అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. రోజుకో షాకింగ్ డెసిషన్ తీసుకుంటూ పలు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా అగ్రరాజ్యంలోని కెనడా,మెక్సికోతో పాటు చైనాపైనా ట్రంప్ భారీగా టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. కెనాడాపై ట్రంప్ 25శాతం టారిఫ్ ను విధించి అందర్నీ షాక్ కు గురిచేశాడు.ట్రంప్ నిర్ణయంపై కెనడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కెనడా దేశస్థులు అమెరికా ఎంత ఫైర్ మీద ఉన్నారో ఈ ఘటనే నిదర్శనంగా చెప్పొచ్చు. కెనడాలోని ఒట్టావా నగరంలో తాజాగా హాకీ టోర్నమెంట్ జరిగింది. అయితే ఆట ప్రారంభం ముందు ప్లేయర్స్ అంతా జాతీయగీతాన్ని ఆలపించడం ఆనవాయితీ. ఒట్టావాకు చెందిన సింగర్ మండియా.. అమెరికా జాతీయగీతాన్ని ఆలపించడం ప్రారంభించింది. దీంతో ప్లేయర్స్ తోపాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఆ గీతాన్ని పాడేందుకు నిరాకరించారు. జాతీయ గీతం పాడొద్దంటూ వాదించారు. ఆ తర్వాత సింగర్ మండియా కెనడా జాతీయ గీతం పాడారు. ఆ పాటను మాత్రం ప్రేక్షకులు వంతపాడారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని పలువురు క్రిటిక్స్ చెప్తున్నారు.

ట్రంప్ యూటర్న్
కెనడా, మెక్సికో దేశాల్లో టారిఫ్ విధించిన తర్వాత ఆ దేశాల్లో అమెరికాపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలు అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు విముఖత వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం ఉత్పత్తుల్ని నిషేధిస్తున్నారు. ప్రపంచ దేశాలు సైతం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ అనూహ్యంగా వెనకడుగు వేశారు. రెండు దేశాలపై విధించిన టారిఫ్ ను నిలిపివేశారు. 30 రోజుల పాటు ఈ టారిఫ్ ను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ అధికారిక కార్యాలయం పేర్కొంది.