Former MLA Jaipal Yadav

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. మరో బీఆర్‌ఎస్‌ నేతకు నోటీసులు జారీ

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటీకే బీఆర్‌ఎస్‌ నేత కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసుల ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా, ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. అయితే నోటీసులు అందుకున్న వెంటనే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీ సీసీపీ వెంకటగిరి జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు.

మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కాగా.. రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. కాగా, ఇటీవలే ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేసిన విచారణ అధికారి… ఇప్పుడు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను విచారణకు పిలిచారు.

Related Posts
మణిపుర్ కు వెళ్లండి మోదీజీ.. రాహుల్ వినతి
modi rahul

మణిపుర్లో పర్యటించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని PM మోదీని రాహుల్ గాంధీ మరోసారి కోరారు. మణిపుర్లో మళ్లీ హింస చెలరేగడంపై ఆయన ఆందోళన Read more

నేడు హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు
CM Chandrababu is coming to Hyderabad today

హైదరాబాద్‌: ఈరోజుఉదయం హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. శంషాబాద్ లో మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించునున్నారు. ఇవాళ Read more

విచారణకు హాజరైన అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి
Arvind Kumar, BLN Reddy, who have appeared for ACB and ED investigation

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Read more

కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎంపీ
cr 20241012tn670a336aa1223

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను, ఉద్యమకారులను మోసం చేశారని, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *