భారతదేశంలో భోజనం అనగానే మన మెదడులో మొదటగా అరటి ఆకులోనే భోజనం చేయడం గుర్తుకు వస్తుంది. పాతకాలం నుండి ఈ సంప్రదాయం ప్రతి కుటుంబంలో, పెళ్లిళ్లు, పండుగలు, ఆచారాలు జరుపుకునే సందర్భాల్లో విస్తృతంగా ఉండింది. అరటి ఆకు (Banana leaf) లోనే విందు పెట్టడం కేవలం ఆచారపరమైనదే కాకుండా, ఆరోగ్య పరమైన, పర్యావరణ హితమైన విధానంగా కూడా పరిగణించబడుతుంది.
సంప్రదాయం
అయితే ఇప్పటి కాలంలో ఈ సంప్రదాయం చాలా తగ్గిపోయింది. బదులుగా ప్లాస్టిక్ ప్లేట్లు, కాగితపు ప్లేట్లు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. కానీ, అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలు ఇప్పటికీ మనం మర్చిపోకూడదు.
యాంటీ ఆక్సిడెంట్లు మెండు
అరటి ఆకే కదా అని తీసి పారేయడానికి వీల్లేదు. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాలు, గ్రీన్ టీలో కూడా కనిపిస్తాయి. ఈ ఆకులో భోజనం చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా అందుతాయి.
సూక్ష్మ క్రిములను దూరం చేస్తుంది
అరటి ఆకులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఆహారంలోని సూక్ష్మ క్రిములను దూరం చేస్తుంది.
ధర తక్కువ
అరటి ఆకుల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదే కాదు. వీటి ధర కూడా చాలా తక్కువ. కాబట్టి వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు.
పర్యావరణానికి అనుకూలం
ఇప్పుడు భోజనం చేసే ప్లాస్టిక్ ప్లేట్స్ (Plastic plates) కంటే.. అరటి ఆకుల్లో భోజనం చేయడం వల్ల పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి భూమిలో త్వరగా ఇంకిపోతాయి. పర్యావరణానికి చాలా మంచిది.
పరిశుభ్రంగా ఉంటుంది
ఇతర పాత్రలు, ఆకుల కంటే పోల్చితే అరటి ఆకుల్లో తినడం చాలా మంచిది. కేవలం వీటిని నీటితో కడిగి ఉపయోగిస్తే చాలు. అరటి ఆకులపై మైనపు పూత ఉంటుంది.