భారతదేశం అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆధ్యాత్మికత, యోగం, సంస్కృతి. కానీ ఇవి మాత్రమే కాదు – మన దేశ చరిత్ర, సంప్రదాయాలు, చారిత్రక నిర్మాణాలు, శిల్పకళా వైభవం కూడా విదేశీయులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మన ప్రాచీన కోటలు (Forts). ఇవి చరిత్రను జీవించగలిగే జీవన్మయ సంపదగా నిలుస్తున్నాయి.
Mehrangarh (మెహ్రాన్‌గఢ్)
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్‌గఢ్‌ను 15వ శతాబ్దంలో రావు జోధా నిర్మించారు. ఈ కోట దాదాపు 400 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై నిర్మించబడింది.
Chittorgarh Fort (చిత్తోర్‌గఢ్ కోట)
భారతదేశంలోని అతిపెద్ద కోటల జాబితాలో మొదటి స్థానంలో రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ కోట నిలుస్తుంది. ఇది దాదాపు 700 ఎకరాల్లో విస్తరించి ఒక కొండపై ఉంది.
Gwalior Fort (గ్వాలియర్ కోట)
గ్వాలియర్ కోట భారతదేశంలోని అతిపెద్ద, బలమైన కోటలలో ఒకటి. ఇది దాదాపు 3 కిలోమీటర్ల పొడవు .. 1 కిలోమీటర్ వెడల్పు కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది నిటారుగా ఉన్న కొండపై నిర్మించబడింది.
Golconda Fort (గోల్కొండ కోట)
గోల్కొండ కోట పాత హైదరాబాద్‌లో ఉంది. ఇది దాదాపు 11 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది కుతుబ్ షాహి రాజవంశం రాజధానిగా ఉండేది. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది.
Red Fort (ఎర్రకోట)
ఢిల్లీ ఎర్రకోట గురించి అందరికీ తెలుసు. ఇది మన దేశంలోని అతిపెద్ద, అత్యంత అందమైన కోటలలో ఒకటి. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1648 లో నిర్మించాడు.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.