనాల సంబరాలు మొదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత జులై 13వ తేదీన సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. వీటినే లష్కర్‌ బోనాలు అని కూడా అంటారు.

లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారికి

సికింద్రాబాద్‌లో బోనాలు సమర్పించిన మరుసటి రోజు భవిష్యవాణి తెలిపే రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత జులై 21వ తేదీన పాతబస్తీ (Patha Basthi) లోని లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. చివరికి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి.

గోల్కొండలోనే తొలి బోనం ఎందుకు?

హైదరాబాద్ బోనాల ఉత్సవాలకు సుమారు 600 ఏళ్లకు పైగా చరిత్ర ఉందంటున్నారు. సర్వాయి పాపన్న కరీంనగర్‌లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారనే కథ ప్రచారంలో ఉన్నాయి. అలానే గోల్కొండ కోట (Golconda Fort) కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారని, ఆ తర్వాత గోల్కొండను జయించిన కుతుబ్‌షాహీలు సైతం ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని చారిత్రాత్మక ఆధారాలు చెబుతున్నాయి.

గోల్కొండ కోటలో

హైదరాబాద్‌కు సంబంధించిన చారిత్రక ఆధారాల ప్రకారం, 1675లో కుతుబ్‌షాహీ పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. కుతుబ్‌షాహీ వంశానికి చెందిన ఏడవ, చివరి చక్రవర్తి అబుల్ హసన్ తానీషా (Abul Hassan Tanisha) వద్ద మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాదన్న, గోల్కొండ కోటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం మనం కొలుస్తున్న జగదాంబిక అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ది చెందింది. 600 వందల ఏళ్లకు పైగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.

ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం

కుతుబ్‌షాహీ పాలకుల్లో అబుల్ హసన్ తానీషాకు ప్రత్యేక చరిత్ర ఉంది. మతసామరస్యం పాటించిన పాలకుడిగా, హిందువులకు కూడా మంచి పదవులు ఇచ్చిన రాజుగా చరిత్రకారులు ఆయనను పొగిడారు. అందుకు నిదర్శనమే మాదన్న (Maadanna) కు మంత్రి పదవి ఇవ్వడమే కాక, గోల్కొండలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వడమని చరిత్రకారులు అంటున్నారు. అంతేకాక ఆయన పలు హిందువుల పండుగల్లో స్వయంగా పాల్గొనేవాడని చరిత్ర చెబుతుంది.

అమ్మవారికి తొలి బోనం సమర్పించే వారు

హైదరాబాద్‌లో కుతుబ్‌షాహీల కాలం నుంచే బోనాలు నిర్వహిస్తుండగా అప్పటికే గోల్కొండ కోటలో కొలువైన అమ్మవారికి తొలి బోనం (First Bonam) సమర్పించే వారు. ఆ తర్వాతనే భాగ్యనగరంలో నెల రోజు పాటు బోనాల ఉత్సవాలు కొనసాగేవి. ఇన్ని వందల ఏళ్లుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తూ తొలి బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నారు.

బోనాలు ప్రారంభమైన

ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబురాలు మొదలవుతాయి. పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అలానే బోనాలు ప్రారంభమైన తర్వాత వచ్చే ప్రతి గురు, ఆదివారాలు అమ్మవారికి (Ammavariki) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనాల తొలి రోజు పంచామృతాలతో అమ్మను పూజి చివరగా రోజు పూజలో భాగంగా సమారోహణ కుంభహారతి కార్యక్రమం నిర్వహించడంతో బోనాలు ముగుస్తాయి.

Read Also: Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు

#Bonalu2025 #BonaluCelebrations #BonaluFestival #BonaluVibes #GoddessMahankali #HyderabadBonalu #SouthIndiaFestivals #TelanganaBonalu #TelanganaCulture #TraditionalFestival Bonalu 2025 date Bonalu festival Telangana Bonalu history in Telugu Bonalu significance Bonalu tradition women Bonam offering goddess Breaking News in Telugu Google news Google News in Telugu Hyderabad Bonalu celebrations Latest News in Telugu South India festivals list Telangana cultural festivals Telangana state festival Telugu News Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.